د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

د مخ نمبر:close

external-link copy
30 : 2

وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ جَاعِلٌ فِی الْاَرْضِ خَلِیْفَةً ؕ— قَالُوْۤا اَتَجْعَلُ فِیْهَا مَنْ یُّفْسِدُ فِیْهَا وَیَسْفِكُ الدِّمَآءَ ۚ— وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ؕ— قَالَ اِنِّیْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ ۟

అల్లాహ్ సుబ్హానహు వతఆలా తాను దైవదూతలతో మాట్లాడిన సన్నివేశాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు:నిస్సందేహంగా ఆయన భువిలో ఒకరికొకరు ప్రాతినిధ్యం వహించుచు దైవవిధేయతను (ధర్మాన్ని) స్ధాపించేందుకు మానవుణ్ని సృష్టించబోతున్నాను.అని అన్నాడు అప్పుడు దైవదూతలు విశ్లేషణ మరియు మార్గదర్శకాన్ని పొందే ఉద్దేశ్యంతో మానవుణ్ని భూమిపై ప్రతినిధిగా పంపటం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు.వారు అందులో కల్లోలాన్ని వ్యాపింపజేస్తారు మరియు దౌర్జన్యంతో నెత్తురును చిందిస్తారు(అని అభ్యర్ధించారు) మరియు మేము నీ విధేయతకు కట్టుబడి ఉండేవాళ్లం నీ పవిత్రతను కొనియాడేవాళ్లం,నీ ఘనతను చాటేవాళ్లము.మరియు వీటి నంచి అలసిపోయే వాళ్లము కాదు కదా అని అన్నారు.అప్పుడు అల్లాహ్ వారి ప్రశ్నకు సమాధానంగా:నిస్సందేహంగా మానవుని సృష్టి వెనుక మీకు తెలియని పరమార్ధాన్ని మరియు వారి ప్రాతినిధ్యం యొక్క లక్ష్యాన్ని నేను తెలిసినవాడను. info
التفاسير:

external-link copy
31 : 2

وَعَلَّمَ اٰدَمَ الْاَسْمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَی الْمَلٰٓىِٕكَةِ فَقَالَ اَنْۢبِـُٔوْنِیْ بِاَسْمَآءِ هٰۤؤُلَآءِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరియు ఆదం(అలైహిస్సలాం) యొక్క ఘనతను తెలియజేయటానికి అల్లాహ్ సమస్త జంతువుల మరియు సమస్త వస్తువుల,పదార్ధాల పేర్లను,వాటి అర్ధాలను నేర్పించాడు. తరువాత వాటిని దైవదూతల ముందు ప్రదర్శించి:ఒక వేళ మీరు ఈ (మానవ) సృష్టి కన్నా ఉత్తములన్న మీ ప్రతిపాదనలో సత్యవంతులైతే వీటి పేర్లను తెలపండి అని అన్నాడు. info
التفاسير:

external-link copy
32 : 2

قَالُوْا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَاۤ اِلَّا مَا عَلَّمْتَنَا ؕ— اِنَّكَ اَنْتَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟

వారు తమ లోపాన్ని అంగీకరిస్తూ అల్లాహ్ వైపు ఆయన ఘనతను కొనియాడుతూ ఇలా అన్నారు: ఓ మా ప్రభువా మేము నీ ఆదేశానికి మరియు సంవిధానానికి అభ్యంతరాన్ని తెలియజేసిన దాని నుంచి నీ పవిత్రతను కొనియాడుతున్నాము.నీవు మాకు ప్రసాదించిన జ్ఞానం తప్ప మాకు ఏదియు తెలియదు.నిస్సందేహంగా నీవు సర్వజ్ఞానివి నీ నుంచి ఏది అగోచరము కాదు.నీవు మహావివేకివి సమస్త వ్యవహారాలను నీ సంవిధానం మరియు నీ శక్తి సామర్ధ్యాలతో తగిన స్థానంలో ఉంచగలవాడవు. info
التفاسير:

external-link copy
33 : 2

قَالَ یٰۤاٰدَمُ اَنْۢبِئْهُمْ بِاَسْمَآىِٕهِمْ ۚ— فَلَمَّاۤ اَنْۢبَاَهُمْ بِاَسْمَآىِٕهِمْ ۙ— قَالَ اَلَمْ اَقُلْ لَّكُمْ اِنِّیْۤ اَعْلَمُ غَیْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۙ— وَاَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟

అప్పుడు అల్లాహ్ ఆదం(అలైహిస్సలాం)ను నీవు ఈ వస్తువుల పేర్లను తెలియజేయమని ఆదేశించాడు.మరి ఎప్పుడైతే తన ప్రభువు నేర్పినవాటిని అతను తెలియజేశాడో అప్పుడు అల్లాహ్ దైవదూతలతో ఇలా అన్నాడు: నేను భూమ్యాకాశాలలో అగోచరమైన వాటన్నింటినీ తెలిసినవాడను అని మీకు చెప్పలేదా?మరియు మీరు దాచి ఉంచే వాటిని మీరు బహిర్గతం చేసే వాటిని కూడి తెలిసినవాడను. info
التفاسير:

external-link copy
34 : 2

وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰی وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟

అల్లాహ్ ఆదం (అలైహిస్సలాం) కు మర్యాదపూర్వకమైన గౌరవసాష్టాంగాన్ని చేయమని దైవదూతలను ఆదేశించిన సన్నివేశాన్ని వివరించాడు.అప్పుడు వారందరూ సాష్టాంగము చేశారు.కానీ ఒక్క ఇబ్లీసు తప్ప అతడు జిన్నాతులలో ఒకడు.అతడు అల్లాహ్ యొక్క ఆదేశానికి అభ్యంతరాన్ని తెలుపుతూ సాష్టాంగపడటానికి నిరాకరించాడు మరియు ఆదం(అలైహిస్సలాం) పట్ల గర్వాన్ని ప్రదర్శించాడు.కనుక అతను (ఇలా) అల్లాహ్ ను తిరస్కరించినవారిలో చేరాడు. info
التفاسير:

external-link copy
35 : 2

وَقُلْنَا یٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَیْثُ شِئْتُمَا ۪— وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ ۟

మరియు మేము ఆదముతో ఇలా అన్నాము: ఓ ఆదం నీవు నీ భార్య స్వర్గంలో నివసించండి మరియు మీరిరువురూ స్వర్గం యొక్క ఏ ప్రదేశం యొక్క ఫలాలను యథేచ్ఛగా తినండి.వాటిని ఆస్వాధించటంలో మీకు ఏవిధమైన విరక్తి కలుగదు.కానీ నేను మీకు నిషేధించిన ఈ చెట్టు నుంచి తినే ఉద్దేశ్యంతో దానికి దరిదాపులకు కూడా పోకండి అలా చేస్తే మీరిద్దరూ మీకు ఆజ్ఞాపించిన దానికి అవిధేయులై దుర్మార్గులలో చేరిన వారవుతారు. info
التفاسير:

external-link copy
36 : 2

فَاَزَلَّهُمَا الشَّیْطٰنُ عَنْهَا فَاَخْرَجَهُمَا مِمَّا كَانَا فِیْهِ ۪— وَقُلْنَا اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— وَلَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟

షైతాన్ వారిరువురిని పెడత్రోవ పట్టించడానికి (వారి మనసులలో) ప్రేరేపిస్తూ మరియు(నిషేధించిన చెట్టువైపు) ఆకర్షిస్తూ ఉన్నాడు. చివరికి వారికి నిషేధించిన చెట్టు నుంచి తినే పొరపాటుకు మరియు నేరానికి లోను చేశాడు.కనుక అల్లాహ్ వారికి ఫలితంగా వారు నివసిస్తున్న స్వర్గం నుంచి బహిష్కరించాడు.మరియు అల్లాహ్ వారితో మరియు షైతానుతో ఇలా అన్నాడు: మీరంతా భూలోకానికి దిగిపోండి మీరు ఒండొకరిపట్ల విరోధులు మరియు మీ కొరకు భూమిపై ఒక నిర్ణీత సమయం నివసించటం నిర్ధారించబడింది. దానిలోని మంచివాటితో లబ్ది పొందుతూ మీ చివరి ఘడియ వరకు ప్రళయం సంభవించే వరకు అక్కడే గడప వలసి ఉంటుంది. info
التفاسير:

external-link copy
37 : 2

فَتَلَقّٰۤی اٰدَمُ مِنْ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَیْهِ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟

ఆదమ్ ('అ.స.)అల్లాహ్ నుంచి పొందిన మాటల ద్వారా ప్రార్ధించవలసినదిగా సూచించబడ్డారు.అవి అల్లాహ్ తెలిపిన ఈ వాక్యాలలో ఉన్నాయి:అప్పుడు వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు ఓ మా ప్రభువా మాకు మేమే అన్యాయం చేసుకున్నాము మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే మరియు క్షమించకపోతే నిశ్చయంగా మేము నష్టపోయే వారమౌవుతాము.(7ఆరాఫ్:23) కనుక అల్లాహ్ వారి క్షమాపణను స్వీకరించాడు మరియు ఆయన అమితంగా క్షమించేవాడు మరియు తన దాసులను అనన్యంగా కనికరించేవాడు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి. info

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది. info

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం. info