《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

页码: 531:531 close

external-link copy
19 : 55

مَرَجَ الْبَحْرَیْنِ یَلْتَقِیٰنِ ۟ۙ

ఆయన (అల్లాహ్) ఉప్పు మరియు తీపి సముద్రములను కలిపాడు అవి కంటికి కనిపించటంలో కలుస్తుంటాయి. info
التفاسير:

external-link copy
20 : 55

بَیْنَهُمَا بَرْزَخٌ لَّا یَبْغِیٰنِ ۟ۚ

వాటి మధ్య ఒక అడ్డు కట్ట ఉన్నది అది వాటిలో నుండి ప్రతి ఒక్క దాన్ని వేరే దాన్ని ఆక్రమించుకోకుండా తీపిది తీపిగా మరియు ఉప్పుది ఉప్పగా ఉండేందుకు ఆపుతుంది. info
التفاسير:

external-link copy
21 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
22 : 55

یَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ۟ۚ

రెండు సముద్రముల నుండి పెద్దవి మరియు చిన్నవి ముత్యములు వెలికి వస్తాయి. info
التفاسير:

external-link copy
23 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
24 : 55

وَلَهُ الْجَوَارِ الْمُنْشَاٰتُ فِی الْبَحْرِ كَالْاَعْلَامِ ۟ۚ

సముద్రముల్లో పర్వతములవలె పయనించే ఓడలను పయనింపచేసే అధికారము పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయన ఒక్కడికే ఉన్నది. info
التفاسير:

external-link copy
25 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟۠

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
26 : 55

كُلُّ مَنْ عَلَیْهَا فَانٍ ۟ۚۖ

సృష్టితాల్లోంచి భూమిపై ఉన్న ప్రతీది ఖచ్చితంగా నాశనమవుతుంది. info
التفاسير:

external-link copy
27 : 55

وَّیَبْقٰی وَجْهُ رَبِّكَ ذُو الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟ۚ

ఓ ప్రవక్తా తన దాసుల పట్ల గొప్పతనము,దాతృత్వం మరియు దయ కల నీ ప్రభువు యొక్క అస్తిత్వం మిగిలి ఉంటుంది. దానికి వినాశనం ఎన్నటికీ కలగదు. info
التفاسير:

external-link copy
28 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
29 : 55

یَسْـَٔلُهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلَّ یَوْمٍ هُوَ فِیْ شَاْنٍ ۟ۚ

ఆకాశముల్లో ఉన్న దైవదూతల్లోంచి మరియు భూమిలో ఉన్న జిన్నులు,మానవుల్లోంచి ప్రతి ఒక్కరు తమ అవసరములను ఆయనతోనే వేడుకుంటారు. ప్రతి రోజు ఆయన తన దాసుల వ్యవహారములైన జీవింపజేయటం,మరణింపజేయటం మరియు ఆహారం ప్రసాదించటం మొదలగు వాటిలొ నిమగ్నుడై ఉంటాడు. info
التفاسير:

external-link copy
30 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
31 : 55

سَنَفْرُغُ لَكُمْ اَیُّهَ الثَّقَلٰنِ ۟ۚ

ఓ మానవుల్లారా,జిన్నుల్లారా త్వరలోనే మేము మీ లెక్క చూసి ప్రతి ఒక్కరికి వారికి యోగ్యమైన ప్రతిఫలమును,శిక్షను ప్రసాదిస్తాము. info
التفاسير:

external-link copy
32 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
33 : 55

یٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اِنِ اسْتَطَعْتُمْ اَنْ تَنْفُذُوْا مِنْ اَقْطَارِ السَّمٰوٰتِ وَالْاَرْضِ فَانْفُذُوْا ؕ— لَا تَنْفُذُوْنَ اِلَّا بِسُلْطٰنٍ ۟ۚ

జిన్నులు మరియు మానవులు సమావేశమైనప్పుడు ప్రళయదినమున అల్లాహ్ ఇలా పలుకుతాడు : ఓ జిన్నుల మరియు మానవుల జాతుల వారా ఒక వేళ మీరు మీ కొరకు భూమ్యాకాశముల సరిహద్దుల్లోంచి ఏ సరిహద్దు నుంచైన బయటకు పోయే మార్గం పొందగలిగితే మీరు చేసి చూడండి. మీరు అది ఏదైన బలముతో,ఆధారముతో మాత్రమే చేయగలుగుతారు. మరియు అది మీ దగ్గర ఎక్కడున్నది ?. info
التفاسير:

external-link copy
34 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
35 : 55

یُرْسَلُ عَلَیْكُمَا شُوَاظٌ مِّنْ نَّارٍ ۙ۬— وَّنُحَاسٌ فَلَا تَنْتَصِرٰنِ ۟ۚ

ఓ మానవులు మరియు జిన్నాతుల్లారా ఆయన మీపై పొగ లేని అగ్ని జ్వాలలను మరియు జ్వాలలు లేని పొగను పంపిస్తాడు. మీరు దాన్ని ఆపలేరు. info
التفاسير:

external-link copy
36 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
37 : 55

فَاِذَا انْشَقَّتِ السَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ۟ۚ

మరియు ఆకాశం దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్దలైనప్పుడు అది రంగు మెరవటంలో నూనెలా ఎర్రగా అయిపోతుంది. info
التفاسير:

external-link copy
38 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
39 : 55

فَیَوْمَىِٕذٍ لَّا یُسْـَٔلُ عَنْ ذَنْۢبِهٖۤ اِنْسٌ وَّلَا جَآنٌّ ۟ۚ

ఆ మహోన్నతమైన దినమున మానవులకు,జిన్నులకు వారి పాపముల గురించి అడగబడదు ఎందుకంటే వారి కర్మల గురించి అల్లాహ్ కు తెలుసు కాబట్టి. info
التفاسير:

external-link copy
40 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?. info
التفاسير:

external-link copy
41 : 55

یُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِیْمٰهُمْ فَیُؤْخَذُ بِالنَّوَاصِیْ وَالْاَقْدَامِ ۟ۚ

అపరాదులు ప్రళయదినమున తమ చిహ్నాలైన ముఖములు నల్లబడటం,కళ్ళు నీలంగా మారటం ద్వారా గుర్తించబడుతారు. అప్పుడు వారి నుదుటులను వారి కాళ్ళతో కలిపి కట్టబడి వారు నరకంలో విసరబడుతారు. info
التفاسير:
这业中每段经文的优越:
• الجمع بين البحر المالح والعَذْب دون أن يختلطا من مظاهر قدرة الله تعالى.
ఉప్పు నీటి,తీపి నీటి సముద్రముల మధ్య అవి రెండు కలవకుండా సమీకరించటం మహోన్నతుడైన అల్లాహ్ సామర్ధ్యము యొక్క దృశ్యముల్లోంచివి. info

• ثبوت الفناء لجميع الخلائق، وبيان أن البقاء لله وحده حضٌّ للعباد على التعلق بالباقي - سبحانه - دون من سواه.
సృష్టి రాసులందరి వినాశన నిరూపణ మరియు అల్లాహ్ ఒక్కడికే అనునిత్యం ఉండటం సాధ్యం అని ప్రకటన దాసుల కొరకు ఎవరు కాకుండా పరిశుద్ధుడైన నిత్యం ఉండే వాడితో సంబంధం ఏర్పరుచుకోవటం కొరకు ప్రేరణ కలదు. info

• إثبات صفة الوجه لله على ما يليق به سبحانه دون تشبيه أو تمثيل.
అల్లాహ్ కొరకు ముఖము యొక్క గుణము పరిశుద్ధుడైన ఆయనకు తగిన విధంగా ఎటువంటి పోలిక లేదా నమూనా లేకుండా నిరూపించటం. info

• تنويع عذاب الكافر.
అవిశ్వాసపరుని శిక్ష యొక్క రకాలను తెలపటం. info