ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߕߟߌߜ߭ߏߦߊߞߊ߲ ߘߟߊߡߌߘߊ - ߊ߳ߺߊߓߑߘߎ ߚߊߤ߭ߌ߯ߡߎ߫ ߓߎߣ-ߡߎ߬ߤ߭ߊߡߡߊߘߎ߫ ߓߟߏ߫

external-link copy
144 : 3

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌ ۚ— قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ؕ— اَفَاۡىِٕنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰۤی اَعْقَابِكُمْ ؕ— وَمَنْ یَّنْقَلِبْ عَلٰی عَقِبَیْهِ فَلَنْ یَّضُرَّ اللّٰهَ شَیْـًٔا ؕ— وَسَیَجْزِی اللّٰهُ الشّٰكِرِیْنَ ۟

మరియు ముహమ్మద్[1] కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచి పోయారు[2]. ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్యచేయబడితే, మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? మరియు వెనుకంజ వేసి మరలిపోయేవాడు అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. info

[1] ము'హమ్మద్ ('స'అస) పేరు ఖుర్ఆన్ లో 4 సార్లు వచ్చింది. ఇంకా చూడండి, 33:40, 47:2 మరియు 48:29. అ'హ్మద్ ('స 'అస) అని 61:6లో వచ్చింది. [2] ఉ'హుద్ యుద్ధంలో ము'హమ్మద్ ('స'అస) మరణించారనే వార్త వ్యాపించగానే ముస్లింలు ధైర్యాన్ని కోల్పోయి, యుద్ధరంగం నుండి వెనుకంజ వేయసాగుతారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఇంతకు ముందు కూడా సందేశహరులు హత్య చేయబడ్డారు. మరి దైవప్రవక్త ('స'అస) హత్య చేయబడితే మీరెందుకు వెనుకంజ వేయాలి? మీరు కూడా ధైర్యంతో, శత్రువులతో పోరాడి మరణిస్తే, స్వర్గానికి అర్హులవుతారు, విజయం పొందితే విజయధనానికి. కాని వెనుకంజ వేసి, మరణిస్తే, నరకం పాలవుతారు. లేదా యుద్ధఖైదీలై, బానిసలై మీ ఆత్మాభిమానాన్ని కోల్పోతారు. ఒక 'హదీస్' : ము'హమ్మద్ ('స'అస) మరణించిన రోజు అబూబక్ర్ (ర'ది.'అ.) ఇలా అన్నారు: "ఎవరైతే ము'హమ్మద్ ('స'అస) ను ఆరాధిస్తారో, వారు ము'హమ్మద్ ('స'అస) గతించిపోయారని తెలుసుకోవాలి. కాని ఎవరైతే కేవలం అల్లాహ్ (సు.తా.) ఆరాధిస్తారో, ఆయన నిత్యుడు, సజీవుడు అని తెలుసుకోవాలి." ('స. బు'ఖారీ).

التفاسير: