அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

గాఫిర్

external-link copy
1 : 40

حٰمٓ ۟ۚ

హా-మీమ్[1]. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 40

تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟ۙ

ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది. info
التفاسير:

external-link copy
3 : 40

غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ذِی الطَّوْلِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— اِلَیْهِ الْمَصِیْرُ ۟

పాపాలను క్షమించేవాడు [1] మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, [2] ఎంతో ఉదార స్వభావుడు. [3] ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది! info

[1] అల్-'గాఫిర్ : Oft-Forgiving, Most Forgiving. క్షమాగుణ పరిపూర్ణుడు, పాపాలను క్షమించేవాడు, ఎక్కువగా క్షమించేవాడు. ఇంకా చూడండి, అల్-'గఫ్ఫారు: క్షమించేవాడు, 20:82; అల్-'గఫూరు : 2:173.
[2] చూడండి, 8:52, 15:50.
[3] జి'-'త్తౌలు: అంటే Bestorwer of Favours, ఎంతో ఉదారస్వభావుడు, దాతృత్వుడు, ధనసంపత్తులు ప్రసాదించేవాడు, లేక తన దాసులను అనుగ్రహించేవాడు.

التفاسير:

external-link copy
4 : 40

مَا یُجَادِلُ فِیْۤ اٰیٰتِ اللّٰهِ اِلَّا الَّذِیْنَ كَفَرُوْا فَلَا یَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِی الْبِلَادِ ۟

సత్యతిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి గర్వపూరితమైన నడక నిన్ను మోసగింపనివ్వరాదు! info
التفاسير:

external-link copy
5 : 40

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّالْاَحْزَابُ مِنْ بَعْدِهِمْ ۪— وَهَمَّتْ كُلُّ اُمَّةٍ بِرَسُوْلِهِمْ لِیَاْخُذُوْهُ وَجٰدَلُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ ۫— فَكَیْفَ كَانَ عِقَابِ ۟

వారికి పూర్వం గడిచిన నూహ్ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. మరియు ప్రతి సమాజం వారు తమ సందేశహరుణ్ణి నిర్భంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించటానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో! info
التفاسير:

external-link copy
6 : 40

وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۟

మరియు ఈ విధంగా సత్యతిరస్కారానికి పాల్పడిన వారిని గురించి: "నిశ్చయంగా వారు నరకవాసులు." అని, అన్న నీ ప్రభువు వాక్కు సత్యమయ్యింది. info
التفاسير:

external-link copy
7 : 40

اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیُؤْمِنُوْنَ بِهٖ وَیَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ— رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِیْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِیْمِ ۟

సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. [1] మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: "ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!" info

[1] చూడండి, 7:54 మరియు 39:75.

التفاسير: