[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
[2] యా-సీన్, ఈ రెండు అక్షరాలు కూడా, ఇతర అక్షరాల వలె ముఖత్తఆత్ లలోనివే! కావున వీటి నిజ అర్థం ఎవరికీ తెలియదు. కొందరు దీని అర్థం: 'ఓ మానవుడా!' అని అంటారు. మరికొందరు: 'ఇది దైవప్రవక్తను సంబోధిస్తుంది' అని అంటారు.
[1] చూఎవడైతే ఇస్లాంలో ఒక మంచి పనిని ప్రారంభిస్తాడో అతనికి అతనికి దాని పుణ్యఫలితం లభిస్తుంది. అంతేగాక, అతని తరువాత ఇతరులు దానిపై నడిస్తే - ఆ అనుసరించే, వారి పుణ్యంలో ఎట్టి తగ్గింపు లేకుండా - ఆ పుణ్యం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది. ఇక ఒకడు చెడ్డపని ప్రారంభిస్తే అతనికి దాని శిక్ష కాక, దానిపై నడిచే వారందరి పాపాల శిక్ష కూడా విధించబడుతుంది. (స'హీ'హ్ ముస్లిం). ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని కర్మలు ఆగిపోతాయి. మూడు విషయాలు తప్ప. 1) జ్ఞానం - దేనినైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 2) పుణ్యాత్ములైన సంతానం - ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారో! 3) 'సదఖహ్ జారియహ్ - దేనితోనైతే అతడు మరణించిన తరువాత కూడా, ప్రజలు లాభం పొందుతూ ఉంటారో! ('స'హీ'హ్ ముస్లిం).