《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
21 : 24

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— وَمَنْ یَّتَّبِعْ خُطُوٰتِ الشَّیْطٰنِ فَاِنَّهٗ یَاْمُرُ بِالْفَحْشَآءِ وَالْمُنْكَرِ ؕ— وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ مَا زَكٰی مِنْكُمْ مِّنْ اَحَدٍ اَبَدًا ۙ— وَّلٰكِنَّ اللّٰهَ یُزَكِّیْ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ ప్రకారం ఆచరించే వారా మీరు అసత్యమును అలంకరించే షైతాను మార్గములను అనుసరించకండి. ఎవరైతే అతని మార్గములను అనుసరిస్తారో వారిని అతడు చెడు కార్యాల గురించి,మాటల గురించి,ధర్మం ఖండించిన వాటి గురించి ఆదేశిస్తాడు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీపైన అల్లాహ్ అనుగ్రహమే లేకుంటే మీలో నుండి ఎన్నటికి ఎవరినీ ఆయన తౌబా ద్వారా - ఒక వేళ అతను తౌబా చేసి ఉంటే - పరిశుద్ధుడు చేసే వాడు కాదు. కానీ అల్లాహ్ ఆయన ఎవరిని తలచుకుంటే వారి తౌబా స్వీకరించి పరిశుద్ధుడు చేస్తాడు. మరియు అల్లాహ్ మీ మాటలను వినే వాడును,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:
这业中每段经文的优越:
• إغراءات الشيطان ووساوسه داعية إلى ارتكاب المعاصي، فليحذرها المؤمن.
షైతాను యొక్క ప్రలోభాలు,అతని దుష్ప్రేరణలు పాపకార్యములకు పాల్పడటానికి పిలుస్తుంటాయి. విశ్వాసపరుడు వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి. info

• التوفيق للتوبة والعمل الصالح من الله لا من العبد.
తౌబా చేసే,సత్కార్యమును చేసే సౌభాగ్యము అల్లాహ్ తరపు నుండి ఉంటుంది దాసుని తరపు నుండి కాదు. info

• العفو والصفح عن المسيء سبب لغفران الذنوب.
అపరాధిని మన్నించటం,క్షమించటం పాపముల మన్నింపునకు ఒక కారణం. info

• قذف العفائف من كبائر الذنوب.
పవిత్రులపై నింద మోపటం ఘోరమైన పాపము. info

• مشروعية الاستئذان لحماية النظر، والحفاظ على حرمة البيوت.
దృష్టి రక్షణకు,గృహాల పవిత్రతను పరిరక్షించడానికి అనుమతి తీసుకోవటం యొక్క చట్టబద్దత. info