పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

external-link copy
32 : 53

اَلَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ— اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ؕ— هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ ۚ— فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ— هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰی ۟۠

ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి[1] మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా[2] ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి.[3] ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు. info

[1] పెద్దపాపాల వివరణ విషయంలో విద్వాంసుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. చాలా మంది విద్వాంసుల దృష్టిలో నరకశిక్ష సూచించబడిన పాపాలు పెద్దవి లేక ఖుర్ఆన్ మరియు 'హదీస్'లో గట్టిగా వారించబడినవి కూడా! అలాగే చిన్న పాపాలు మళ్ళీ మళ్ళీ చేయటం కూడా పెద్ద పాపమే.
ఫవా'హిషున్, ఫా'హిషతున్ యొక్క బహువచనం. అంటే సిగ్గుమాలిన పనులు ఉదా: 'జినా మరియు లవా'తత్. ఎవరైతే పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారికి క్షమాభిక్ష దొరకవచ్చు అని ఈ ఆయత్ లో చెప్పబడింది.
[2] అజిన్నతున్-జనీనున్ యొక్క బహువచనం అంటే తల్లిగర్భంలో ఉండే పిండం. అది ఇతరులకు కనిపించదు. కనుక దాన్ని ఆ విధంగా అంటారు.
[3] చూడండి, 4:49.

التفاسير: