Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ni Abdur Rahim bin Muhammad

Numero ng Pahina:close

external-link copy
52 : 15

اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ— قَالَ اِنَّا مِنْكُمْ وَجِلُوْنَ ۟

వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది."[1] info

[1] వారి భయానికి కారణం కొరకు చూడండి, 11:70 దీని ద్వారా తెలిసేదేమిటంటే ఇబ్రాహీమ్ ('అ.స.) ఒక దైవప్రవక్త అయినా, వచ్చిన అతిథులు దైవదూతలని వారు చెప్పేంత వరకు తెలుసుకోలేక పోయారు. అంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అల్లాహ్ (సు.తా.) వారికి తెలిపినది మాత్రమే వారికి తెలుస్తుంది.

التفاسير:

external-link copy
53 : 15

قَالُوْا لَا تَوْجَلْ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمٍ عَلِیْمٍ ۟

వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము." info
التفاسير:

external-link copy
54 : 15

قَالَ اَبَشَّرْتُمُوْنِیْ عَلٰۤی اَنْ مَّسَّنِیَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُوْنَ ۟

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు?" info
التفاسير:

external-link copy
55 : 15

قَالُوْا بَشَّرْنٰكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِّنَ الْقٰنِطِیْنَ ۟

వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు." info
التفاسير:

external-link copy
56 : 15

قَالَ وَمَنْ یَّقْنَطُ مِنْ رَّحْمَةِ رَبِّهٖۤ اِلَّا الضَّآلُّوْنَ ۟

(ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?" info
التفاسير:

external-link copy
57 : 15

قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ ۟

(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?" info
التفاسير:

external-link copy
58 : 15

قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰی قَوْمٍ مُّجْرِمِیْنَ ۟ۙ

వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము [1] - info

[1] సోడోమ్ మరియు గొమొర్రహ్ ప్రజల గాథ కొరకు చూడండి, 7:80-84 మరియు 11:77-83.

التفاسير:

external-link copy
59 : 15

اِلَّاۤ اٰلَ لُوْطٍ ؕ— اِنَّا لَمُنَجُّوْهُمْ اَجْمَعِیْنَ ۟ۙ

లూత్ ఇంటివారు[1] తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము; info

[1] ఆల : అంటే ఇంటివారే కాక అనుచరులందరూ కూడా అన్నమాట.

التفاسير:

external-link copy
60 : 15

اِلَّا امْرَاَتَهٗ قَدَّرْنَاۤ ۙ— اِنَّهَا لَمِنَ الْغٰبِرِیْنَ ۟۠

అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."[1] info

[1] చూడండి, 7:83 11:81 మరియు 66:10.

التفاسير:

external-link copy
61 : 15

فَلَمَّا جَآءَ اٰلَ لُوْطِ ١لْمُرْسَلُوْنَ ۟ۙ

తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు; info
التفاسير:

external-link copy
62 : 15

قَالَ اِنَّكُمْ قَوْمٌ مُّنْكَرُوْنَ ۟

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."[1] info

[1] ఆ దేవదూతలు యువకుల ఆకారంలో వచ్చారు. చూడండి, 11:77.

التفاسير:

external-link copy
63 : 15

قَالُوْا بَلْ جِئْنٰكَ بِمَا كَانُوْا فِیْهِ یَمْتَرُوْنَ ۟

వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.[1] info

[1] చూడండి, 6:57-58, 8:32, 11:8.

التفاسير:

external-link copy
64 : 15

وَاَتَیْنٰكَ بِالْحَقِّ وَاِنَّا لَصٰدِقُوْنَ ۟

మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము. info
التفاسير:

external-link copy
65 : 15

فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّیْلِ وَاتَّبِعْ اَدْبَارَهُمْ وَلَا یَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ وَّامْضُوْا حَیْثُ تُؤْمَرُوْنَ ۟

కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి." info
التفاسير:

external-link copy
66 : 15

وَقَضَیْنَاۤ اِلَیْهِ ذٰلِكَ الْاَمْرَ اَنَّ دَابِرَ هٰۤؤُلَآءِ مَقْطُوْعٌ مُّصْبِحِیْنَ ۟

మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు." info
التفاسير:

external-link copy
67 : 15

وَجَآءَ اَهْلُ الْمَدِیْنَةِ یَسْتَبْشِرُوْنَ ۟

మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు. info
التفاسير:

external-link copy
68 : 15

قَالَ اِنَّ هٰۤؤُلَآءِ ضَیْفِیْ فَلَا تَفْضَحُوْنِ ۟ۙ

(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.[1] info

[1] చూడండి, 7:80-81, 11:77-79.

التفاسير:

external-link copy
69 : 15

وَاتَّقُوا اللّٰهَ وَلَا تُخْزُوْنِ ۟

మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి." info
التفاسير:

external-link copy
70 : 15

قَالُوْۤا اَوَلَمْ نَنْهَكَ عَنِ الْعٰلَمِیْنَ ۟

వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా?"[1] info

[1] లూ'త్ ('అ.స.) సొడోమ్ ప్రాంతంలో విదేశీయుడు. ఎందుకంటే అతను మెసపొటోమియా నుండి వచ్చినవాడు. చూడండి, 7:80-82.

التفاسير: