《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
47 : 3

قَالَتْ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ وَلَدٌ وَّلَمْ یَمْسَسْنِیْ بَشَرٌ ؕ— قَالَ كَذٰلِكِ اللّٰهُ یَخْلُقُ مَا یَشَآءُ ؕ— اِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟

‘భర్త లేకుండానే తను ఒక బిడ్డకు జన్మ నివ్వబోతున్నదనే’ వార్తతో మర్యం అమితంగా ఆశ్చర్యపోయి, వెంటనే ఇలా అడిగింది : ‘చట్టబద్ధంగా (వివాహ బంధం ద్వారా) లేదా అక్రమంగా ఏ వ్యక్తీ నన్ను స్పర్శించకుండా నాకు బిడ్డ ఎలా కలుగుతుంది?. దానికి ఆ దైవదూత ఇలా జవాబిచ్చాడు “తండ్రి లేకుండానే అల్లాహ్ నీ ద్వారా ఒక బిడ్డను సృష్టిస్తాడు. అసాధారణమైనా సరే. ఆయన ఏది కోరుకుంటే అది సృష్టిస్తాడు. అల్లాహ్ ఏదైనా జరగాలని కోరుకున్నప్పుడు, ఆయన కేవలం 'అయిపో' అని అంటాడు, వెంటనే అది అయిపోతుంది. తన ఇష్టానుసారం చేయడం నుండి ఆయన్ను ఏదీ ఆపలేదు. info
التفاسير:
这业中每段经文的优越:
• شرف الكتابة والخط وعلو منزلتهما، حيث بدأ الله تعالى بذكرهما قبل غيرهما.
ఇతర విషయాలను ప్రస్తావించడం కంటే ముందు అల్లాహ్ వ్రాయడం గురించి ప్రస్తావించడం వలన, అది ఒక శ్రేష్ఠమైన పనిగా పరిగణించబడుతుంది. info

• من سنن الله تعالى أن يؤيد رسله بالآيات الدالة على صدقهم، مما لا يقدر عليه البشر.
అల్లాహ్ యొక్క సంప్రదాయం ఏమిటంటే తన ప్రవక్తలను, సందేశహరులను ఆయన సత్యాన్ని నిరూపించే మానవాతీతమైన అద్భుతాలతో, మహిమలతో మద్దతు ఇస్తూ ఉంటాడు. info

• جاء عيسى بالتخفيف على بني إسرائيل فيما شُدِّد عليهم في بعض شرائع التوراة، وفي هذا دلالة على وقوع النسخ بين الشرائع.
ఈసా అలైహిస్సలాం తౌరాతులోని కొన్ని శాసనాలలో నొక్కి చెప్పిన ధర్మాజ్ఞలను ఇస్రాయీల్ సంతతిపై సులభతరం చేసేందుకు వచ్చారు. ఇది శాసనాల మధ్య కొన్ని అంశాలు రద్దుచేయబడతాయనే దానిని సూచిస్తున్నది. info