Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

external-link copy
284 : 2

لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِنْ تُبْدُوْا مَا فِیْۤ اَنْفُسِكُمْ اَوْ تُخْفُوْهُ یُحَاسِبْكُمْ بِهِ اللّٰهُ ؕ— فَیَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَیُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందినది. ఆయన సృష్టి అంతటినీ సృష్టించాడు. తన ఆధీనములో ఉంచుకున్నాడు మరియు నియంత్రిస్తున్నాడు. మీరు మీ హృదయంలో ఉన్నదాన్ని బహిరంగ పరిచినా లేదా దాచినా, అల్లాహ్ కు దాని గురించి తెలుసు మరియు ఆయన దాని లెక్క మీ నుండి తీసుకుంటాడు. తన దయ మరియు కరుణ కారణంగా ఆయన తాను తలుచుకున్న వారిని క్షమిస్తాడు. తన వివేకం మరియు న్యాయంతో ఆయన తాను తలుచుకున్న వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• جواز أخذ الرهن لضمان الحقوق في حال عدم القدرة على توثيق الحق، إلا إذا وَثِقَ المتعاملون بعضهم ببعض.
వ్యవహారమును చేసేవారు ఒకరి పై మరొకరికి నమ్మకం ఉంటే తప్ప, ఒక వేళ వారి మధ్య ఒప్పందాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేయడం కుదరక పోతే, హక్కులు కాపాడుకోవటానికి తాకట్టు తీసుకోవటం సమ్మతము. info

• حرمة كتمان الشهادة وإثم من يكتمها ولا يؤديها.
సాక్ష్యామును దాచడం యొక్క నిషేధత; మరియు దానిని దాచి, సాక్ష్యం ఇవ్వని వ్యక్తి యొక్క పాపం. info

• كمال علم الله تعالى واطلاعه على خلقه، وقدرته التامة على حسابهم على ما اكتسبوا من أعمال.
అల్లాహ్ కు తన సృష్టి యొక్క జ్ఞానం మరియు అవగాహన యొక్క పరిపూర్ణత. నిశ్చయంగా వారి చర్యల పై లెక్క తీసుకోవటంపై ఆయన పూర్తి సామర్ధ్యత. info

• تقرير أركان الإيمان وبيان أصوله.
విశ్వాసం యొక్క స్తంభాల యొక్క నివేదిక మరియు దాని మూలాల ప్రకటన. info

• قام هذا الدين على اليسر ورفع الحرج والمشقة عن العباد، فلا يكلفهم الله إلا ما يطيقون، ولا يحاسبهم على ما لا يستطيعون.
ఇస్లాం ధర్మం ప్రజలకు సులభతరమైన జీవితాన్ని అందించడం, ప్రజల జీవితాల నుండి హాని మరియు కష్టాలను తొలగించడం మీద ఆధారపడి ఉన్నది. ప్రజల శక్తిమేరకు మాత్రమే అల్లాహ్ వారి పై భారం మోపుతాడు మరియు వారు చేయగల శక్తిలేని వాటికి వారిని బాధ్యులుగా చేయడు. info