ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߕߟߌߜ߭ߏߦߊߞߊ߲ ߘߟߊߡߌߘߊ - ߊ߳ߺߊߓߑߘߎ ߚߊߤ߭ߌ߯ߡߎ߫ ߓߎߣ-ߡߎ߬ߤ߭ߊߡߡߊߘߎ߫ ߓߟߏ߫

external-link copy
103 : 3

وَاعْتَصِمُوْا بِحَبْلِ اللّٰهِ جَمِیْعًا وَّلَا تَفَرَّقُوْا ۪— وَاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ كُنْتُمْ اَعْدَآءً فَاَلَّفَ بَیْنَ قُلُوْبِكُمْ فَاَصْبَحْتُمْ بِنِعْمَتِهٖۤ اِخْوَانًا ۚ— وَكُنْتُمْ عَلٰی شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَاَنْقَذَكُمْ مِّنْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟

మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి.[1] అల్లాహ్ మీ యెడల చూపిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు, ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్నిగుండం ఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని! info

[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "యూదులు 71 తెగులుగా, క్రైస్తవులు 72 తెగలుగా విభజింపబడ్డారు. కాని నా సమాజం వారు 73 తెగలుగా విభజింపబడతారు. వారిలో ఒక్క తెగ తప్ప అందరూ నరకంలో పడవేయబడతారు. ఆ ఒక్క తెగ ఎవరంటే, ఏ విధానంపై నేను మరియు నా 'స'హాబా (ర'ది.'అన్హుమ్) ఉన్నామో దానిని అనుసరించేవారు. అంటే ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త ('స.'అస) యొక్క సున్నత్ పై అమలు చేసేవారు." (తిర్మిజీ', ఇబ్నె - మాజా, అబూ - దావూద్).

التفاسير: