Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

Numero ng Pahina:close

external-link copy
84 : 18

اِنَّا مَكَّنَّا لَهٗ فِی الْاَرْضِ وَاٰتَیْنٰهُ مِنْ كُلِّ شَیْءٍ سَبَبًا ۟ۙ

నిశ్చయంగా మేము అతనికి భువిలో స్థానమును కల్పించాము. మరియు అతనికి మేము అతని కోరికకు సంబంధించిన ప్రతీ వస్తువు యొక్క మార్గమును ప్రసాధించాము.దాని ద్వారా అతను తాను కోరుకునే దానికి చేరుతాడు. info
التفاسير:

external-link copy
85 : 18

فَاَتْبَعَ سَبَبًا ۟

అయితే అతను తన కోరిన దానికి చేరుకోవటానికి మేము ప్రసాధించిన కారకాలు,మార్గములను ఎంచుకొని పడమర వైపునకు దృష్టి సారించాడు. info
التفاسير:

external-link copy
86 : 18

حَتّٰۤی اِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِیْ عَیْنٍ حَمِئَةٍ وَّوَجَدَ عِنْدَهَا قَوْمًا ؕ۬— قُلْنَا یٰذَا الْقَرْنَیْنِ اِمَّاۤ اَنْ تُعَذِّبَ وَاِمَّاۤ اَنْ تَتَّخِذَ فِیْهِمْ حُسْنًا ۟

మరియు అతడు నడవసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే వైపు భూమి అంతిమ భాగమునకు చేరుకున్నప్పుడు దానిని (సూర్యుడిని) నల్లటి బురద కల వేడి ఒక చెలిమిలో మునుగుతున్నట్లుగా చూశాడు. మరియు అతడు సూర్యుడు అస్తమించే చోట ఒక అవిశ్వాసపరుల జాతిని చూశాడు. మేము అతనికి దేనినైన ఎంచుకునే అధికారమిస్తూ అతనితో ఇలా పలికాము : ఓ రెండు కొమ్ములవాడా (జుల్ ఖర్ నైన్) నీవు వీరందరిని చంపి శిక్షించు లేదా ఇంకోవిధంగా,మరియు నీవు వారిపట్ల మంచిగా వ్యవహరించు. info
التفاسير:

external-link copy
87 : 18

قَالَ اَمَّا مَنْ ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهٗ ثُمَّ یُرَدُّ اِلٰی رَبِّهٖ فَیُعَذِّبُهٗ عَذَابًا نُّكْرًا ۟

జుల్ ఖర్నైన్ ఇలా పలికాడు : ఎవరైతే మేము అల్లాహ్ ఆరాధన వైపు మా పిలుపు తరువాత కూడా అల్లాహ్ తోపాటు సాటి కల్పించి దానిపై స్థిరంగా ఉంటాడో అతడిని మేము ఇహలోకంలో హతమార్చటం ద్వారా శిక్షిస్తాము. ఆ తరువాత అతడు ప్రళయదినాన తన ప్రభువు వైపునకు మరలుతాడు. అప్పుడు ఆయన అతడికి ఘోరమైన శిక్షకు గురి చేస్తాడు. info
التفاسير:

external-link copy
88 : 18

وَاَمَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهٗ جَزَآءَ ١لْحُسْنٰی ۚ— وَسَنَقُوْلُ لَهٗ مِنْ اَمْرِنَا یُسْرًا ۟ؕ

ఎవరైతే వారిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కర్మలు చేస్తాడో అతని కొరకు అతని విశ్వాసము,అతని సత్కర్మ కు ప్రతిఫలంగా స్వర్గము కలదు. మరియు మేము అతనికి దేనిలోనైతే మెత్తదనం,సున్నితము ఉన్నదో ఆ ఆదేశమును తెలుపుతాము. info
التفاسير:

external-link copy
89 : 18

ثُمَّ اَتْبَعَ سَبَبًا ۟

ఆ తరువాత అతను మొదటి మార్గం కాకుండా వేరే మార్గమును సూర్యుడు ఉదయించే వైపు పోయాడు. info
التفاسير:

external-link copy
90 : 18

حَتّٰۤی اِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلٰی قَوْمٍ لَّمْ نَجْعَلْ لَّهُمْ مِّنْ دُوْنِهَا سِتْرًا ۟ۙ

మరియు అతను నడవసాగాడు. చివరికి అతడు సూర్యుడు ఉదయించే చోటుకు చేరుకున్నప్పుడు సూర్యుడిని ఆ జాతుల వారిపై ఉదయస్తుండగా చూశాడు ఎవరి కొరకైతే సూర్యుడి నుండి వారికి రక్షణ కలిగించే ఇండ్లను గాని,చెట్ల నీడలనుగాని మేము చేయలేదు. info
التفاسير:

external-link copy
91 : 18

كَذٰلِكَ ؕ— وَقَدْ اَحَطْنَا بِمَا لَدَیْهِ خُبْرًا ۟

ఈ విధంగా జుల్ ఖర్నైన్ విషయం ఉన్నది. అతని వద్ద ఉన్న బలము,అధికారము యొక్క వివరణల ద్వారా మా జ్ఞానము చుట్టుముట్టింది. info
التفاسير:

external-link copy
92 : 18

ثُمَّ اَتْبَعَ سَبَبًا ۟

ఆ తరువాత అతను మొదటి రెండు మార్గములు కాకుండా తూర్పు,పడమరల మధ్యలో అడ్డంగా ఉన్నమార్గమును అనుసరించాడు (పోయాడు). info
التفاسير:

external-link copy
93 : 18

حَتّٰۤی اِذَا بَلَغَ بَیْنَ السَّدَّیْنِ وَجَدَ مِنْ دُوْنِهِمَا قَوْمًا ۙ— لَّا یَكَادُوْنَ یَفْقَهُوْنَ قَوْلًا ۟

మరియు అతడు నడవసాగాడు. చివరకు రెండు పర్వతాల మధ్య ఉన్న సులభ మార్గమునకు చేరుకున్నాడు. అప్పుడు అతను వాటి దగ్గర ఇతరుల భాష అర్ధం చేసుకోలేని ఒక జాతిని చూశాడు. info
التفاسير:

external-link copy
94 : 18

قَالُوْا یٰذَا الْقَرْنَیْنِ اِنَّ یَاْجُوْجَ وَمَاْجُوْجَ مُفْسِدُوْنَ فِی الْاَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلٰۤی اَنْ تَجْعَلَ بَیْنَنَا وَبَیْنَهُمْ سَدًّا ۟

వారు ఇలా పలికారు :ఓ జుల్ ఖర్నైన్ నిశ్చయంగా యాజూజ్,మాజూజ్ (అంటే ఆదమ్ సంతతిలో నుండి రెండు పెద్ద జాతులు) వారు పాల్పడే హత్యలు,ఇతర వాటి ద్వారా భువిలో ఉపద్రవాలను సృష్టిస్తున్నారు. నీవు వారికి,మాకి మధ్య అడ్డు గోడను నిర్మించటానికి మేము నీకు ఏదైన ధనాన్ని ఏర్పాటు చేయాలా ?. info
التفاسير:

external-link copy
95 : 18

قَالَ مَا مَكَّنِّیْ فِیْهِ رَبِّیْ خَیْرٌ فَاَعِیْنُوْنِیْ بِقُوَّةٍ اَجْعَلْ بَیْنَكُمْ وَبَیْنَهُمْ رَدْمًا ۟ۙ

జుల్ ఖర్నైన్ ఇలా సమాధానమిచ్చారు : నాకు నా ప్రభువు ప్రసాధించిన రాజరికము,అధికారము మీరు నాకు ఇచ్చే ధనం కన్న ఎంతో గొప్పది. కావున మీరు జనం,పరికరముల ద్వారా నాకు సహాయపడండి నేను మీకూ,వారికి మధ్య అడ్డు గోడను నిర్మిస్తాను. info
التفاسير:

external-link copy
96 : 18

اٰتُوْنِیْ زُبَرَ الْحَدِیْدِ ؕ— حَتّٰۤی اِذَا سَاوٰی بَیْنَ الصَّدَفَیْنِ قَالَ انْفُخُوْا ؕ— حَتّٰۤی اِذَا جَعَلَهٗ نَارًا ۙ— قَالَ اٰتُوْنِیْۤ اُفْرِغْ عَلَیْهِ قِطْرًا ۟ؕ

మీరు ఇనుప ముక్కలను తీసుకుని రండి.అప్పుడు వారు వాటిని తీసుకుని వచ్చారు. ఆయన వాటి ద్వారా రెండు కొండల మధ్య నిర్మించటం మొదలు పెట్టాడు. చివరకు ఆయన ఆరెండింటిని ఒక కట్టడం ద్వారా సమానం చేసినప్పుడు పని వాళ్ళతో మీరు ఈ ముక్కలపై అగ్నిని వెలిగించండి అని ఆదేశించాడు. ఇనుప ముక్కలు కాలి ఎర్రగా అయినప్పుడు ఆయన మీరు కరిగిన రాగిని తీసుకు రండి దాన్ని వాటిపై పోస్తాను అని ఆదేశించాడు. info
التفاسير:

external-link copy
97 : 18

فَمَا اسْطَاعُوْۤا اَنْ یَّظْهَرُوْهُ وَمَا اسْتَطَاعُوْا لَهٗ نَقْبًا ۟

అది ఎత్తుగా ఉండటం వలన యాజూజు,మాజూజు దానిపై ఎక్కలేక పోయారు,అది ఘనంగా ఉండటం వలన దాని క్రింద నుండి రంధ్రం చేయలేకపోయారు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• أن ذا القرنين أحد الملوك المؤمنين الذين ملكوا الدنيا وسيطروا على أهلها، فقد آتاه الله ملكًا واسعًا، ومنحه حكمة وهيبة وعلمًا نافعًا.
ప్రపంచమును ఏలి ప్రజలను పరిరక్షించిన విశ్వాసపర రాజులలో జుల్ ఖర్నైన్ ఒకడు.అల్లాహ్ ఆయనకు విశాలమైన రాజ్యమును ప్రసాధించాడు.మరియు ఆయనకు వివేకమును,ప్రతిష్టను,ప్రయోజనకరమైన జ్ఞానమును ప్రసాధించాడు. info

• من واجب الملك أو الحاكم أن يقوم بحماية الخلق في حفظ ديارهم، وإصلاح ثغورهم من أموالهم.
రాజు లేదా పాలకుడు సృష్టితాలకి వారి నివాసముల రక్షణ ద్వారా,వారి సరిహద్దులను వారి సంపదతో సంస్కరించటం అనివార్య కార్యముల్లోంచివి. info

• أهل الصلاح والإخلاص يحرصون على إنجاز الأعمال ابتغاء وجه الله.
నైపుణ్యత,చిత్తశుద్ధి ఉన్నవారు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఆచరణలను పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు. info