[1] మక్కా ముష్రికులు రహ్మాన్ శబ్దాన్ని తిరస్కిరించేవారు. కావున హుదైబియా ఒప్పందం రోజు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస): "బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్." అని ఒప్పందం వ్రాయించడం ప్రారంభించినప్పుడు, ఒప్పందం చేసుకోవడానికి వచ్చిన రాయబారి: "అర్-రహ్మాన్ అర్-రహీమ్ ను" మేము ఎరుగము "బిస్మిక అల్లాహుమ్మ" అని వ్రాయలి." అని పట్టుపట్టాడు. ఖతదా('ర.ది.'అ.) కథనం, 'స. బు'ఖారీ).
[1] ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) అంటారు: 'ప్రతి దివ్యగ్రంథం ఖుర్ఆన్ అనబడుతోంది.' ఒక 'హదీస్'లో ఉంది: 'దావూద్ (అ.స.) పశువులను సిద్ధపరచమని ఆజ్ఞాపించి ఆ సమయంలో ఖుర్ఆన్ పఠనం పూర్తి చేసుకునేవారు.' ('స. బు'ఖారీ, కితాబ్ అల్ అంబియా, బాబె ఖౌల్ అల్లాహుతా'ఆలా: 'వ ఆతైనా దావూద జబూరా.') ఇక్కడ ఖుర్ఆన్ అంటే జబూర్ అని అర్థం. ఈ వాక్యపు అర్థం ఏమిటంటే ఒకవేళ ఇంతకూ పూర్వం దివ్యగ్రంథం చదువటం వలన కొండలు కదిలింపబడితే (పొడిపొడిగా మారిపోతే), లేక మృతులు మాట్లాడగలిగితే, ఈ ఖుర్ఆన్ లో కూడా అటువంటి లక్షణాలు ఉండేవి. మరికొందరి అభిప్రాయం ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ లో ఇటువంటి విశేష లక్షణాలు ఉండినా, ఈ సత్యతిరస్కారులు దీనిని ఏ మాత్రమూ విశ్వసించేవారు కారు. ఎందుకంటే వారిని విశ్వాసులుగా చేయటం అల్లాహ్ (సు.తా.) పనే. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ కూడా మార్చడు. ఎంతవరకైతే వారు తమను తాము మార్చుకోవటానికి ప్రయత్నించరో! [2] చూడండి, 2:26-27 మరియు 6:149. [3] చూడండి, 5:33.
[1] 'హదీస్'లో కూడా ఉంది: 'అల్లాహ్ (సు.తా.) దుర్మార్గులకు వ్యవధినిస్తూ పోతాడు, చివరకు వారిని శిక్షించటానికి పట్టుకున్నప్పుడు ఏ మాత్రమూ వదలడు.' దైవప్రవక్త ('స'అస), ఇది వినిపించిన తరువాత, ఆయత్ 11:102 ను చదివి వినిపించారు. ('స'హీ'హ్ బు'ఖారీ, 'స. ముస్లిం).
[1] మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. మీరు ఏ దేవతలనైతే ఆరాధిస్తున్నారో అవి మీకు కీడు గానీ, మేలు గానీ చేయలేవు. మీరు పిలిచేవి - వాటి పేర్లే. అవి మీరో లేక మీ తండ్రితాతలో ఇచ్చినవే. అవి మీ కల్పిత దైవాలే. చూడండి, 53:23, 7:71 మరియు 12:40. [2] చూడండి, 5:41 మరియు 16:37.
[1] ఈ ప్రపంచ శిక్ష (అ'జాబ్) పరలోక శిక్ష కంటే చాలా తేలికైనది. ఈ ప్రపంచ శిక్ష తాత్కాలికమైనది. పరలోక శిక్ష శాశ్వతమైనది. నరకాగ్ని భూలోక అగ్ని కంటే 69 రెట్లు అధిక తీవ్రత గలది. ('స'హీ'హ్ ముస్లిం).