పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

external-link copy
142 : 2

سَیَقُوْلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰىهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِیْ كَانُوْا عَلَیْهَا ؕ— قُلْ لِّلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ؕ— یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: "వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, ఖిబ్లా నుండి త్రిప్పింది ఏమిటి?"[1] వారితో ఇలా అను: "తూర్పు మరియు పడమరలు అల్లాహ్ కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు." info

[1] మ'హా ప్రవక్త ('స'అస) మదీనాకు వలస పోయిన తరువాత 16, 17 నెలలు బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి నమాజ్' చేసేవారు. కాని అతని కోరిక క'అబహ్ (మక్కా) వైపుకు మాత్రమే ముఖం చేసి నమాజ్' చేయాలని ఉండేది. ఇదే ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఖిబ్లా కూడాను. మహా ప్రవక్త ('స'అస) దీనికై ఎన్నోసార్లు అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించారు. చివరకు అల్లాహుతా'ఆలా ఖిబ్లాను మార్చమని మహా ప్రవక్త ('స'అస)కు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు అవిశ్వాసులు ఈ విధంగా అన్నారు.

التفاسير: