அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - அல்முக்தஸர் பீ தப்ஸீரில் குர்ஆனில் கரீமுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு

பக்க எண்:close

external-link copy
45 : 27

وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰی ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا اَنِ اعْبُدُوا اللّٰهَ فَاِذَا هُمْ فَرِیْقٰنِ یَخْتَصِمُوْنَ ۟

మరియు నిశ్ఛయంగా మేము సమూద్ వద్దకు బంధుత్వములో వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాం ను మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి అని సందేశముతో పంపాము. వారికి ఆయన పిలుపు తరువాత రెండు వర్గాలుగా అయిపోయారు : ఒక వర్గము విశ్వాసపరులది ఇంకొకటి అవిశ్వాసపరులది వారిలో ఎవరు సత్యంపై ఉన్నారో అని పరస్పరం తగాదా పడ్డారు. info
التفاسير:

external-link copy
46 : 27

قَالَ یٰقَوْمِ لِمَ تَسْتَعْجِلُوْنَ بِالسَّیِّئَةِ قَبْلَ الْحَسَنَةِ ۚ— لَوْلَا تَسْتَغْفِرُوْنَ اللّٰهَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟

సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీరు ఎందుకు కారుణ్యము కన్న ముందు శిక్షను తొందరపెడుతున్నారు ?. ఎందుకని మీరు మీ పాపముల కొరకు అల్లాహ్ తో మన్నింపును ఆయన మీపై దయ చూపుతాడని ఆశిస్తూ వేడుకోరు. info
التفاسير:

external-link copy
47 : 27

قَالُوا اطَّیَّرْنَا بِكَ وَبِمَنْ مَّعَكَ ؕ— قَالَ طٰٓىِٕرُكُمْ عِنْدَ اللّٰهِ بَلْ اَنْتُمْ قَوْمٌ تُفْتَنُوْنَ ۟

అతనితో అతని జాతివారు సత్యము నుండి మొండితనమును చూపిస్తూ ఇలా పలికారు : మేము నీతో,నీతోపాటు ఉన్న విశ్వాసపరులతో అపశకునమును పొందాము. సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీకు ఇష్టం లేనివి మీకు కలగటం వలన మీరు అపశకునం గురించి దూషిస్తున్నారు. దాని జ్ఞానము అల్లాహ్ వద్ద ఉన్నది అందులో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. అంతేకాదు మీకు కలిగిన మేలు ద్వారా,మీకు సంభవించిన చెడు ద్వారా మీరు పరీక్షంపబడే జనులు మీరు. info
التفاسير:

external-link copy
48 : 27

وَكَانَ فِی الْمَدِیْنَةِ تِسْعَةُ رَهْطٍ یُّفْسِدُوْنَ فِی الْاَرْضِ وَلَا یُصْلِحُوْنَ ۟

మరియు హిజ్ర్ నగరంలో తొమ్మిది మంది అవిశ్వాసం,పాపకార్యముల ద్వారా భూమిలో అరాచకాలను సృష్టించేవారు. మరియు వారు అందులో విశ్వాసము ద్వారా,సత్కర్మ ద్వారా సంస్కరణ చేసేవారు కాదు. info
التفاسير:

external-link copy
49 : 27

قَالُوْا تَقَاسَمُوْا بِاللّٰهِ لَنُبَیِّتَنَّهٗ وَاَهْلَهٗ ثُمَّ لَنَقُوْلَنَّ لِوَلِیِّهٖ مَا شَهِدْنَا مَهْلِكَ اَهْلِهٖ وَاِنَّا لَصٰدِقُوْنَ ۟

వారిలోని కొందరు కొందరితో ఇలా పలికారు : మీలో నుండి ప్రతి ఒక్కరు మేము ఒక రాత్రి అతను ఇంటిలో ఉన్నప్పుడు అతని వద్దకు వచ్చి వారందరిని హతమార్చేస్తాము అని అల్లాహ్ పై ప్రమాణం చేయాలి. ఆ తరువాత అతని సంరక్షకుడితో మేము ఇలా చెబుతాము : సాలిహ్,అతని ఇంటివారి హత్య సమయంలో మేము లేము. మరియు నిశ్ఛయంగా మేము చెబుతున్న దానిలో సత్యవంతులము. info
التفاسير:

external-link copy
50 : 27

وَمَكَرُوْا مَكْرًا وَّمَكَرْنَا مَكْرًا وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟

మరియు వారు సాలిహ్,అతన్ని అనుసరించిన విశ్వాసపరులను తుదిముట్టించటానికి రహస్యంగా కుట్రలు పన్నారు. మరియు మేము కూడా ఆయనకు సహాయం కొరకు,వారి కుట్ర నుండి ఆయనను రక్షించటం కొరకు అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరులను తుదిముట్టించటానికి వ్యూహం రచించాము. అది వారికి తెలియదు. info
التفاسير:

external-link copy
51 : 27

فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْ ۙ— اَنَّا دَمَّرْنٰهُمْ وَقَوْمَهُمْ اَجْمَعِیْنَ ۟

ఓ ప్రవక్తా మీరు వారి కుట్రల,కుతంత్రాల పరిణామం ఏమయిందో దీర్ఘంగా ఆలోచించండి ?. నిశ్చయంగా మేము వారిని మా వద్ద నుండి శిక్ష ద్వారా కూకటి వేళ్ళతో పెకిలించాము అప్పుడు వారు వారి చివరి వరకు నాశనం అయిపోయారు. info
التفاسير:

external-link copy
52 : 27

فَتِلْكَ بُیُوْتُهُمْ خَاوِیَةً بِمَا ظَلَمُوْا ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

ఇవి వారి ఇండ్లు వాటి గోడలు వాటి పై కప్పుల సమేతంగా శిధిలమైపోయినవి. మరియు అవి వాటి యజమానుల నుండి వారి దుర్మార్గము వలన ఖాళీగా ఉండిపోయినవి. నిశ్ఛయంగా వారి దుర్మార్గము వలన వారికి సంభవించిన శిక్షలో విశ్వసించే జనులకు గుణపాఠం ఉన్నది. వారే సూచనలతో గుణపాఠం నేర్చుకుంటారు. info
التفاسير:

external-link copy
53 : 27

وَاَنْجَیْنَا الَّذِیْنَ اٰمَنُوْا وَكَانُوْا یَتَّقُوْنَ ۟

మరియు సాలిహ్ అలైహిస్సలాం జాతి వారిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచిన వారిని మేము కాపాడాము. మరియు వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన భీతిని కలిగి ఉంటారు. info
التفاسير:

external-link copy
54 : 27

وَلُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ وَاَنْتُمْ تُبْصِرُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు లూత్ అలైహిస్సలాం తన జాతి వారిని మందలిస్తూ,వారిని నిరాకరిస్తూ ఇలా పలికిన వైనమును గుర్తు చేసుకోండి : ఏమీ మీరు మీ సభల్లో బహిరంగంగా ఒకరిని ఒకరు చూస్తుండంగా అసహ్యకరమైన కార్యము స్వలింగ సంపర్కముకు పాల్పడుతున్నారా ?. info
التفاسير:

external-link copy
55 : 27

اَىِٕنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ تَجْهَلُوْنَ ۟

మీరు ఆడవారిని వదిలి మగవారి వద్దకు కామవాంచతో వస్తున్నారేమిటి. మీరు పవిత్రతను,సంతానమును కోరుకోవటం లేదు. కేవలం జంతువుల్లా కామవాంచను తీర్చుకోవటమే. అంతే కాదు మీపై అనివార్యమైన విశ్వాసమును,పరిశుద్ధతను,పాపకార్యముల నుండి దూరమును తెలియని మూర్ఖ జనం మీరు. info
التفاسير:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• الاستغفار من المعاصي سبب لرحمة الله.
పాపముల నుండి మన్నింపు వేడుకోవటం అల్లాహ్ కారుణ్యమునకు కారణం. info

• التشاؤم بالأشخاص والأشياء ليس من صفات المؤمنين.
మనుషుల ద్వారా,వస్తువుల ద్వారా అపశకునము భావించటం విశ్వాసపరుల లక్షణాల్లోంచి కాదు. info

• عاقبة التمالؤ على الشر والمكر بأهل الحق سيئة.
సత్యపు ప్రజలతో చెడుతనం,కుయుక్తులతో నిండటం యొక్క పరిణామం చెడ్డది. info

• إعلان المنكر أقبح من الاستتار به.
చెడును బహిరంగంగా చేయటం దాన్ని దాచిపెట్టి చేయటం కన్న ఎంతో చెడ్డది. info

• الإنكار على أهل الفسوق والفجور واجب.
అవిధేయపరులను,పాపాత్ములను తిరస్కరించటం తప్పనిసరి. info