د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد

د مخ نمبر:close

external-link copy
82 : 7

وَمَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْهُمْ مِّنْ قَرْیَتِكُمْ ۚ— اِنَّهُمْ اُنَاسٌ یَّتَطَهَّرُوْنَ ۟

కాని అతని జాతి వారి జవాబు కేవలం ఇలాగే ఉండింది:[1] "వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు!" info

[1] చూడండి, 27:56.

التفاسير:

external-link copy
83 : 7

فَاَنْجَیْنٰهُ وَاَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ ۖؗ— كَانَتْ مِنَ الْغٰبِرِیْنَ ۟

ఆ పిదప మేము అతనినీ మరియు అతని ఇంటివారినీ - అతని భార్యను తప్ప - రక్షించాము. ఆమె వెనుక ఉండిపోయిన వారిలో చేరిపోయింది.[1] info

[1] చూడండి, 11:81 మరియు 66:10.

التفاسير:

external-link copy
84 : 7

وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ؕ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِیْنَ ۟۠

మరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము.[1] చూడండి! ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో! info

[1] చూడండి, 11:82.

التفاسير:

external-link copy
85 : 7

وَاِلٰی مَدْیَنَ اَخَاهُمْ شُعَیْبًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— قَدْ جَآءَتْكُمْ بَیِّنَةٌ مِّنْ رَّبِّكُمْ فَاَوْفُوا الْكَیْلَ وَالْمِیْزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تُفْسِدُوْا فِی الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟ۚ

మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము).[1] అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులో అయితే, ఇదే మీకు మేలైనది. info

[1] మద్ యన్: ఒక తెగ మరియు నగరపు పేరు. వారి వద్దకు షు'ఐబ్ ('అ.స.) ప్రవక్తగా పంపబడ్డారు. దీని మరొక పేరు అయ్ కహ్.అది ఇప్పటి 'అఖబా అగాధం (Gulf of Aqaba) నుండి పడమటి వైపుకు సినాయి ద్వీపకల్పం (Sinai Peninsula) మరియు మో'ఆబ్ (Moab) పర్వతాల వరకు మరియు మృత సముద్రాని (Dead Sea)కి తూర్పు దిక్కున ఉంది. అక్కడ నివసించే వారు అమోరైట్ (Amorite) తెగకు చెందిన 'అరబ్బులు. షు'ఐబ్ ('అ.స.) మరొక పేరు ఎత్రో (Jethro), ఇతనే మూసా ('అ.స.) యొక్క భార్య తండ్రి అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇంకా చూడండి, 26:176.

التفاسير:

external-link copy
86 : 7

وَلَا تَقْعُدُوْا بِكُلِّ صِرَاطٍ تُوْعِدُوْنَ وَتَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ مَنْ اٰمَنَ بِهٖ وَتَبْغُوْنَهَا عِوَجًا ۚ— وَاذْكُرُوْۤا اِذْ كُنْتُمْ قَلِیْلًا فَكَثَّرَكُمْ ۪— وَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِیْنَ ۟

మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి. info
التفاسير:

external-link copy
87 : 7

وَاِنْ كَانَ طَآىِٕفَةٌ مِّنْكُمْ اٰمَنُوْا بِالَّذِیْۤ اُرْسِلْتُ بِهٖ وَطَآىِٕفَةٌ لَّمْ یُؤْمِنُوْا فَاصْبِرُوْا حَتّٰی یَحْكُمَ اللّٰهُ بَیْنَنَا ۚ— وَهُوَ خَیْرُ الْحٰكِمِیْنَ ۟

మరియు నా ద్వారా పంపబడిన దానిని (సందేశాన్ని) మీలో ఒక వర్గం వారు విశ్వసించి, మరొక వర్గం వారు విశ్వసించకపోతే! అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకూ సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి!"[1] info

[1] చూడండి, 9:52. 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 9, 'హదీస్' నం. 252, 266, 267, పు - 2 'హ. 539.

التفاسير: