அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

external-link copy
228 : 2

وَالْمُطَلَّقٰتُ یَتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوْٓءٍ ؕ— وَلَا یَحِلُّ لَهُنَّ اَنْ یَّكْتُمْنَ مَا خَلَقَ اللّٰهُ فِیْۤ اَرْحَامِهِنَّ اِنْ كُنَّ یُؤْمِنَّ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— وَبُعُوْلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِیْ ذٰلِكَ اِنْ اَرَادُوْۤا اِصْلَاحًا ؕ— وَلَهُنَّ مِثْلُ الَّذِیْ عَلَیْهِنَّ بِالْمَعْرُوْفِ ۪— وَلِلرِّجَالِ عَلَیْهِنَّ دَرَجَةٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠

మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకతనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి[1]. మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు[2]. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మసమ్మతమైన హక్కులున్నాయి. ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది[3]. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. info

[1] ఈ శాసనం గర్భవతి అయిన స్త్రీకి వర్తించదు. వారి వేచి యుండే సమయం ('ఇద్దత్) కాన్పు వరకు ఉంటుంది. మరియు నికా'హ్ తరువాత సంభోగం కాని స్త్రీకి కూడా వర్తించదు. ఆమెకు 'ఇద్దత్ గడువు ఉండదు. మరియు ఋతుస్రావం ప్రారంభం కాని స్త్రీ మరియు ఋతుస్రావం ఆగిన స్త్రీకి కూడా వర్తించదు. వారి గడువు మూడు మాసాలు, (ఇబ్నె-కసీ'ర్). చూడండి, 65:1-7. ఇతర స్త్రీలు భర్త మరణించిన తరువాత నాలుగు మాసాల పది రోజులు వేచి ఉండాలి. (2:234) [2] ఇక్కడ గర్భం మరియు ఋతుస్రావం రెండింటిని కూడా దాచ వద్దని అర్థం. [3] మగవారికి ఉన్న ఆధిక్యత, వారి శారీరక బలం, వారికున్న జిహాద్ అనుమతి, వారసత్వంలో ఆధిక్యత మరియు భార్యాపిల్లలను మరియు కుటుంబం వారిని పోషించే బాధ్యత మొదలైనవి.

التفاسير: