د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

د مخ نمبر:close

external-link copy
6 : 30

وَعْدَ اللّٰهِ ؕ— لَا یُخْلِفُ اللّٰهُ وَعْدَهٗ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟

ఈ సహాయం మహోన్నతుడైన అల్లాహ్ తరపు నుండి వాగ్దానము. మరియు అది సాక్షాత్కరించడం ద్వారా విశ్వాసపరులు అల్లాహ్ విజయ వాగ్దానంలో నమ్మకమును అధికం చేసుకుంటారు. కాని చాలా మంది ప్రజలు తమ అవిశ్వాసం వలన దీనిని అర్ధం చేసుకోరు. info
التفاسير:

external-link copy
7 : 30

یَعْلَمُوْنَ ظَاهِرًا مِّنَ الْحَیٰوةِ الدُّنْیَا ۖۚ— وَهُمْ عَنِ الْاٰخِرَةِ هُمْ غٰفِلُوْنَ ۟

విశ్వాసము,ధర్మ ఆదేశాల గురించి వారికి తెలియదు. వారికి మాత్రం జీవనోపాధి సంపాదనకు,భౌతిక నాగరికత నిర్మాణమునకు సంభంధించిన ఇహలోక జీవితము గురించి బాహ్యపరంగా తెలుసు. మరియు వారు వాస్తవ జీవిత నివాసమైన పరలోకము నుండి విముఖత చూపుతున్నారు. దాని పట్ల వారు శ్రద్ధ చూపరు. info
التفاسير:

external-link copy
8 : 30

اَوَلَمْ یَتَفَكَّرُوْا فِیْۤ اَنْفُسِهِمْ ۫— مَا خَلَقَ اللّٰهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّی ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكٰفِرُوْنَ ۟

ఏ ఈ తిరస్కరించే ముష్రికులందరు తమ స్వయంలో అల్లాహ్ వారిని,ఇతరులను ఎలా సృష్టించాడో యోచన చేయరా ?. అల్లాహ్ ఆకాశములను,భూమిని సత్యముతో మాత్రమే సృష్టించాడు. వాటిని ఆయన వృధాగా సృష్టించలేదు. అవి రెండు లోకములో ఉండటానికి ఒక నిర్ణీత సమయమును వాటి కొరకు ఆయన తయారు చేశాడు. మరియు నిశ్చయంగా ప్రజల్లోంచి చాలా మంది ప్రళయదినాన తమ ప్రభవును కలవటం గురించి తిరస్కరించారు. అందువలనే వారు మరణాంతరం లేపబడటం కొరకు తమ ప్రభువు వద్ద స్వీకృతమయ్యే సత్కర్మ ద్వారా సిద్ధమవటం లేదు. info
التفاسير:

external-link copy
9 : 30

اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاَثَارُوا الْاَرْضَ وَعَمَرُوْهَاۤ اَكْثَرَ مِمَّا عَمَرُوْهَا وَجَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ؕ— فَمَا كَانَ اللّٰهُ لِیَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟ؕ

ఏ వీరందరు వీరికన్న మునుపటి తిరస్కార జాతుల ముగింపు ఏవిధంగా అయినదో యోచన చేయటానికి భూమిలో సంచరించలేదా ?. ఈ జాతుల వారు వీరికన్న ఎక్కువ బలవంతులు. మరియు వారు వ్యవసాయం కొరకు,నిర్మాణం కొరకు దున్నారు. వీరందరు నిర్మించిన వాటి కంటే ఎక్కువగా వారు నిర్మించారు. మరియు వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారాలను,వాదనలను తీసుకుని వస్తే వారు తిరస్కరించారు. అల్లాహ్ వారిని తుదిముట్టించినప్పుడు వారిని హింసించలేదు. కాని వారే తమ అవిశ్వాసం వలన వినాశన స్థానములకు రావటం వలన తమ స్వయమును హింసించుకున్నారు. info
التفاسير:

external-link copy
10 : 30

ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِیْنَ اَسَآءُوا السُّوْٓاٰۤی اَنْ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ وَكَانُوْا بِهَا یَسْتَهْزِءُوْنَ ۟۠

