அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்: 187:187 close

external-link copy
7 : 9

كَیْفَ یَكُوْنُ لِلْمُشْرِكِیْنَ عَهْدٌ عِنْدَ اللّٰهِ وَعِنْدَ رَسُوْلِهٖۤ اِلَّا الَّذِیْنَ عٰهَدْتُّمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ— فَمَا اسْتَقَامُوْا لَكُمْ فَاسْتَقِیْمُوْا لَهُمْ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُتَّقِیْنَ ۟

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు. info
التفاسير:

external-link copy
8 : 9

كَیْفَ وَاِنْ یَّظْهَرُوْا عَلَیْكُمْ لَا یَرْقُبُوْا فِیْكُمْ اِلًّا وَّلَا ذِمَّةً ؕ— یُرْضُوْنَكُمْ بِاَفْوَاهِهِمْ وَتَاْبٰی قُلُوْبُهُمْ ۚ— وَاَكْثَرُهُمْ فٰسِقُوْنَ ۟ۚ

(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు. info
التفاسير:

external-link copy
9 : 9

اِشْتَرَوْا بِاٰیٰتِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا فَصَدُّوْا عَنْ سَبِیْلِهٖ ؕ— اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి! info
التفاسير:

external-link copy
10 : 9

لَا یَرْقُبُوْنَ فِیْ مُؤْمِنٍ اِلًّا وَّلَا ذِمَّةً ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُعْتَدُوْنَ ۟

వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు. info
التفاسير:

external-link copy
11 : 9

فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَاِخْوَانُكُمْ فِی الدِّیْنِ ؕ— وَنُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము. info
التفاسير:

external-link copy
12 : 9

وَاِنْ نَّكَثُوْۤا اَیْمَانَهُمْ مِّنْ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوْا فِیْ دِیْنِكُمْ فَقَاتِلُوْۤا اَىِٕمَّةَ الْكُفْرِ ۙ— اِنَّهُمْ لَاۤ اَیْمَانَ لَهُمْ لَعَلَّهُمْ یَنْتَهُوْنَ ۟

మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు![1] info

[1] ఎవరైతే ఒడంబడిక చేసిన తరువాత తమ ఒండబడికలను భంగం చేస్తారో మరియు మీ ధర్మాన్ని అవమానపరుస్తారో, అలాంటి సత్యతిరస్కారులతో యుద్ధం చేయండి.

التفاسير:

external-link copy
13 : 9

اَلَا تُقَاتِلُوْنَ قَوْمًا نَّكَثُوْۤا اَیْمَانَهُمْ وَهَمُّوْا بِاِخْرَاجِ الرَّسُوْلِ وَهُمْ بَدَءُوْكُمْ اَوَّلَ مَرَّةٍ ؕ— اَتَخْشَوْنَهُمْ ۚ— فَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشَوْهُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟

ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో,[1] అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం. info

[1] బహుశా ఇక్కడ ఖురైషులు తమ ఒడంబడికకు విరుద్ధంగా బనీ-'ఖు'జా'అ వారిని చంపటానికి, బనీ-బక్ర్ వారికి తోడ్పడిన విషయం పేర్కొనబడింది. బనీ-'ఖు'జా'అ - ముస్లింల హలీఫ్ లు, మరియు బనీ-బక్ర్ - ఖురైషుల హలీఫ్ లు. దైవప్రవక్త ('స'అస) మరియు మక్కా ముష్రిక్ ఖురైషుల మధ్య: 'పది సంవత్సరాల వరకు - వారి మధ్య మరియు వారి హలీఫ్ లతో కూడా - యుద్ధం చేయకూడదు మరియు వారితో పోరాడే వారికి సహాయం కూడా చేయరాదు.' అనే, ఒడంబడిక ఉండెను. ఇది 6వ హిజ్రీలో హుదైబియాలో జరిగిన ఒడంబడిక.

التفاسير: