د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

د مخ نمبر:close

external-link copy
76 : 17

وَاِنْ كَادُوْا لَیَسْتَفِزُّوْنَكَ مِنَ الْاَرْضِ لِیُخْرِجُوْكَ مِنْهَا وَاِذًا لَّا یَلْبَثُوْنَ خِلٰفَكَ اِلَّا قَلِیْلًا ۟

అవిశ్వాసపరులు మిమ్మల్ని మక్కా నుండి వెళ్ళగొట్టటానికి తమ శతృత్వము ద్వారా మిమ్మల్నే కలవరపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అల్లాహ్ మీరు మీ ప్రభువు ఆదేశముతో హిజ్రత్ చేసేంత వరకు మిమ్మల్ని వెళ్ళగొట్టటం నుండి వారిని ఆపి ఉంచాడు. వారు ఒక వేళ వారు మిమ్మల్ని వెళ్ళగొడితే మిమ్మల్ని వెళ్ళగొట్టిన తరువాత కొద్ది కాలం మాత్రమే ఉండగలుగుతారు. info
التفاسير:

external-link copy
77 : 17

سُنَّةَ مَنْ قَدْ اَرْسَلْنَا قَبْلَكَ مِنْ رُّسُلِنَا وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِیْلًا ۟۠

మీ తర్వాత వారు కొద్ది కాలము తప్ప ఉండరన్న ఈ తీర్పు మీ కన్నపూర్వ ప్రవక్తల్లో ఎల్లప్పుడు స్థిరంగా ఉన్న సంప్రదాయము. అదేమిటంటే ఏ ప్రవక్తను అతని జాతి వారు తమ మధ్య నుండి వెళ్ళగొడతారో వారిపై అల్లాహ్ శిక్షను అవతరింపజేస్తాడు. ఓ ప్రవక్తా మీరు మా సంప్రదాయములో మార్పును పొందలేరు. కాని మీరు దాన్ని ఎల్లప్పుడూ స్థిరంగా పొందుతారు. info
التفاسير:

external-link copy
78 : 17

اَقِمِ الصَّلٰوةَ لِدُلُوْكِ الشَّمْسِ اِلٰی غَسَقِ الَّیْلِ وَقُرْاٰنَ الْفَجْرِ ؕ— اِنَّ قُرْاٰنَ الْفَجْرِ كَانَ مَشْهُوْدًا ۟

మీరు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో దాని వేళల్లో సూర్యుడు ఆకాశము మధ్య నుండి వాలినప్పటి నుండి - ఇందులో జొహర్,అసర్ నమాజులు ఉన్నాయి - రాత్రి చీకటి వరకు - ఇందులో మగ్రిబ్,ఇషా నమాజులు ఉన్నవి - నెలకోల్పండి. మరియు మీరు ఫజర్ నమాజును నెలకోల్పండి,అందులో ఖిరాఅత్ (ఖుర్ఆన్ పారాయణము) ను సుదీర్ఘంగా చేయండి. ఫజర్ నమాజు వేళ రాత్రి దైవ దూతలు,పగటి దైవ దూతలు హాజరవుతారు. info
التفاسير:

external-link copy
79 : 17

وَمِنَ الَّیْلِ فَتَهَجَّدْ بِهٖ نَافِلَةً لَّكَ ۖۗ— عَسٰۤی اَنْ یَّبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُوْدًا ۟

ఓ ప్రవక్తా నీవు రాత్రి నిలబడి అందులో కొద్ది భాగము నమాజు చదువు. నీ నమాజు నీ కొరకు నీ స్థానములను పెంచటంలో అధికమవటానికి, ప్రళయదినాన నీ ప్రభువు నిన్ను ప్రజల కొరకు వారు ఉన్న భయాందోళనల నుండి సిఫారసు చేసే వాడిగా పంపిస్తాడని అన్వేషిస్తూ, నీ కొరకు సిఫారసు యొక్క గొప్ప స్థానము దేనినైతే ముందువారు ,చివరి వారు పొగిడారో అది కలగటానికి. info
التفاسير:

external-link copy
80 : 17

وَقُلْ رَّبِّ اَدْخِلْنِیْ مُدْخَلَ صِدْقٍ وَّاَخْرِجْنِیْ مُخْرَجَ صِدْقٍ وَّاجْعَلْ لِّیْ مِنْ لَّدُنْكَ سُلْطٰنًا نَّصِیْرًا ۟

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా ప్రభువా నా ప్రవేశాలన్నింటిని,నా బహిర్గమనాలన్నింటిని నీ విధేయతలో,నీ ఇష్టానుసారంగా ఉండేటట్లు చేయి. మరియు నీ వద్ద నుండి నాకు నీవు నా శతృవు కి విరద్ధంగా సహాయపడటానికి బహిరంగ ఆధారమును తయారు చేసి ఇవ్వు. info
التفاسير:

external-link copy
81 : 17

وَقُلْ جَآءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ؕ— اِنَّ الْبَاطِلَ كَانَ زَهُوْقًا ۟

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఇస్లాం వచ్చింది.అల్లాహ్ దానికి సహాయము చేసి దాని ద్వారా ఏదైతే వాగ్ధానం చేశాడో అవి నిరూపితమైనవి. మరియు షిర్క్,అవిశ్వాసం అంతరించింది. నిశ్చయంగా అసత్యము సత్యం ముందట నిలబడలేక అంతరించిపోతుంది. info
التفاسير:

external-link copy
82 : 17

وَنُنَزِّلُ مِنَ الْقُرْاٰنِ مَا هُوَ شِفَآءٌ وَّرَحْمَةٌ لِّلْمُؤْمِنِیْنَ ۙ— وَلَا یَزِیْدُ الظّٰلِمِیْنَ اِلَّا خَسَارًا ۟

మేము అవతరింపజేస్తున్నటువంటి ఈ ఖుర్ఆన్ అజ్ఞానము,అవిశ్వాసము,సందేహము నుండి హృదయముల కొరకు స్వస్థత కలది, దాన్ని చదివి ఊదినప్పుడు శరీరముల కొరకు స్వస్థత కలది, దాని ప్రకారం ఆచరించే విశ్వాసపరుల కొరకు కారుణ్యము కలది. ఈ ఖుర్ఆన్ అవిశ్వాసపరుల కొరకు వినాశనమును మాత్రమే అధికం చేస్తుంది. ఎందుకంటే దాన్ని వింటే అది వారికి ఆగ్రహమును కలిగిస్తుంది, దాని నుండి తిరస్కారమును,విముఖతను వారికి అధికం చేస్తుంది. info
التفاسير:

external-link copy
83 : 17

وَاِذَاۤ اَنْعَمْنَا عَلَی الْاِنْسَانِ اَعْرَضَ وَنَاٰ بِجَانِبِهٖ ۚ— وَاِذَا مَسَّهُ الشَّرُّ كَانَ یَـُٔوْسًا ۟

మరియు మేము మానవునికి ఆరోగ్యము,ఐశ్వర్యము లాంటి అనుగ్రహాలను అనుగ్రహించినప్పుడు అతడు అల్లాహ్ కి కృతజ్ఞత తెలపటం నుండి,ఆయనకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడు,అహంకారముతో దూరమవుతాడు. మరియు అతనికి అనారోగ్యము లేదా పేదరికం,అటువంటివి ఏవైన కలిగినప్పుడు అతడు అల్లాహ్ కారుణ్యము నుండి తీవ్రంగా నిరాశ,నిస్పృహలకు లోనవుతాడు. info
التفاسير:

external-link copy
84 : 17

قُلْ كُلٌّ یَّعْمَلُ عَلٰی شَاكِلَتِهٖ ؕ— فَرَبُّكُمْ اَعْلَمُ بِمَنْ هُوَ اَهْدٰی سَبِیْلًا ۟۠

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ప్రతీ మనిషి సన్మార్గ విషయంలో,అపమార్గ విషయంలో తన పరిస్థితికి తగిన విధమైన తన పద్దతి ప్రకారం ఆచరిస్తున్నాడు. అయితే సత్యం వైపునకు మార్గం ప్రకారం సన్మార్గం పొందిన వాడెవడో మీ ప్రభువుకు బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
85 : 17

وَیَسْـَٔلُوْنَكَ عَنِ الرُّوْحِ ؕ— قُلِ الرُّوْحُ مِنْ اَمْرِ رَبِّیْ وَمَاۤ اُوْتِیْتُمْ مِّنَ الْعِلْمِ اِلَّا قَلِیْلًا ۟

ఓ ప్రవక్తా గ్రంధవహులలో నుండి అవిశ్వాసపరులు మీతో ఆత్మ యొక్క వాస్తవికత గురించి అడుగుతున్నారు. అయితే మీరు వారితో ఇలా పలకండి : ఆత్మ యొక్క వాస్తవికత గురించి అల్లాహ్ కి మాత్రమే తెలుసు. మరియు మీకు,సృష్టితాలన్నిటికి ఇవ్వబడిన జ్ఞానము పరిశుద్ధుడైన అల్లాహ్ జ్ఞానము ముందు చాలా తక్కువ. info
التفاسير:

external-link copy
86 : 17

وَلَىِٕنْ شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهٖ عَلَیْنَا وَكِیْلًا ۟ۙ

అల్లాహ్ సాక్షిగా ఓ ప్రవక్తా ఒక వేళ మేము మీపై అవతరింపజేసిన దైవ వాణిని హృదయముల నుండి,పుస్తకముల నుండి చరిపివేసి తీసుకుని వెళ్ళదలిస్తే తప్పకుండా మేము దాన్ని తీసుకుని వెళతాము. ఆ తరువాత మీకు సహాయపడి ఆయన స్పందనకు బాధ్యత వహించేవాడిని మీరు పొందలేరు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• في الآيات دليل على شدة افتقار العبد إلى تثبيت الله إياه، وأنه ينبغي له ألا يزال مُتَمَلِّقًا لربه أن يثبته على الإيمان.
ఆయతుల్లో దాసుడు అల్లాహ్ తనను స్థిరత్వమును ప్రసాధించటం యొక్క అత్యంత అవసరం కలవాడని,మరియు అతడు తనకు విశ్వాసంపై స్థిరత్వాన్ని తన ప్రభువు కలిగించాలని తన ప్రభువుతో ఇమిడి ఉండటం అవసరమని ఆధారం ఉన్నది . info

• عند ظهور الحق يَضْمَحِل الباطل، ولا يعلو الباطل إلا في الأزمنة والأمكنة التي يكسل فيها أهل الحق.
సత్యం బహిర్గతమయ్యేటప్పుడు అసత్యము బలహీనపడుతుంది. సత్యపరులు అశ్రద్ధ వహించే కాలముల్లో,ప్రాంతముల్లో మాత్రమే అసత్యము ఉన్నత స్థాయికి చేరుతుంది. info

• الشفاء الذي تضمنه القرآن عام لشفاء القلوب من الشُّبَه، والجهالة، والآراء الفاسدة، والانحراف السيئ والمقاصد السيئة.
సందేహాల నుండి,అజ్ఞానము నుండి,చెడు అభిప్రాయాల నుండి,చెడు విచలనము నుండి మరియు దుర ఉద్దేశాల నుండి హృదయములను నయం చేయటానికి ఖుర్ఆన్ కలిగి ఉన్న వైధ్యము సర్వసాధారణం. info

• في الآيات دليل على أن المسؤول إذا سئل عن أمر ليس في مصلحة السائل فالأولى أن يعرض عن جوابه، ويدله على ما يحتاج إليه، ويرشده إلى ما ينفعه.
ప్రశ్నించబడిన వాడు ప్రశ్నించే వాడికి ప్రయోజనం లేని విషయం గురించి ప్రశ్నించబడినప్పుడు అతడు అతనికి జవాబు ఇవ్వటం నుండి నిరాకరించి,అతనికి అవసరమైన దానిని తెలిపి,అతనికి ప్రయోజనం చేకూర్చే దాన్ని చూపించటం ఎంతో మంచిదని ఆయతుల్లో ఆధారం ఉన్నది. info