ఆ తరువాత ఎవరి కర్మలైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం,దుష్కర్మలకు పాల్పడటంతో చెడుగా అయినవో వారి ముగింపు అత్యంత చెడు ముగింపు అయినది. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించారు. మరియు వారు వాటి గురించి హేళన చేసేవారు. మరియు వాటి గురించి పరిహాసమాడేవారు. info
التفاسير:

external-link copy
11 : 30

اَللّٰهُ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟

అల్లహ్ యే పూర్వ నమూనా లేకుండా సృష్టిని ప్రారంభిస్తాడు. ఆ తరువాత దాన్ని అంతం చేస్తాడు. ఆ తరువాత దాన్ని మరలా తీసుకుని వస్తాడు. ఆ తరువాత మీరు ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాధించటం కొరకు ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు. info
التفاسير:

external-link copy
12 : 30

وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ یُبْلِسُ الْمُجْرِمُوْنَ ۟

మరియు ప్రళయం నెలకొన్న రోజు అపరాధులు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ చెందుతారు. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసముపై వారి వాదన అంతమవటం వలన ఆ రోజు వారి ఆశ అంతమైపోతుంది. info
التفاسير:

external-link copy
13 : 30

وَلَمْ یَكُنْ لَّهُمْ مِّنْ شُرَكَآىِٕهِمْ شُفَعٰٓؤُا وَكَانُوْا بِشُرَكَآىِٕهِمْ كٰفِرِیْنَ ۟

వారు ఇహలోకములో ఆరాధించే వారి భాగ స్వాముల్లోంచి ఎవరూ శిక్ష నుండి వారిని రక్షించటానికి సిఫారసు చేసేవారు వారి కొరకు ఉండరు. మరియు వారు తమ భాగస్వాములను తిరస్కరిస్తారు. నిశ్చయంగా వారి అవసరమున్నప్పుడు వారు సహాయమును వదిలివేశారు ఎందుకంటే వారందరు వినాశనంలో సమానము. info
التفاسير:

external-link copy
14 : 30

وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ یَوْمَىِٕذٍ یَّتَفَرَّقُوْنَ ۟

మరియు ఏ రోజు ప్రళయం నెలకొంటుందో ఆ రోజు ప్రజలు ఇహ లోకములోని తమ కర్మలను బట్టి ప్రతిఫలం విషయంలో వర్గములుగా విడిపోతారు. కొంత మంది ఇల్లియ్యీన్ లో లేపబడుతారు,మరికొందరు నీచాతి నీచమైన స్థానమైన సిజ్జీన్ లో దించబడుతారు. info
التفاسير:

external-link copy
15 : 30

فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصَّلِحٰتِ فَهُمْ فِیْ رَوْضَةٍ یُّحْبَرُوْنَ ۟

ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి,ఆయన వద్ద స్వీకృతమయ్యే సత్కార్యములు చేస్తారో వారు స్వర్గములో అక్కడ వారు పొందే ఎన్నడూ అంతం కాని శాశ్వత అనుగ్రహాలతో పరవశించబడుతారు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• العلم بما يصلح الدنيا مع الغفلة عما يصلح الآخرة لا ينفع.
పరలోకమును సంస్కరించే వాటి నుండి అశ్రద్ధ వహింటంతో పాటు ఇహలోకమును సంస్కరించే వాటి జ్ఞానం ప్రయోజనం చేకూర్చదు. info

• آيات الله في الأنفس وفي الآفاق كافية للدلالة على توحيده.
స్వయంలో,జగతిలో అల్లాహ్ సూచనలు ఆయన ఏకత్వమును ఋజువు చేయటానికి చాలును. info

• الظلم سبب هلاك الأمم السابقة.
పూర్వ సమాజాల వినాశనమునకు హింస కారణము. info

• يوم القيامة يرفع الله المؤمنين، ويخفض الكافرين.
ప్రళయదినమున అల్లాహ్ విశ్వాసపరులను ఉన్నత స్థానాలకు చేర్చి అవిశ్వాసపరులను దిగజారుస్తాడు. info