పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
15 : 4

وَالّٰتِیْ یَاْتِیْنَ الْفَاحِشَةَ مِنْ نِّسَآىِٕكُمْ فَاسْتَشْهِدُوْا عَلَیْهِنَّ اَرْبَعَةً مِّنْكُمْ ۚ— فَاِنْ شَهِدُوْا فَاَمْسِكُوْهُنَّ فِی الْبُیُوْتِ حَتّٰی یَتَوَفّٰهُنَّ الْمَوْتُ اَوْ یَجْعَلَ اللّٰهُ لَهُنَّ سَبِیْلًا ۟

మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి[1]. info

[1] ఇది ము'హమ్మద్ ('స'అస), ప్రవక్తగా ఎన్నుకోబడిన మొదటి రోజులలో ఇవ్వబడిన అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ. ఆ తరువాత సూరహ్ అన్నూర్ (24:2)లో, అల్లాహుతా'ఆలా తన ఆదేశాన్ని వివరంగా అవతరింపజేశాడు. ఇంకా చూడండి, 4:25.

التفاسير:

external-link copy
16 : 4

وَالَّذٰنِ یَاْتِیٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا ۚ— فَاِنْ تَابَا وَاَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا ؕ— اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِیْمًا ۟

మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్ యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత[1]. info

[1] ఇది వ్యభిచార నేరానికి సంబంధించిన తొలి ఆదేశం. చూడండి 24:2 మరియు 4:25. స్త్రీ-పురుషుల లైంగిక సంబంధాలే కాక, స్త్రీ-స్త్రీ, లేక పురుష-పురుష లైంగిక సంబంధాలు కూడా శిక్షింపదగినవే!

التفاسير:

external-link copy
17 : 4

اِنَّمَا التَّوْبَةُ عَلَی اللّٰهِ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ یَتُوْبُوْنَ مِنْ قَرِیْبٍ فَاُولٰٓىِٕكَ یَتُوْبُ اللّٰهُ عَلَیْهِمْ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟

నిశ్చయంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహ్ కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి, వెనువెంటనే పశ్చాత్తాప పడతారో! అలాంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు. info
التفاسير:

external-link copy
18 : 4

وَلَیْسَتِ التَّوْبَةُ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السَّیِّاٰتِ ۚ— حَتّٰۤی اِذَا حَضَرَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ اِنِّیْ تُبْتُ الْـٰٔنَ وَلَا الَّذِیْنَ یَمُوْتُوْنَ وَهُمْ كُفَّارٌ ؕ— اُولٰٓىِٕكَ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟

మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్నమయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూ వుండి: "ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను!" అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించే వరకు సత్యతిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు[1]. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. info

[1] దీని అర్థం ఏమిటంటే, మరణ సమయం ఆసన్నమైనప్పుడు చేసే పశ్చాత్తాపం మరియు అవిశ్వాసుని విశ్వాసం అంగీకరించబడవు. చూడండి, 3:90-91.

التفاسير:

external-link copy
19 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا یَحِلُّ لَكُمْ اَنْ تَرِثُوا النِّسَآءَ كَرْهًا ؕ— وَلَا تَعْضُلُوْهُنَّ لِتَذْهَبُوْا بِبَعْضِ مَاۤ اٰتَیْتُمُوْهُنَّ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ ۚ— وَعَاشِرُوْهُنَّ بِالْمَعْرُوْفِ ۚ— فَاِنْ كَرِهْتُمُوْهُنَّ فَعَسٰۤی اَنْ تَكْرَهُوْا شَیْـًٔا وَّیَجْعَلَ اللّٰهُ فِیْهِ خَیْرًا كَثِیْرًا ۟

ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప[1]. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు! info

[1] చూడండి, 2:229.

التفاسير: