పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
24 : 22

وَهُدُوْۤا اِلَی الطَّیِّبِ مِنَ الْقَوْلِ ۖۗۚ— وَهُدُوْۤا اِلٰی صِرَاطِ الْحَمِیْدِ ۟

ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు. info
التفاسير:

external-link copy
25 : 22

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِیْ جَعَلْنٰهُ لِلنَّاسِ سَوَآءَ ١لْعَاكِفُ فِیْهِ وَالْبَادِ ؕ— وَمَنْ یُّرِدْ فِیْهِ بِاِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ اَلِیْمٍ ۟۠

నిశ్చయంగా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తూ (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి, మస్జిద్ అల్ హరామ్ నుండి ఆటంకపరుస్తారో - దేనికైతే మేము అందరి కొరకు సమానంగా చేసి ఉన్నామో - వారు అక్కడ నివసించేవారైనా సరే, లేదా బయట నుండి వచ్చిన వారైనా సరే.[1] మరియు ఎవరైనా దులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము. info

[1] దీనిని ఈ విధంగా చాలా మంది వ్యాఖ్యాతలు వివరించారు: మస్జిద్ అల్ - 'హరామ్ మీద అక్కడ నివసించే వారికి మరియు బయట నుండి వచ్చే వారికి సరిసమానమైన హక్కులున్నాయి. అంటే ఏ ముస్లింకు అయినా ఏ సమయంలో గానీ రాత్రింబవళ్ళు, మస్జిద్ అల్ - 'హరాంలో ప్రవేశించి 'తవాఫ్, నమా'జ్, 'ఉమ్రా మొదలైనవి చేసే హక్కు ఉంది. అతనిని ఎవ్వరూ, తన ప్రార్థనల నుండి ఆపరాదు. ఇక 'హరమ్ హద్దులలో ఉన్న భూమిలో ఇండ్లు కట్టుకున్న వారు తమ ఇండ్ల యజమానులు. కాని మినా, ము'జ్ దలిఫా, 'అరఫాత్ ('హజ్ ప్రాంతారాలు) మాత్రం సర్వముస్లింల కొరకు ఉన్నాయి. వాటిపై ఎవ్వరీ యజమాన్యం లేదు. ఈ విషయంపై ధర్మవేత్తలందరూ ఏకీభవిస్తున్నారు. చూ. 2:125.

التفاسير:

external-link copy
26 : 22

وَاِذْ بَوَّاْنَا لِاِبْرٰهِیْمَ مَكَانَ الْبَیْتِ اَنْ لَّا تُشْرِكْ بِیْ شَیْـًٔا وَّطَهِّرْ بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْقَآىِٕمِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟

మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ)[1] అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు"[2] అని అన్నాము. info

[1] నూ'హ్ ('అ.స.) 'తుఫాన్ తరువాత, క'అబహ్ గృహాన్ని నిర్మించిన వారు ఇబ్రాహీమ్ ('అ.స.) మరియు అతని కుమారుడు ఇస్మా'యీల్ ('అ.స.). ఆ తరువాత 40 సంవత్సరాల పిదప మస్జిద్ అల్ - అ'ఖ్సా నిర్మించబడింది. (ముస్నద్ అ'హ్మద్ 5/150, 166, 167 మరియు ముస్లిం, కితాబుల్ మసాజిద్). [2] 'తవాఫ్ మరియు నమా'జ్ కేవలం ఈ కాబాకే ప్రత్యేకించబడ్డాయి. కావున అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ ప్రకారం కేవలం క'అబహ్ కు మాత్రమే 'తవాఫ్ చేయాలి మరియు కేవలం ఈ క'అబహ్ వైపునకే ముఖం చేసి నమా'జ్ చేయాలి. ఈ క'అబహ్ ను విడిచి ఏ ఇతర దానికి 'తవాఫ్ చేయటం లేక దాని పైవునకు ముఖం చేసి నమా'జ్ చేయటం సత్యతిరస్కారం (కుఫ్ర్) అవుతుంది.

التفاسير:

external-link copy
27 : 22

وَاَذِّنْ فِی النَّاسِ بِالْحَجِّ یَاْتُوْكَ رِجَالًا وَّعَلٰی كُلِّ ضَامِرٍ یَّاْتِیْنَ مِنْ كُلِّ فَجٍّ عَمِیْقٍ ۟ۙ

మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు:[1] "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు. info

[1] 'హజ్ వివరాలకు చూడండి, 2:196-203.

التفاسير:

external-link copy
28 : 22

لِّیَشْهَدُوْا مَنَافِعَ لَهُمْ وَیَذْكُرُوا اسْمَ اللّٰهِ فِیْۤ اَیَّامٍ مَّعْلُوْمٰتٍ عَلٰی مَا رَزَقَهُمْ مِّنْ بَهِیْمَةِ الْاَنْعَامِ ۚ— فَكُلُوْا مِنْهَا وَاَطْعِمُوا الْبَآىِٕسَ الْفَقِیْرَ ۟ؗ

వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.[1] info

[1] అయ్యామిమ్ మ'లూమాత్: అంటే జి''బహ్ చేసే దినాలు, అంటే 10వ తేదీ మరియు దాని తరువాత మూడు దినాలు, అంటే 11, 12, 13 జు'ల్-'హజ్ తేదీలు. దాని మూడోవంతు మాంసాన్ని నిరుపేదలకు పంచటం విధి. ఈ 'జిబహ్ ఇస్మాయీల్ ('అ.స.) ను, అంతని తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.) - అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో - జి''బహ్ చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే. అంటే అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను శిరసావహించటమే ప్రతి ముస్లిం విధి. చూడండి, 37:102-107.

التفاسير:

external-link copy
29 : 22

ثُمَّ لْیَقْضُوْا تَفَثَهُمْ وَلْیُوْفُوْا نُذُوْرَهُمْ وَلْیَطَّوَّفُوْا بِالْبَیْتِ الْعَتِیْقِ ۟

తరువాత వారు హజ్జ్ ఆచారాలు[1] (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.[2] info

[1] అంటే 10వ జు'ల్-'హజ్ న చివరి షై'తైన్ (జమరతుల్ 'అఖబహ్)కు - ఏదైతే మక్కా వైపు ఉందో - ఏడు రవ్వలు రువ్వి, ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలను కత్తిరించుకుంటే, అది త'హ్లీలె అవ్వల్ లేక చిన్న 'హలాల్ అవుతుంది. అంటే ఇ'బ్రాహీమ్ నిషేధాలన్నీ ముగిసిపోతాయి. కాని 'తవాఫ్ ఇఫాదా ('జ్యారహ్) చేసే వరకు భార్యతో సంభోగం చేయడం నిషిద్ధం. [2] 'తవాఫె 'జ్యారహ్ : ఇది విధి, తప్పక చేయవలసింది. ఇది 'అరఫాత్ నుండి బయలు దేరి 9-10 తేదీల మధ్య రాత్రి ము'జ్ దలిఫాలో గడిపి 10వ తేదీ ఉదయం చివరి షై'తాన్ (జమరతుల్ 'అఖబహ్) కు ఏడు రవ్వలు రువ్వి, 'ఖుర్బానీ ఇచ్చి తలవెంట్రుకలు కత్తిరించుకొని, ఇ'హ్రామ్ విడిచిన తరువాత మక్కాకు పోయి క'అబహ్ గృహం చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయటం. ఇది 10,11,12 జు'ల్-'హజ్ తేదీలలో పూర్తి చేయాలి. దీని తరువాత భార్యతో సంభోగం చేయవచ్చు. ఇది చివరి 'హలాల్. వివరాలకు చూడండి, 2:196-197.

التفاسير:

external-link copy
30 : 22

ذٰلِكَ ۗ— وَمَنْ یُّعَظِّمْ حُرُمٰتِ اللّٰهِ فَهُوَ خَیْرٌ لَّهٗ عِنْدَ رَبِّهٖ ؕ— وَاُحِلَّتْ لَكُمُ الْاَنْعَامُ اِلَّا مَا یُتْلٰی عَلَیْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْاَوْثَانِ وَاجْتَنِبُوْا قَوْلَ الزُّوْرِ ۟ۙ

ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిద్ధమని) చెప్ప బడినవి తప్ప,[1] ఇతర పశువులన్నీ ధర్మ సమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్ధపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి. info

[1] చూడండి, 5:3.

التفاسير: