《古兰经》译解 - 泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。

external-link copy
12 : 5

وَلَقَدْ اَخَذَ اللّٰهُ مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۚ— وَبَعَثْنَا مِنْهُمُ اثْنَیْ عَشَرَ نَقِیْبًا ؕ— وَقَالَ اللّٰهُ اِنِّیْ مَعَكُمْ ؕ— لَىِٕنْ اَقَمْتُمُ الصَّلٰوةَ وَاٰتَیْتُمُ الزَّكٰوةَ وَاٰمَنْتُمْ بِرُسُلِیْ وَعَزَّرْتُمُوْهُمْ وَاَقْرَضْتُمُ اللّٰهَ قَرْضًا حَسَنًا لَّاُكَفِّرَنَّ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَلَاُدْخِلَنَّكُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۚ— فَمَنْ كَفَرَ بَعْدَ ذٰلِكَ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟

మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్ కు) పోవటానికి నాయకులుగా నియమించాము.[1] మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు నమాజ్ స్థిరంగా సలుపుతూ, విధి దానం (జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పి పోయిన వాడే!" info

[1] చూడండి, 5:20-26.

التفاسير: