《古兰经》译解 - 泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。

页码:close

external-link copy
111 : 16

یَوْمَ تَاْتِیْ كُلُّ نَفْسٍ تُجَادِلُ عَنْ نَّفْسِهَا وَتُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟

ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో![1] ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.[2] info

[1] పునరుత్థాన దినమున, ఒకరు మరొకరిని గురించి పట్టించుకోరు. తల్లిదండ్రులు తమ సంతానాన్ని లెక్క చేయరు. మరియు సంతానం తమ తోబుట్టిన వారిని గానీ, తల్లిదండ్రులను గానీ పట్టించుకోరు. ఇంకా చూడండి, 80:37. [2] పుణ్యం చేసిన వారికి, అల్లాహ్ (సు.తా.) కరుణిస్తే ఎన్నో రెట్లు అధికంగా పుణ్యఫలితం ప్రసాదిస్తాడు. కాని పాపం చేసిన వారికి దానంతట శిక్ష మాత్రమే విధిస్తాడు. శిక్షించుటలో ఎలాంటి అన్యాయం జరుగదు.

التفاسير:

external-link copy
112 : 16

وَضَرَبَ اللّٰهُ مَثَلًا قَرْیَةً كَانَتْ اٰمِنَةً مُّطْمَىِٕنَّةً یَّاْتِیْهَا رِزْقُهَا رَغَدًا مِّنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِاَنْعُمِ اللّٰهِ فَاَذَاقَهَا اللّٰهُ لِبَاسَ الْجُوْعِ وَالْخَوْفِ بِمَا كَانُوْا یَصْنَعُوْنَ ۟

మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతి దిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్నులయ్యారు), కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు. info
التفاسير:

external-link copy
113 : 16

وَلَقَدْ جَآءَهُمْ رَسُوْلٌ مِّنْهُمْ فَكَذَّبُوْهُ فَاَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظٰلِمُوْنَ ۟

మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్కరించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది. info
التفاسير:

external-link copy
114 : 16

فَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَیِّبًا ۪— وَّاشْكُرُوْا نِعْمَتَ اللّٰهِ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ ۟

కావున మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి. info
التفاسير:

external-link copy
115 : 16

اِنَّمَا حَرَّمَ عَلَیْكُمُ الْمَیْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِیْرِ وَمَاۤ اُهِلَّ لِغَیْرِ اللّٰهِ بِهٖ ۚ— فَمَنِ اضْطُرَّ غَیْرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జిబహ్ చేయబడినది (పశువు/పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.[1] info

[1] ఈ రెండూ 114, 115 ఆయతులు, 2:172, 173 ఆయతులను పోలి ఉన్నాయి. చూడండి, 6:145.

التفاسير:

external-link copy
116 : 16

وَلَا تَقُوْلُوْا لِمَا تَصِفُ اَلْسِنَتُكُمُ الْكَذِبَ هٰذَا حَلٰلٌ وَّهٰذَا حَرَامٌ لِّتَفْتَرُوْا عَلَی اللّٰهِ الْكَذِبَ ؕ— اِنَّ الَّذِیْنَ یَفْتَرُوْنَ عَلَی اللّٰهِ الْكَذِبَ لَا یُفْلِحُوْنَ ۟ؕ

అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు. info
التفاسير:

external-link copy
117 : 16

مَتَاعٌ قَلِیْلٌ ۪— وَّلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. info
التفاسير:

external-link copy
118 : 16

وَعَلَی الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَیْكَ مِنْ قَبْلُ ۚ— وَمَا ظَلَمْنٰهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟

మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు.[1] info

[1] యూదులకు విధించిన ఆహార పదార్థాల నిషేధాలు వారి అన్యాయ ప్రవర్తన కారణంగా ఉండెను. చూడండి, 3:93, 6:146, 4:160.

التفاسير: