Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

అల్-ఖలమ్

Ilan sa mga Layon ng Surah:
شهادة الله للنبي بحسن الخُلق، والدفاع عنه وتثبيته.
దైవప్రవక్త కొరకు మంచి నైతికత,ఆయన రక్షణ,సంస్థాపన గురించి అల్లాహ్ సాక్ష్యం info

external-link copy
1 : 68

نٓ وَالْقَلَمِ وَمَا یَسْطُرُوْنَ ۟ۙ

(నూన్) సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది. అల్లాహ్ కలముపై ప్రమాణం చేశాడు మరియు ప్రజలు తమ కలములతో వ్రాసే వాటి గురించి ప్రమాణం చేశాడు. info
التفاسير:

external-link copy
2 : 68

مَاۤ اَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُوْنٍ ۟ۚ

ఓ ప్రవక్త అల్లాహ్ మీకు అనుగ్రహించిన దైవ దౌత్యము వలన మీరు పిచ్చివారు కాదు. అంతే కాదు ముష్రికులు మీపై వేస్తున్న అపనింద అయిన పిచ్చితనముతో మీకు సంబంధము లేదు. info
التفاسير:

external-link copy
3 : 68

وَاِنَّ لَكَ لَاَجْرًا غَیْرَ مَمْنُوْنٍ ۟ۚ

నిశ్చయంగా మీ కొరకు మీరు ప్రజలకు సందేశాలను చేరవేసే విషయంలో అనుభవించిన బాధపై అంతం కాని పుణ్యం కలదు. దాని ద్వారా మీపై ఎవరికీ ఎటువంటి ఉపకారము లేదు. info
التفاسير:

external-link copy
4 : 68

وَاِنَّكَ لَعَلٰی خُلُقٍ عَظِیْمٍ ۟

మరియు నిశ్చయంగా మీరు ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన ఉత్తమ గుణాలు కలవారు. కాబట్టి మీరు అందులో ఉన్న నైతికతను పరిపూర్ణ రీతిలో పూర్తి చేసేవారు. info
التفاسير:

external-link copy
5 : 68

فَسَتُبْصِرُ وَیُبْصِرُوْنَ ۟ۙ

అయితే తొందరలోనే మీరు చూస్తారు మరియు ఈ తిరస్కారులందరు చూస్తారు. info
التفاسير:

external-link copy
6 : 68

بِاَیِّىكُمُ الْمَفْتُوْنُ ۟

సత్యము తేటతెల్లం అయినప్పుడు మీలో నుండి ఎవరికి పిచ్చి ఉన్నదో స్పష్టమైపోతుంది. info
التفاسير:

external-link copy
7 : 68

اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ ۪— وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుకు తెలుసు ఎవరు ఆయన మార్గము నుండి మరలిపోయారో. దాని వైపునకు సన్మార్గం పొందేవారి గురించి ఆయనకు బాగా తెలుసు. కావున ఎవరు దాని నుండి తప్పిపోయారో ఆయనకు తెలుసు. మరియు మీరు దాని వైపునకు ఎవరిని మార్గదర్శకం చేశారో ఆయనకు తెలుసు. info
التفاسير:

external-link copy
8 : 68

فَلَا تُطِعِ الْمُكَذِّبِیْنَ ۟

ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారి మాట వినకండి (అనుసరించకండి). info
التفاسير:

external-link copy
9 : 68

وَدُّوْا لَوْ تُدْهِنُ فَیُدْهِنُوْنَ ۟

ధర్మ లెక్క విషయంలో ఒక వేళ మీరు వారి పట్ల మెతక వైఖరిని చూపి వారిపై కనికరిస్తే వారు మీ పట్ల మెతక వైఖరిని చూపి మీ పై కనికరిస్తారని ఆశించారు. info
التفاسير:

external-link copy
10 : 68

وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِیْنٍ ۟ۙ

మరియు మీరు అసత్యముపై అధికముగా ప్రమాణాలు చేసే,దిగజారిన వాడి మాటలు వినకండి. info
التفاسير:

external-link copy
11 : 68

هَمَّازٍ مَّشَّآءٍ بِنَمِیْمٍ ۟ۙ

ప్రజల వీపు వెనుక వారి గురించి అధికముగా చెడు ప్రస్తావన చేసేవాడి (గీబత్ చేసేవాడు) వారి మధ్య దూరాలు పెంచటానికి వారి మధ్య చాడీలు చెప్పేవాడి మాటను; info
التفاسير:

external-link copy
12 : 68

مَّنَّاعٍ لِّلْخَیْرِ مُعْتَدٍ اَثِیْمٍ ۟ۙ

మంచిని అధికంగా నిరోధించేవాడి,ప్రజలపై వారి సంపదలలో,వారి మానమర్యాదల విషయంలో,వారి ప్రాణముల విషయంలో మితిమీరిపోయేవాడి,అధికముగా పాపాలు,అవిధేయ కార్యాలు చేసేవాడి; info
التفاسير:

external-link copy
13 : 68

عُتُلٍّۢ بَعْدَ ذٰلِكَ زَنِیْمٍ ۟ۙ

కఠినుడు,కర్కశుడు,తన జాతివారిలో నిందార్హుడు; info
التفاسير:

external-link copy
14 : 68

اَنْ كَانَ ذَا مَالٍ وَّبَنِیْنَ ۟ؕ

అతడు సంపద,సంతానము కలవాడని అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసము కనబరచటం నుండి అహంకారమును చూపాడు. info
التفاسير:

external-link copy
15 : 68

اِذَا تُتْلٰی عَلَیْهِ اٰیٰتُنَا قَالَ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟

మా ఆయతులు అతనిపై చదివి వినిపించబడినప్పుడు వాడు ఇవి వ్రాయబడిన పూర్వికుల కట్టుకథలు అని అన్నాడు. info
التفاسير:

external-link copy
16 : 68

سَنَسِمُهٗ عَلَی الْخُرْطُوْمِ ۟

మేము తొందరలోనే అతని ముక్కుపై ఒక గర్తును పెడతాము అది అతనిలో లోపమును ఏర్పరుస్తుంది మరియు అతనికి అంటిపెట్టుకుని ఉంటుంది. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• اتصاف الرسول صلى الله عليه وسلم بأخلاق القرآن.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంగారు ఖుర్ఆన్ లో గల గుణాలను కలిగి ఉండటం. info

• صفات الكفار صفات ذميمة يجب على المؤمن الابتعاد عنها، وعن طاعة أهلها.
అవిశ్వాసపరుల గుణాలు దిగజారిన గుణాలు. విశ్వాసపరులు వాటి నుండి దూరం వహించటం,వారిని అనుసరించటం నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. info

• من أكثر الحلف هان على الرحمن، ونزلت مرتبته عند الناس.
అధికంగా ప్రమాణాలు చేసేవాడు అల్లాహ్ యందు దిగజారిపోయాడు. మరియు ప్రజల వద్ద అతని స్థానం దిగజారిపోతుంది. info