《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译

external-link copy
137 : 2

فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَاۤ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا ۚ— وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا هُمْ فِیْ شِقَاقٍ ۚ— فَسَیَكْفِیْكَهُمُ اللّٰهُ ۚ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ؕ

ఒకవేళ యూదులు,క్రైస్తవులు,మరియు సత్య తిరస్కారుల్లోంచి ఇతరులు మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే వారు అల్లాహ్ ప్రశన్నతను పొందే సన్మార్గమును పొందిన వారవుతారు.ఒకవేళ వారు విశ్వాసము నుంచి విముఖత చూపినా,దైవ ప్రవక్తలందరిని లేదా వారిలో నుంచి కొంత మందిని తిరస్కరించినా,వారు విభేధాలలో,మరియు విరోధంలో ఉన్నట్లే.అయితే ఓప్రవక్తా!మీరు బాధపడకండి,మిమ్మల్ని వారి బాధలనుండి రక్షించడానికి అల్లాహ్ చాలు.ఆయన (అల్లాహ్)వారి కీడు మీపైరాకుండా ఆపుతాడు,వారికి వ్యతిరేకంగా మీకు సహాయపడుతాడు,ఆయన వారి మాటలను వింటున్నాడు.వారి ఉద్దేశాలు,వారి కార్యాలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. info
التفاسير:
这业中每段经文的优越:
• أن دعوى أهل الكتاب أنهم على الحق لا تنفعهم وهم يكفرون بما أنزل الله على نبيه محمد صلى الله عليه وسلم.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అవతరింప జేసిన దానిని తిరస్కరిస్తూ తాము సన్మార్గం పై ఉన్నామని గ్రంధవహుల వాదన వారికి ఏమాత్రం లాభం చేకూర్చదు. info

• سُمِّي الدين صبغة لظهور أعماله وسَمْته على المسلم كما يظهر أثر الصبغ في الثوب.
ధర్మమునకు దాని ఆచరణలు బహిర్గతమవటం వలన రంగు పేరు ఇవ్వబడినది,ఒక బట్ట పై రంగు గుర్తు ఏ విధంగా బహిర్గతం అవుతుందో ఆ విధంగా ఒక ముస్లిం పై దాని (ధర్మం) గుర్తు బహిర్గతమవుతుంది. info

• أن الله تعالى قد رَكَزَ في فطرةِ خلقه جميعًا الإقرارَ بربوبيته وألوهيته، وإنما يضلهم عنها الشيطان وأعوانه.
నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టిరాశులందరి స్వభావంలో తన రుబూబియత్ (సృష్టికర్త,పాలకుడు,సంరక్షకుడు) ,తన ఉలూహియత్ (ఏక దైవోపాసవ) ను స్వీకరించడమును పొందుపరచాడు, షైతాను,అతని సహాయకులు వారిని మార్గ భ్రష్టతకు లోను చేస్తారు. info