د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
18 : 3

شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۙ— وَالْمَلٰٓىِٕكَةُ وَاُولُوا الْعِلْمِ قَآىِٕمًا بِالْقِسْطِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟ؕ

తన ఏకదైవత్వాన్ని సూచించే షరిఅహ్ చట్టం (పవిత్ర ధర్మశాసనం) మరియు సార్వత్రిక చిహ్నాల ఆధారంగా కేవలం తాను మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. దైవదూతలు మరియు జ్ఞానులు కూడా ఆయన ఏకత్వాన్ని బహిరంగంగా ప్రకటించడం మరియు ఆహ్వానించడం ద్వారా దీనికి సాక్ష్యమిస్తున్నారు. ఎవరైనా సాక్ష్యమివ్వ గలిగే విషయాలన్నింటిలోని అతి గొప్ప విషయంపై వారు సాక్ష్యమిస్తున్నారు అంటే కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధించబడే సంపూర్ణ హక్కు, ఇంకా ఆయన సృష్టి మరియు షరీఅహ్ (పవిత్ర ధర్మశాసనం) చట్టంలోని పరిపూర్ణ న్యాయంపై సాక్ష్యం ఇవ్వడం. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడూ లేడని, ఆయనను అధిగమించే శక్తి ఎవ్వరికీ లేదని, తన సృష్టిలో, ప్రణాళికలో మరియు శాసించడంలో ఆయనను మించిన వివేకవంతులు లేరనే సాక్ష్యం, ఎవరైనా ఇవ్వగలిగే సాక్ష్యాలన్నింటి కంటే అత్యంత గొప్ప సాక్ష్యం. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• من أعظم ما يُكفِّر الذنوب ويقي عذاب النار الإيمان بالله تعالى واتباع ما جاء به الرسول صلى الله عليه وسلم.
పాపాలను తుడిచి పెట్టే మరియు నరకాగ్ని శిక్షల నుండి కాపాడే అత్యంత గొప్ప విషయం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను విశ్వసించడం మరియు ప్రవక్త తీసుకు వచ్చిన దానిని అనుసరించడం. info

• أعظم شهادة وحقيقة هي ألوهية الله تعالى ولهذا شهد الله بها لنفسه، وشهد بها ملائكته، وشهد بها أولو العلم ممن خلق.
అత్యంత గొప్పదైన మరియు వాస్తవమైన సాక్ష్యము ఏదంటే కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. అందువలన అల్లాహ్ స్వయంగా దీనిపై సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేగాక ఆయన యొక్క దైవదూతలు మరియు జ్ఞానులు కూడా దీనిపై సాక్ష్యం ఇస్తున్నారు. info

• البغي والحسد من أعظم أسباب النزاع والصرف عن الحق.
తిరుగుబాటు మరియు అసూయ అనేవి సంఘర్షణకు దారి తీస్తాయి మరియు సత్యం నుండి దూరం చేసి పరధ్యానానికి గురి చేస్తాయి. info