د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد

د مخ نمبر:close

external-link copy
249 : 2

فَلَمَّا فَصَلَ طَالُوْتُ بِالْجُنُوْدِ ۙ— قَالَ اِنَّ اللّٰهَ مُبْتَلِیْكُمْ بِنَهَرٍ ۚ— فَمَنْ شَرِبَ مِنْهُ فَلَیْسَ مِنِّیْ ۚ— وَمَنْ لَّمْ یَطْعَمْهُ فَاِنَّهٗ مِنِّیْۤ اِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً بِیَدِهٖ ۚ— فَشَرِبُوْا مِنْهُ اِلَّا قَلِیْلًا مِّنْهُمْ ؕ— فَلَمَّا جَاوَزَهٗ هُوَ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ ۙ— قَالُوْا لَا طَاقَةَ لَنَا الْیَوْمَ بِجَالُوْتَ وَجُنُوْدِهٖ ؕ— قَالَ الَّذِیْنَ یَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوا اللّٰهِ ۙ— كَمْ مِّنْ فِئَةٍ قَلِیْلَةٍ غَلَبَتْ فِئَةً كَثِیْرَةً بِاِذْنِ اللّٰهِ ؕ— وَاللّٰهُ مَعَ الصّٰبِرِیْنَ ۟

ఆ పిదప 'తాలూత్ (సౌల్) తన సైన్యంతో బయలు దేరుతూ అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ ఒక నది [1] ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దాని నుండి నీరు త్రాగిన వాడు నా వాడు కాడు. మరియు నది నీటిని రుచి చూడని వాడు నిశ్చయంగా నా వాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే పర్వాలేదు." అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపు నిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: "జాలూత్ తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు." (కానీ ఒక రోజున) అల్లాహ్ ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: "అల్లాహ్ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నో సార్లు జరిగింది. మరియు అల్లాహ్ స్థైర్యం గలవారితోనే ఉంటాడు." info

[1] ఈ నది జొర్డాన్ మరియు ఫల'స్తీన్ ల మధ్య ఉంది.

التفاسير:

external-link copy
250 : 2

وَلَمَّا بَرَزُوْا لِجَالُوْتَ وَجُنُوْدِهٖ قَالُوْا رَبَّنَاۤ اَفْرِغْ عَلَیْنَا صَبْرًا وَّثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟ؕ

జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: "ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు. info
التفاسير:

external-link copy
251 : 2

فَهَزَمُوْهُمْ بِاِذْنِ اللّٰهِ ۙ۫— وَقَتَلَ دَاوٗدُ جَالُوْتَ وَاٰتٰىهُ اللّٰهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهٗ مِمَّا یَشَآءُ ؕ— وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّفَسَدَتِ الْاَرْضُ وَلٰكِنَّ اللّٰهَ ذُوْ فَضْلٍ عَلَی الْعٰلَمِیْنَ ۟

ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు [1] మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు."[2] info

[1] దావూద్ ('అ.స.) 'తాలూత్ సైన్యంలో ఒక సిపాయి. అతను జాలూత్ ను సంహరించారు. [2] ఇందులో అల్లాహ్ (సు.తా.) యొక్క ఒక సంప్రదాయం (సున్నత్) ఉన్నది. ఆయన మానవులలోని ఒక వర్గం ద్వారా, అధికారం మరియు దుర్మార్గం మీద ఉన్న, మరొక వర్గాన్ని అంతమొందిస్తాడు. చూడండి, 22:38-40.

التفاسير:

external-link copy
252 : 2

تِلْكَ اٰیٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَیْكَ بِالْحَقِّ ؕ— وَاِنَّكَ لَمِنَ الْمُرْسَلِیْنَ ۟

ఇవన్నీ అల్లాహ్ సందేశాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు (మా) సందేశహరులలో ఒకడవు.[1] info

[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 331; 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 735.

التفاسير: