د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

د مخ نمبر:close

external-link copy
55 : 36

اِنَّ اَصْحٰبَ الْجَنَّةِ الْیَوْمَ فِیْ شُغُلٍ فٰكِهُوْنَ ۟ۚ

నిశ్చయంగా స్వర్గవాసులు శాశ్వత అనుగ్రహాలను, గొప్ప సాఫల్యమును చూసినప్పుడు ప్రళయదినాన తమ ఇతర విషయాల గురించి నిశ్ఛింతగా ఉంటారు. వారు వాటిలో సుఖభోగాలను అనుభవిస్తూ సంతోషముగా ఉంటారు. info
التفاسير:

external-link copy
56 : 36

هُمْ وَاَزْوَاجُهُمْ فِیْ ظِلٰلٍ عَلَی الْاَرَآىِٕكِ مُتَّكِـُٔوْنَ ۟ۚ

వారు మరియు వారి సతీమణులు స్వర్గము యొక్క విశాలమైన నీడల క్రింద ఆసనాలపై కూర్చుని ఆస్వాదిస్తుంటారు. info
التفاسير:

external-link copy
57 : 36

لَهُمْ فِیْهَا فَاكِهَةٌ وَّلَهُمْ مَّا یَدَّعُوْنَ ۟ۚ

వారి కొరకు ఈ స్వర్గములో ద్రాక్ష,అంజూరము,దానిమ్మ లాంటి రకరకాల శ్రేష్టమైన ఫలములు ఉంటాయి. మరియు వారి కొరకు వారు కోరుకునే ప్రతీది ఇష్టపడే ప్రదేశముల్లోంచి,రకరకాల అనుగ్రహాల్లోంచి కలవు. వాటిలో నుంచి వారు ఏది కోరుకున్న అది లభిస్తుంది. info
التفاسير:

external-link copy
58 : 36

سَلٰمٌ ۫— قَوْلًا مِّنْ رَّبٍّ رَّحِیْمٍ ۟

మరియు వారి కొరకు ఈ అనుగ్రహాలపై సలాం వారికి కరుణామయుడైన తమ ప్రభువు వద్జ నుండి వారిపై మాటగా లభించును. ఎప్పుడైతే ఆయన వారికి సలాం చేస్తాడో ప్రతీ వైపు నుండి వారికి శాంతి కలుగును. మరియు వారికి అభినందన కలుగును దాని కన్న గొప్ప అభినందన ఏదీ ఉండదు. info
التفاسير:

external-link copy
59 : 36

وَامْتَازُوا الْیَوْمَ اَیُّهَا الْمُجْرِمُوْنَ ۟

మరియు ప్రళయదినాన ముష్రికులతో ఇలా పలుకబడును : మీరు విశ్వాసపరుల నుండి వేరైపోండి. వారు మీతో పాటు కావటం వారికి తగదు. మీ ప్రతిఫలాలను వారి ప్రతిఫలాలతో మరియు మీ లక్షణాలను వారి లక్షణాలతో విబేధించటానికి. info
التفاسير:

external-link copy
60 : 36

اَلَمْ اَعْهَدْ اِلَیْكُمْ یٰبَنِیْۤ اٰدَمَ اَنْ لَّا تَعْبُدُوا الشَّیْطٰنَ ۚ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟ۙ

ఏమీ నేను మీకు నా ప్రవక్తల నోటితో మీకు ఆజ్ఞాపించి,ఆదేశించి మీతో ఇలా పలకలేదా : ఓ ఆదం సంతతివారా మీరు అన్ని రకాల అవిశ్వాస,పాప కార్యాలకు పాల్పడి షైతాను మాట వినకండి. నిశ్చయంగా షైతాను మీకు స్పష్టమైన శతృవు. తన శతృత్వమును బహిర్గతము చేసే శతృవుకు విధేయత చూపటం బుద్దిమంతుడికి ఎలా తగదు. info
التفاسير:

external-link copy
61 : 36

وَّاَنِ اعْبُدُوْنِیْ ؔؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟

ఓ ఆదం సంతతివారా నేను నా ఒక్కడి ఆరాధన చేయమని,నాతోపాటు ఎవరినీ సాటి కల్పించవద్దని మిమ్మల్ని ఆదేశించాను. నా ఒక్కడి ఆరాధన చేయటం,నాకు విధేయత చూపటం నా మన్నతకు,స్వర్గ ప్రవేశమునకు దారి తీసే తిన్నని మార్గము. కాని దేని గురించైతే నేను మీకు బోధించానో మరియు ఆదేశించానో వాటిని మీరు పాటించలేదు. info
التفاسير:

external-link copy
62 : 36

وَلَقَدْ اَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِیْرًا ؕ— اَفَلَمْ تَكُوْنُوْا تَعْقِلُوْنَ ۟

మరియు నిశ్చయంగా షైతాను మీలో నుండి చాలా మంది సృష్టితాలను అపమార్గమునకు లోను చేశాడు. ఏ మీకు మీ ప్రభువుకు విధేయత చూపమని,పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి ఆరాధన చేయమని ఆదేశించే, మీకు స్పష్టమైన శతృవైన షైతాను విధేయత నుండి భయపెట్టే బుద్దులు లేవా ?! info
التفاسير:

external-link copy
63 : 36

هٰذِهٖ جَهَنَّمُ الَّتِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ ۟

ఇది అదే నరకము దేని గురించైతే ఇహలోకములో మీ అవిశ్వాసం మూలంగా మీతో వాగ్దానం చేయబడిందో. మరియు అది మీ నుండి అదృశ్యంగా ఉండేది. మరియు మీరు ఈ రోజు దాన్ని కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నారు. info
التفاسير:

external-link copy
64 : 36

اِصْلَوْهَا الْیَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟

మీరు ఈ రోజు అందులో ప్రవేశించండి. మరియు ప్రాపంచిక మీ జీవితంలో అల్లాహ్ పట్ల మీరు కనబరచిన మీ అవిశ్వాసం మూలంగా దాని వేడితో బాధను అనుభవించండి. info
التفاسير:

external-link copy
65 : 36

اَلْیَوْمَ نَخْتِمُ عَلٰۤی اَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَاۤ اَیْدِیْهِمْ وَتَشْهَدُ اَرْجُلُهُمْ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟

ఆ రోజు మేము వారి నోళ్ళపై ముద్ర వేస్తాము అప్పుడు వారు మూగవారై తాము పాల్పడిన అవిశ్వాసము,పాపాలను తిరస్కరించటం గురించి మాట్లాడరు. మరియు వారి చేతులు వాటితో ఇహలోకంలో చేసిన వాటి గురించి మాతో మాట్లాడుతాయి. మరియు వారి కాళ్ళు వారు పాల్పడే పాపాల గురించి,వాటి వద్ద నడిచి వెళ్ళిన దాన్ని గురించి సాక్ష్యం పలుకుతాయి. info
التفاسير:

external-link copy
66 : 36

وَلَوْ نَشَآءُ لَطَمَسْنَا عَلٰۤی اَعْیُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَاَنّٰی یُبْصِرُوْنَ ۟

మరియు ఒక వేళ మేము వారి కళ్ళను పోగొట్టదలచితే వాటిని పోగొట్టుతాము. అప్పుడు వారు చూడలేరు. అప్పుడు వారు దారి వైపునకు దాని ద్వారా దాటి స్వర్గము వైపునకు వెళ్లటానికి పరుగెత్తుతారు. వారు దాటటం అసాధ్యం . వాస్తవానికి వారి చూపు పోయినది. info
التفاسير:

external-link copy
67 : 36

وَلَوْ نَشَآءُ لَمَسَخْنٰهُمْ عَلٰی مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوْا مُضِیًّا وَّلَا یَرْجِعُوْنَ ۟۠

మరియు ఒక వేళ మేము వారి సృష్టిని మార్చటమును,వారిని వారి కాళ్ళపై కూర్చోపెట్టటమును కోరుకుంటే మేము వారి సృష్టిని మార్చేవారము, వారిని వారి కాళ్ళ పై కూర్చోపెట్టేవారము. అప్పుడు వారు తమ స్థానమును విడిచిపెట్టలేరు. మరియు వారు ముందుకు వెళ్ళటంగాని వెనుకకు మరలటం గాని చేయలేరు. info
التفاسير:

external-link copy
68 : 36

وَمَنْ نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِی الْخَلْقِ ؕ— اَفَلَا یَعْقِلُوْنَ ۟

మరియు మేము ప్రజల్లోంచి ఎవరి ఆయుషును పొడిగించి అతని జీవితమును పొడిగిస్తామో అతన్ని మేము బలహీన దశకు మరలుస్తాము. ఏమీ వారు తమ బుద్ధులతో ఆలోచన చేసి ఈ నివాసము స్థిరమైన,శాశ్వతమైన నివాసము కాదని, స్థిరమైన నివాసము అది పరలోక నివాసమని గుర్తించటంలేదా. info
التفاسير:

external-link copy
69 : 36

وَمَا عَلَّمْنٰهُ الشِّعْرَ وَمَا یَنْۢبَغِیْ لَهٗ ؕ— اِنْ هُوَ اِلَّا ذِكْرٌ وَّقُرْاٰنٌ مُّبِیْنٌ ۟ۙ

మరియు అతను కవి అన్న వాదన మీ కొరకు నిజం అవ్వటానికి మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమునకు కవిత్వమును నేర్పలేదు. మరియు ఆయనకు అది తగదు ఎందుకంటే అది ఆయన స్వభావము నుంచి కాదు. మరియు అతని స్వభావమునకు అది తగదు. ఆయనకు మేము కేవలం హితోపదేశమును,స్పష్టమైన ఖుర్ఆన్ ను దానిలో యోచన చేసే వారి కొరకు నేర్పించాము. info
التفاسير:

external-link copy
70 : 36

لِّیُنْذِرَ مَنْ كَانَ حَیًّا وَّیَحِقَّ الْقَوْلُ عَلَی الْكٰفِرِیْنَ ۟

ఆయన బ్రతికి ఉన్న హృదయం కలవాడికి,జ్ఞానోదయం ఉన్నవాడికి హెచ్చరించటానికి. అతడే దానితో ప్రయోజనం చెందుతాడు. మరియు అవిశ్వాసపరులపై శిక్ష నిరూపితమవుతుంది. అప్పుడు దాని అవతరణ గురించి, అతని సందేశము వారికి చేరవేయటం గురించి వారిపై వాదన నిరూపితమైనది. వారు వంక పెట్టటానికి ఎటువంటి వంక వారి కొరకు మిగల్లేదు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• في يوم القيامة يتجلى لأهل الإيمان من رحمة ربهم ما لا يخطر على بالهم.
ప్రళయదినమున విశ్వాసపరుల కొరకు తమ ప్రభువు యొక్క కారుణ్యము బహిర్గతమవుతుంది దాన్ని వారు తమ ఆలోచనల్లో కూడా పొందలేదు. info

• أهل الجنة مسرورون بكل ما تهواه النفوس وتلذه العيون ويتمناه المتمنون.
స్వర్గవాసులు మనస్సులు కోరుకునే వాటితో,కళ్ళు ఆనందించే వాటితో,ఆశించేవారు ఆశించే వాటితో సంతోషంగా ఉంటారు. info

• ذو القلب هو الذي يزكو بالقرآن، ويزداد من العلم منه والعمل.
హృదయం కలవాడే ఖుర్ఆన్ ద్వారా పరిశుద్ధుడవుతాడు. మరియు దాని నుండి జ్ఞానమును,ఆచరణ అధికం చేస్తాడు. info

• أعضاء الإنسان تشهد عليه يوم القيامة.
ప్రళయదినమున మనిషి అవయవాలు అతనికి వ్యతిరేకముగా సాక్ష్యం పలుకుతాయి. info