Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

Numero ng Pahina:close

external-link copy
61 : 26

فَلَمَّا تَرَآءَ الْجَمْعٰنِ قَالَ اَصْحٰبُ مُوْسٰۤی اِنَّا لَمُدْرَكُوْنَ ۟ۚ

ఎప్పుడైతే ఫిర్ఔన్ అతని జాతి వారు మూసా అలైహిస్సలాం,అయన జాతి వారితో ఎదురుపడి ప్రతీ పక్షము రెండోవ పక్షమును చూసే విధంగా అయిపోయారో మూసా అనుచరులు నిశ్ఛయంగా ఫిర్ఔన్,అతని జాతి వారు మమ్మల్ని పట్టుకుంటారు. వారిని ఎదుర్కునే శక్తి మాకు లేదు అని అన్నారు. info
التفاسير:

external-link copy
62 : 26

قَالَ كَلَّا ۚ— اِنَّ مَعِیَ رَبِّیْ سَیَهْدِیْنِ ۟

మూసా అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : విషయం మీరు అనుకున్నట్లు కాదు. ఎందుకంటే నిశ్చయంగా మద్దతుతో,సహాయముతో నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. తొందరలోనే ఆయన నన్ను విముక్తి మార్గము వైపునకు మార్గ దర్శకత్వము చేస్తాడు. info
التفاسير:

external-link copy
63 : 26

فَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْبَحْرَ ؕ— فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِیْمِ ۟ۚ

అప్పుడు మేము మూసాను తన చేతి కర్రను సముద్రంపై కొట్టమని ఆదేశిస్తూ దైవ వాణి అవతరింపజేశాము. అప్పుడు ఆయన దాన్ని దానితో కొట్టారు. అప్పుడు సముద్రం చీలిపోయి ఇస్రాయీలు సంతతి వారి తెగల లెక్క ప్రకారం పన్నెండు మార్గములుగా మారిపోయింది. అప్పుడు సముద్రం యొక్క చీలిన ప్రతీ ముక్క పెద్దది అవటంలో,స్థిరత్వంలోపెద్ద పర్వతము వలె అందులో నుండి ఎటువంటి నీరు ప్రవహించకుండా ఉన్నట్లు అయిపోయినది. info
التفاسير:

external-link copy
64 : 26

وَاَزْلَفْنَا ثَمَّ الْاٰخَرِیْنَ ۟ۚ

మరియు మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సమీపింపజేశాము చివరికి వారు మార్గమును దారిగా భావిస్తూ సముద్రంలో ప్రవేశించారు. info
التفاسير:

external-link copy
65 : 26

وَاَنْجَیْنَا مُوْسٰی وَمَنْ مَّعَهٗۤ اَجْمَعِیْنَ ۟ۚ

మరియు మేము మూసా అలైహిస్సలాం,ఆయనతోపాటు ఉన్న ఇస్రాయీలు సంతతి వారిని రక్షించాము. వారిలో నుంచి ఎవరూ నాశనం కాలేదు. info
التفاسير:

external-link copy
66 : 26

ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِیْنَ ۟ؕ

ఆ తరువాత మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సముద్రంలో ముంచి తుదిముట్టించాము. info
التفاسير:

external-link copy
67 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

నిశ్ఛయంగా మూసా అలైహిస్సలాం కొరకు సముద్రం విడిపోయి ఆయనకు విముక్తి కలగటంలో,ఫిర్ఔన్,అతని జాతి వారికి వినాశనం కలగటంలో మూసా నిజాయితీ పై సూచించే ఒక సూచన కలదు. మరియు ఫిర్ఔన్ తో పాటు ఉన్న చాలా మంది విశ్వసించరు. info
التفاسير:

external-link copy
68 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును. info
التفاسير:

external-link copy
69 : 26

وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ اِبْرٰهِیْمَ ۟ۘ

ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం గాధను వారికి చదివి వినిపించండి. info
التفاسير:

external-link copy
70 : 26

اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَا تَعْبُدُوْنَ ۟

ఆయన తన తండ్రి ఆజరుతో,తన జాతి వారితో మీరు అల్లాహ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారు ? అని అడిగినప్పుడు. info
التفاسير:

external-link copy
71 : 26

قَالُوْا نَعْبُدُ اَصْنَامًا فَنَظَلُّ لَهَا عٰكِفِیْنَ ۟

ఆయన జాతి వారు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : మేము కొన్ని విగ్రహాలను వాటి ఆరాధనను వాటి కొరకు అట్టిపెడుతూ పాటిస్తూ ఆరాధిస్తున్నాము. info
التفاسير:

external-link copy
72 : 26

قَالَ هَلْ یَسْمَعُوْنَكُمْ اِذْ تَدْعُوْنَ ۟ۙ

ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు విగ్రహాలను పిలుస్తున్నప్పుడు వారు మీ పిలుపును వింటున్నారా ? అని ప్రశ్నించారు. info
التفاسير:

external-link copy
73 : 26

اَوْ یَنْفَعُوْنَكُمْ اَوْ یَضُرُّوْنَ ۟

లేదా ఒక వేళ మీరు వారికి విధేయత చూపితే మీకు వారు ప్రయోజనం చేకూరుస్తారా ? లేదా ఒక వేళ మీరు వారికి అవిధేయులైతే వారు మీకు నష్టం చేకూరుస్తారా ? అని వారితో అడిగారు. info
التفاسير:

