పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
11 : 43

وَالَّذِیْ نَزَّلَ مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ ۚ— فَاَنْشَرْنَا بِهٖ بَلْدَةً مَّیْتًا ۚ— كَذٰلِكَ تُخْرَجُوْنَ ۟

మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు. info
التفاسير:

external-link copy
12 : 43

وَالَّذِیْ خَلَقَ الْاَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُمْ مِّنَ الْفُلْكِ وَالْاَنْعَامِ مَا تَرْكَبُوْنَ ۟ۙ

మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు; info
التفاسير:

external-link copy
13 : 43

لِتَسْتَوٗا عَلٰی ظُهُوْرِهٖ ثُمَّ تَذْكُرُوْا نِعْمَةَ رَبِّكُمْ اِذَا اسْتَوَیْتُمْ عَلَیْهِ وَتَقُوْلُوْا سُبْحٰنَ الَّذِیْ سَخَّرَ لَنَا هٰذَا وَمَا كُنَّا لَهٗ مُقْرِنِیْنَ ۟ۙ

మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు. info
التفاسير:

external-link copy
14 : 43

وَاِنَّاۤ اِلٰی رَبِّنَا لَمُنْقَلِبُوْنَ ۟

మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది!" [1] info

[1] దైవప్రవక్త ('స'అస) తమ వాహనం ఎక్కినప్పుడు: మూడుసార్లు అల్లాహు అక్బర్ తరువాత "సు'హానల్లజీ' స'ఖ్ఖరలనా హాజా' వమా కున్నా లహూ ముఖ్ రినీన్. వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్!" వరకు ఆ ఆయత్ లు (43:13-14) చదివే వారు. ('స. ముస్లిం).

التفاسير:

external-link copy
15 : 43

وَجَعَلُوْا لَهٗ مِنْ عِبَادِهٖ جُزْءًا ؕ— اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ مُّبِیْنٌ ۟ؕ۠

మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. [1] నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు! info

[1] చూవారు (ముష్రికులు) దైవదూత ('అలైహిమ్ స.) లను అల్లాహ్ (సు.తా.) కుమార్తెలుగా భావించే వారు. ఇక్కడ 'ఇబాదున్ - దాసులు, అంటే దైవదూతలు మరియు జు'జ్ అన్ - అంటే కుమార్తెలు. ఇంకా చూడండి, 6:100.

التفاسير:

external-link copy
16 : 43

اَمِ اتَّخَذَ مِمَّا یَخْلُقُ بَنٰتٍ وَّاَصْفٰىكُمْ بِالْبَنِیْنَ ۟

ఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా? [1] info

[1] చూడండి, 16:57-59.

التفاسير:

external-link copy
17 : 43

وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِمَا ضَرَبَ لِلرَّحْمٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِیْمٌ ۟

మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు! info
التفاسير:

external-link copy
18 : 43

اَوَمَنْ یُّنَشَّؤُا فِی الْحِلْیَةِ وَهُوَ فِی الْخِصَامِ غَیْرُ مُبِیْنٍ ۟

ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)? info
التفاسير:

external-link copy
19 : 43

وَجَعَلُوا الْمَلٰٓىِٕكَةَ الَّذِیْنَ هُمْ عِبٰدُ الرَّحْمٰنِ اِنَاثًا ؕ— اَشَهِدُوْا خَلْقَهُمْ ؕ— سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَیُسْـَٔلُوْنَ ۟

మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు. info
التفاسير:

external-link copy
20 : 43

وَقَالُوْا لَوْ شَآءَ الرَّحْمٰنُ مَا عَبَدْنٰهُمْ ؕ— مَا لَهُمْ بِذٰلِكَ مِنْ عِلْمٍ ۗ— اِنْ هُمْ اِلَّا یَخْرُصُوْنَ ۟ؕ

మరియు వారు ఇలా అంటారు: "ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు." దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు! info
التفاسير:

external-link copy
21 : 43

اَمْ اٰتَیْنٰهُمْ كِتٰبًا مِّنْ قَبْلِهٖ فَهُمْ بِهٖ مُسْتَمْسِكُوْنَ ۟

మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి? info
التفاسير:

external-link copy
22 : 43

بَلْ قَالُوْۤا اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّةٍ وَّاِنَّا عَلٰۤی اٰثٰرِهِمْ مُّهْتَدُوْنَ ۟

అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము." info
التفاسير: