Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ni Abdur Rahim bin Muhammad

Numero ng Pahina:close

external-link copy
21 : 9

یُبَشِّرُهُمْ رَبُّهُمْ بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَّجَنّٰتٍ لَّهُمْ فِیْهَا نَعِیْمٌ مُّقِیْمٌ ۟ۙ

వారి ప్రభువు వారికి, తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలు గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు. info
التفاسير:

external-link copy
22 : 9

خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— اِنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِیْمٌ ۟

వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది. info
التفاسير:

external-link copy
23 : 9

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْۤا اٰبَآءَكُمْ وَاِخْوَانَكُمْ اَوْلِیَآءَ اِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَی الْاِیْمَانِ ؕ— وَمَنْ یَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟

ఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు.[1] info

[1] హిజ్ రత్ నుండి జిహాద్ విషయంలో మీరు, మీ సోదరుల మరియు తండ్రుల ప్రేమను రానివ్వకండి. వారు మీ స్నేహితులు కాలేరు. వారు మీతో మంచిగా వ్యవహరిస్తే, మిమ్మల్ని మీ ఇస్లాం ధర్మాన్ని పాటించటం నుండి ఆపకుంటే, వారితో మంచిగా వ్యవహరించండి. కాని వారు మిమ్మల్ని ఇస్లాం కొరకే బాధిస్తే, వారిని మీ స్నేహితులుగా భావించకండి. (చూ. 3:28, 60:89).

التفاسير:

external-link copy
24 : 9

قُلْ اِنْ كَانَ اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ وَاِخْوَانُكُمْ وَاَزْوَاجُكُمْ وَعَشِیْرَتُكُمْ وَاَمْوَالُ ١قْتَرَفْتُمُوْهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسٰكِنُ تَرْضَوْنَهَاۤ اَحَبَّ اِلَیْكُمْ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖ وَجِهَادٍ فِیْ سَبِیْلِهٖ فَتَرَبَّصُوْا حَتّٰی یَاْتِیَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟۠

వారితో ఇలా అను: "మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు."[1] info

[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరిచేతిలోనైతే నా ప్రాణాలున్నాయో ఆ అల్లాహ్ (సు.తా.) తోడు. మీలో ఏ ఒక్కడు కూడా ముఅ'మిన్ కాజాలడు, ఎంతవరకైతే అతడు తన తండ్రి, తన సంతానం మరియు ఇతరులందరికంటే, నన్ను ('స'అస) ఎక్కువగా ప్రేమించడో!" ('స'హీ'హ్ బుఖా'రీ, కితాబ్ అల్ - ఈమాన్, బాబ్ 'హుబ్బె రసూల్ ('స'అస) మినల్ ఈమాన్; 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ - ఈమాన్).

التفاسير:

external-link copy
25 : 9

لَقَدْ نَصَرَكُمُ اللّٰهُ فِیْ مَوَاطِنَ كَثِیْرَةٍ ۙ— وَّیَوْمَ حُنَیْنٍ ۙ— اِذْ اَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنْكُمْ شَیْـًٔا وَّضَاقَتْ عَلَیْكُمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّیْتُمْ مُّدْبِرِیْنَ ۟ۚ

వాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ (యుద్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు.[1] info

[1] 'హునైన్, మక్కా మరియు 'తాయిప్ ల మధ్య పర్వతాలలో ఉన్న ఒక లోయ (వాది). అక్కడ హవా'జిన్ మరియు స'ఖీఫ్ అనే రెండు తెగలవారు ఉండేవారు. వారు విలువిద్యలో నిపుణులు. వారు ముస్లింలకు విరుద్ధంగా పోరాడటానికి, యుద్ధ తయారీలు చేస్తున్నారని తెలుసుకొని దైవప్రవక్త ('స'అస), 12,000 సైనికులతో, మక్కా విజయపు 18-19 దినాల తరువాత 8వ హిజ్రీ, షవ్వాల్ నెలలో వారిపై దాడి చేయడానికి వెళ్తారు. ముస్లింలకు తమ సంఖ్యాబలం కొంత వరకు గర్వానికి కారణమవుతుంది. ఇది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. శత్రువులు దాదాపు 4,000 మంది ఉంటారు. శత్రువుల బాణాల దెబ్బలకు తాళుకోలేక ముస్లిం సైనికులు వెనుదిరిగి పారిపోసాగుతారు. కేవలం దైవప్రవక్త ('స'అస), కొందరు ముస్లింలతో బాటు మిగిలిపోతారు. దైవప్రవక్త ('స'అస), పారిపోయేవారిని ఆపటానికి కేకలు వేస్తారు. తరువాత అతను ('స'అస), 'అబ్బాస్ (ర.'ది.'అ)తో వారిని పిలవమని అంటారు. అతను పెద్ద పెద్ద కేకలు వేయటం వల్ల, సిగ్గుపడి కొందరు తిరిగి వస్తారు. ఆ ఉన్నవారే ధైర్యస్థైర్యాలతో యుద్ధం చేసి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో విజయం పొందుతారు. శత్రువులు తమ ఆస్తిపాస్తులన్నీ విడిచి పారిపోతారు.

التفاسير:

external-link copy
26 : 9

ثُمَّ اَنْزَلَ اللّٰهُ سَكِیْنَتَهٗ عَلٰی رَسُوْلِهٖ وَعَلَی الْمُؤْمِنِیْنَ وَاَنْزَلَ جُنُوْدًا لَّمْ تَرَوْهَا ۚ— وَعَذَّبَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— وَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِیْنَ ۟

తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు.[1] మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం. info

[1] కనిపించని దళాలను అంటే దైవదూతలను, అల్లాహ్ (సు.తా.) పంపాడు. ఏ విధంగానైతే ఉ'హుద్ యుద్ధంలో (చూడండి, 3:124-125) మరియు బద్ర్ యుద్ధంలో (చూడండి, 8:9) పంపాడో!

التفاسير: