Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm

అల్-హుమజహ్

Ilan sa mga Layon ng Surah:
التحذير من الاستهزاء بالمؤمنين اغترارًا بكثرة المال.
అధిక ధనం వలన మోసపోయి విశ్వాసపరుల పట్ల పరిహాసమాడటం నుండి హెచ్చరించటం info

external-link copy
1 : 104

وَیْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةِ ۟ۙ

ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు. info
التفاسير:

external-link copy
2 : 104

١لَّذِیْ جَمَعَ مَالًا وَّعَدَّدَهٗ ۟ۙ

అతడి ఉద్దేశం సంపదను సేకరించటం మరియు దాన్ని లెక్కపెట్టి ఉంచటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు. info
التفاسير:

external-link copy
3 : 104

یَحْسَبُ اَنَّ مَالَهٗۤ اَخْلَدَهٗ ۟ۚ

అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు. info
التفاسير:

external-link copy
4 : 104

كَلَّا لَیُنْۢبَذَنَّ فِی الْحُطَمَةِ ۟ؗۖ

ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది. info
التفاسير:

external-link copy
5 : 104

وَمَاۤ اَدْرٰىكَ مَا الْحُطَمَةُ ۟ؕ

ఓ ప్రవక్త తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?. info
التفاسير:

external-link copy
6 : 104

نَارُ اللّٰهِ الْمُوْقَدَةُ ۟ۙ

నిశ్చయంగా అది అల్లాహ్ రాజేసిన అగ్ని. info
التفاسير:

external-link copy
7 : 104

الَّتِیْ تَطَّلِعُ عَلَی الْاَفْـِٕدَةِ ۟ؕ

అది ప్రజల శరీరముల నుండి వారి హృదయముల్లోకి చొచ్చుకుపోయేది. info
التفاسير:

external-link copy
8 : 104

اِنَّهَا عَلَیْهِمْ مُّؤْصَدَةٌ ۟ۙ

నిశ్చయంగా అది తనలో శిక్షింపబడే వారిపై నలువైపుల నుండి బంధించబడి ఉంటుంది. info
التفاسير:

external-link copy
9 : 104

فِیْ عَمَدٍ مُّمَدَّدَةٍ ۟۠

విస్తరించిన పొడవైన స్తంభాలలో చివరికి వారు దాని నుండి వెలుపలికి రాలేరు. info
التفاسير:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• خسران من لم يتصفوا بالإيمان وعمل الصالحات، والتواصي بالحق، والتواصي بالصبر.
విశ్వాసమును,సత్కర్మలను చేయటమును,సత్యము గురించి సహనము గురించి ఒకరినొకరు బోధించటం వంటి గుణములను కలగని వారి నష్టము. info

• تحريم الهَمْز واللَّمْز في الناس.
ప్రజల విషయంలో చాడీలు చెప్పటం మరియు దెప్పిపొడవటం నిషేదము. info

• دفاع الله عن بيته الحرام، وهذا من الأمن الذي قضاه الله له.
అల్లాహ్ తన పరిశుద్ధ గృహము తరుపు నుండి నిరొధించటం. మరియు ఇది అల్లాహ్ దాని కొరకు నిర్ణయించినటువంటి శాంతి. info