external-link copy
74 : 26

قَالُوْا بَلْ وَجَدْنَاۤ اٰبَآءَنَا كَذٰلِكَ یَفْعَلُوْنَ ۟

వారు ఇలా సమాధానమిచ్చారు : మేము వారిని పిలిచినప్పుడు వారు మమ్మల్ని విన లేదు,ఒక వేళ మేము వారికి విధేయత చూపితే వారు మమ్మల్ని ప్రయోజనం కలిగించరు,ఒక వేళ మేము వారికి అవిధేయత చూపితే వారు మమ్మల్ని నష్టం కలిగించలేరు. కాని జరిగిందేమిటంటే మేము మా తాతముత్తాతలను ఇలా చేస్తుండగా చూశాము. మేము వారిని అనుకరిస్తున్నాము. info
التفاسير:

external-link copy
75 : 26

قَالَ اَفَرَءَیْتُمْ مَّا كُنْتُمْ تَعْبُدُوْنَ ۟ۙ

ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : మీరు యోచన చేసి చూశారా ?మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలను; info
التفاسير:

external-link copy
76 : 26

اَنْتُمْ وَاٰبَآؤُكُمُ الْاَقْدَمُوْنَ ۟ؗ

మరియు మీ పూర్వ తాతముత్తాతలు ఆరాధన చేసే వాటిని. info
التفاسير:

external-link copy
77 : 26

فَاِنَّهُمْ عَدُوٌّ لِّیْۤ اِلَّا رَبَّ الْعٰلَمِیْنَ ۟ۙ

నిశ్చయంగా వారందరు నాకు శతృవులు ఎందుకంటే సమస్త సృష్టి రాసుల ప్రభువైన అల్లాహ్ తప్ప వారందరు అసత్యులు. info
التفاسير:

external-link copy
78 : 26

الَّذِیْ خَلَقَنِیْ فَهُوَ یَهْدِیْنِ ۟ۙ

ఆయనే నన్ను సృష్టించాడు. కనుక ఆయన నన్ను ఇహపరాల మంచి వైపునకు మార్గ నిర్దేశకం చేస్తాడు. info
التفاسير:

external-link copy
79 : 26

وَالَّذِیْ هُوَ یُطْعِمُنِیْ وَیَسْقِیْنِ ۟ۙ

ఆయన ఒక్కడే నాకు ఆకలి కలిగినప్పుడు నాకు తినిపిస్తాడు,నాకు దాహం వేసినప్పుడు నాకు త్రాపిస్తాడు. info
التفاسير:

external-link copy
80 : 26

وَاِذَا مَرِضْتُ فَهُوَ یَشْفِیْنِ ۟

మరియు ఆయన ఒక్కడే నాకు రోగం కలిగినప్పుడు రోగము నుండి నన్ను నయం చేస్తాడు. ఆయన తప్ప ఇంకెవరూ నాకు నయం చేసేవాడు లేడు. info
التفاسير:

external-link copy
81 : 26

وَالَّذِیْ یُمِیْتُنِیْ ثُمَّ یُحْیِیْنِ ۟ۙ

ఆయన ఒక్కడే నా వయస్సు అంతమైపోయినప్పుడు నన్ను మరణింపజేస్తాడు,నేను మరణించిన తరువాత నన్ను జీవింపజేస్తాడు. info
التفاسير:

external-link copy
82 : 26

وَالَّذِیْۤ اَطْمَعُ اَنْ یَّغْفِرَ لِیْ خَطِیْٓـَٔتِیْ یَوْمَ الدِّیْنِ ۟ؕ

ప్రతిఫలం దినం నాడు నా పాపములను మన్నిస్తాడని ఆయన ఒక్కడితోనే నేను ఆశిస్తున్నాను. info
التفاسير:

external-link copy
83 : 26

رَبِّ هَبْ لِیْ حُكْمًا وَّاَلْحِقْنِیْ بِالصّٰلِحِیْنَ ۟ۙ

ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువుతో దుఆ చేస్తూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నాకు ధర్మ అవగాహన ప్రసాదించు. మరియు నన్ను నా కన్నా మునుపటి పుణ్యాత్ములైన దైవ ప్రవక్తలతో వారితో పాటు నన్ను స్వర్గంలో ప్రవేశింపజేసి కలుపు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الله مع عباده المؤمنين بالنصر والتأييد والإنجاء من الشدائد.
అల్లాహ్ సహాయము ద్వారా,మద్దతు ద్వారా,ఆపదల నుండి విముక్తి కలిగించటం ద్వారా తన దాసులైన విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు. info

• ثبوت صفتي العزة والرحمة لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ఆధిక్యత,కనికరము రెండు లక్షణాల నిరూపణ. info

• خطر التقليد الأعمى.
గుడ్డిగా అనుకరించటం యొక్క ప్రమాదం. info

• أمل المؤمن في ربه عظيم.
మహోన్నతుడైన తన ప్రభువు విషయంలో విశ్వాసపరుని ఆశ. info