அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்: 240:235 close

external-link copy
44 : 12

قَالُوْۤا اَضْغَاثُ اَحْلَامٍ ۚ— وَمَا نَحْنُ بِتَاْوِیْلِ الْاَحْلَامِ بِعٰلِمِیْنَ ۟

వారన్నారు: "ఇవి పీడకలలు. మరియు మాకు కలల గూఢర్థం తెలుసుకునే నైపుణ్యం లేదు!" info
التفاسير:

external-link copy
45 : 12

وَقَالَ الَّذِیْ نَجَا مِنْهُمَا وَادَّكَرَ بَعْدَ اُمَّةٍ اَنَا اُنَبِّئُكُمْ بِتَاْوِیْلِهٖ فَاَرْسِلُوْنِ ۟

ఆ ఇద్దరు బందీలలో నుండి విడుదల పొందిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడా విషయం గుర్తుకు వచ్చింది.[1] అతడు అన్నాడు: "నేను దీని గూఢార్థాన్ని మీకు తెలుపుతాను, దానికి నన్ను (యూసుఫ్ వద్దకు) పంపడి." info

[1] ఉమ్మతున్: అనే శబ్దానికి విద్వాసులందరీ ఏకైక అభిప్రాయం ఇక్కడ 'కాలం' అనే ఉంది.

التفاسير:

external-link copy
46 : 12

یُوْسُفُ اَیُّهَا الصِّدِّیْقُ اَفْتِنَا فِیْ سَبْعِ بَقَرٰتٍ سِمَانٍ یَّاْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَّسَبْعِ سُنْۢبُلٰتٍ خُضْرٍ وَّاُخَرَ یٰبِسٰتٍ ۙ— لَّعَلِّیْۤ اَرْجِعُ اِلَی النَّاسِ لَعَلَّهُمْ یَعْلَمُوْنَ ۟

(అతడు అన్నాడు): "యూసుఫ్! సత్యవంతుడా! నాకు - ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన ఆవులు తిని వేయటాన్ని; మరియు ఏడు పచ్చి వెన్నుల మరి ఏడు ఎండిపోయిన (వెన్నుల) - గూఢార్థమేమిటో చెప్పు. నేను (రాజసభలోని) ప్రజల వద్దకు పోయి (చెబుతాను), వారు దానిని తెలుసుకుంటారు." info
التفاسير:

external-link copy
47 : 12

قَالَ تَزْرَعُوْنَ سَبْعَ سِنِیْنَ دَاَبًا ۚ— فَمَا حَصَدْتُّمْ فَذَرُوْهُ فِیْ سُنْۢبُلِهٖۤ اِلَّا قَلِیْلًا مِّمَّا تَاْكُلُوْنَ ۟

(యూసుఫ్) అన్నాడు: "మీరు యథాప్రకారంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మాత్రమే తినటానికి ఉపయోగించుకొని, మిగిలినదంతా, వెన్నులతోనే కొట్లలో ఉంచి (భద్రపరచండి). info
التفاسير:

external-link copy
48 : 12

ثُمَّ یَاْتِیْ مِنْ بَعْدِ ذٰلِكَ سَبْعٌ شِدَادٌ یَّاْكُلْنَ مَا قَدَّمْتُمْ لَهُنَّ اِلَّا قَلِیْلًا مِّمَّا تُحْصِنُوْنَ ۟

ఆ తరువాత చాలా కఠినమైన ఏడు సంవత్సరాలు వస్తాయి, వాటిలో మీరు ముందే నిలువ చేసి ఉంచిన దానిని తింటారు. మీరు (విత్తనాని కోసం) భద్రంగా ఉంచుకున్న కొంతభాగం తప్ప! [1] info

[1] మిమ్మాతు'హ్'సినూన్: అంటే విత్తనాల కొరకు భద్రపరచిన ధాన్యం.

التفاسير:

external-link copy
49 : 12

ثُمَّ یَاْتِیْ مِنْ بَعْدِ ذٰلِكَ عَامٌ فِیْهِ یُغَاثُ النَّاسُ وَفِیْهِ یَعْصِرُوْنَ ۟۠

ఆ తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులో ప్రజలకు పుష్కలమైన వర్షాలు కురుస్తాయి. అందులో వారు (రసం/నూనె) తీస్తారు (పిండుతారు)." info
التفاسير:

external-link copy
50 : 12

وَقَالَ الْمَلِكُ ائْتُوْنِیْ بِهٖ ۚ— فَلَمَّا جَآءَهُ الرَّسُوْلُ قَالَ ارْجِعْ اِلٰی رَبِّكَ فَسْـَٔلْهُ مَا بَالُ النِّسْوَةِ الّٰتِیْ قَطَّعْنَ اَیْدِیَهُنَّ ؕ— اِنَّ رَبِّیْ بِكَیْدِهِنَّ عَلِیْمٌ ۟

రాజు ఇలా అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకు రండి!" రాజదూత అతని వద్దకు వచ్చినపుడు (యూసుఫ్) అన్నాడు: "నీవు తిరిగి పోయి నీ స్వామిని అడుగు: 'తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయం ఏమిటి?'[1] నిశ్చయంగా, నా ప్రభువుకు వారి కుట్ర గురించి బాగా తెలుసు." info

[1] యూసుఫ్ ('అ.స.) నిందితుడిగానే, కేవలం రాజు కనికరం వల్లనే కారాగారం నుండి విముక్తి పొందదలచుకోలేదు. అతను తనపై మోపబడిన నిందల నుండి పవిత్రుడనని, నిరూపించదలచు కున్నారు. కాబట్టి జవాబిచ్చారు: "అయితే, తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయమేమిటి" అని. ఇదే సత్యవంతులు పవిత్రులు అయిన అల్లాహ్ (సు.తా.) దా'ఈల విధానం.

التفاسير:

external-link copy
51 : 12

قَالَ مَا خَطْبُكُنَّ اِذْ رَاوَدْتُّنَّ یُوْسُفَ عَنْ نَّفْسِهٖ ؕ— قُلْنَ حَاشَ لِلّٰهِ مَا عَلِمْنَا عَلَیْهِ مِنْ سُوْٓءٍ ؕ— قَالَتِ امْرَاَتُ الْعَزِیْزِ الْـٰٔنَ حَصْحَصَ الْحَقُّ ؗ— اَنَا رَاوَدْتُّهٗ عَنْ نَّفْسِهٖ وَاِنَّهٗ لَمِنَ الصّٰدِقِیْنَ ۟

(రాజు స్త్రీలను) విచారించాడు: "మీరు యూసుఫ్ ను మోహింప జేయటానికి ప్రయత్నించిన విషయమేమిటి?" వారందరూ (ఒకేసారిగా) అన్నారు: "అల్లాహ్ రక్షించుగాక! మేము అతనిలో ఏ పాపాన్ని చూడలేదు!" అజీజ్ భార్య అన్నది: "ఇప్పుడు సత్యం బయటపడింది. నేనే అతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను. మరియు నిశ్చయంగా, అతను సత్యవంతుడు." info
التفاسير:

external-link copy
52 : 12

ذٰلِكَ لِیَعْلَمَ اَنِّیْ لَمْ اَخُنْهُ بِالْغَیْبِ وَاَنَّ اللّٰهَ لَا یَهْدِیْ كَیْدَ الْخَآىِٕنِیْنَ ۟

(అప్పుడు యూసుఫ్) అన్నాడు: "నేను ఇదంతా చేసింది నిశ్చయంగా, నేను (అజీజ్ కు) గోప్యంగా ఎలాంటి నమ్మకద్రోహం చేయలేదని తెలుపటానికే మరియు నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహుల కుట్రను సాగనివ్వడు. info
التفاسير: