[1] 'ఎవరైతే ముందుగా (మా వద్దకు) వస్తారో మరియు ఎవరు వెనుక ఉండిపోతారో...తెలుసు'. ఈ రెండురకాల వ్యాఖ్యానాలు కూడ సరైనవే అని వ్యాఖ్యాతలు అంగీకరించారు. మరొక వ్యాఖ్యానం: 'మరియు వాస్తవానికి, మీలో ముందుకు సాగిపోయే వారెవరో మాకు తెలుసు మరియు వాస్తవానికి, వెనుకంజ వేసేవారెవరో కూడా మాకు తెలుసు.' అని కూడా ఇవ్వబడింది.
[1] మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు. వేర్వేరు చోట్లలో ఆ మట్టి స్థితిని బట్టి వేర్వేరు పేర్లు ఇవ్వబడ్డాయి. 1) సాధారణంగా ఎడిపోయిన (తడిలేని) మట్టిని తురాబ్ - దుమ్ము అని, 2) దానిని నీళ్ళు వేసి కలిపితే 'తీన్ - మట్టి అని, 3) అది చాలా నీళ్ళతో కలిపి వాసన వచ్చే బురదగా ఉంటె, 'హమఇన్ మస్నూన్ - జిగట బురద అని, 4) అది ఎండిపోయి శబ్దం చేస్తే, - 'స'ల్సాల్ - అని, 5) దానిని కాల్చితే, ఫ'ఖ్ఖార్ - పెంకు, అని పేర్లు ఇవ్వబడ్డాయి. (చూడండి, 55:14).
[1] అల్ - జిన్ను, జిన్నతున్ (బ.వ.) అంటే మానవుల కండ్లకు కనబడనిది అని అర్థము. అందుకే వారిని ఈ పేరుతో పిలుస్తారు. వారికి తెలివి ఉంది, మంచి చెడుల విచక్షణా శక్తి ఉంది. పొగలేని అగ్నిజ్వాలలతో సృష్టించబడ్డారు. వారు తింటారు, త్రాగుతారు. వారి సంతతి పెరుగుతుంది. వారికి మరణం ఉంది. వారి కర్మలను బట్టి వారికి, మానవుల వలె స్వర్గనరకాల ప్రతిఫలాలు కూడా ఉన్నాయి. ('అబ్దుల్ మజీద్ దర్యాబాది, ర'హ్మ.) చూడండి 55:15 మరియు 6:100.
[1] ఈ సాష్టాంగం కేవలం అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను శిరసావహించటానికి చేయబడిన గౌరవప్రదమైన సాష్టాంగం. ఇది ఆరాధనార్థం చేసింది కాదు. ము'హమ్మద్ ('స'అస) షరీఅత్ లో గౌరవార్థం కూడా ఎవ్వరికైనను సాష్టాంగం చేయటం ధర్మసమ్మతం కాదు. ఇంకా చూడండి, 2:30-34 మరియు 7:11-18.
[1] 'మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు, కాని నేనైతే అగ్నితో సృష్టించబడ్డాను, కాబట్టి నేను మానవుని కంటే ఉత్తముడను, నేనెందుకు అతనికి సజ్దా చేయాలి.' అని ఇబ్లీస్ అన్నాడు. దైవప్రవక్తలందరూ మట్టితోనే సృష్టించబడ్డ మానవులేనని ఖుర్ఆన్ విశదీకరించింది. దీనిని విశ్వసించక పోవడం మరియు మట్టితో సృష్టించబడ్డవారు అధములని భావించడం షై'తాన్ ను అనుసరించడమే! ఇంకా చూడండి, 7:11.