ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

అ-నజ్మ్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
إثبات صدق الوحي وأنه من عند الله.
దైవవాణి సత్యమని మరియు అది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని నిరూపించడం info

external-link copy
1 : 53

وَالنَّجْمِ اِذَا هَوٰی ۟ۙ

పరిశుద్ధుడైన ఆయన నక్షత్రము రాలినప్పుడు ప్రమాణం చేశాడు. info
التفاسير:

external-link copy
2 : 53

مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوٰی ۟ۚ

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గము నుండి మరల లేదు మరియు ఆయన అపమార్గమునకు లోను కాలేదు కాని ఆయన హేతుబద్ధమైనవారు. info
التفاسير:

external-link copy
3 : 53

وَمَا یَنْطِقُ عَنِ الْهَوٰی ۟ؕۚ

మరియు ఆయన ఈ ఖుర్ఆన్ ను తన మనోవాంఛను అనుసరించి పలకలేదు. info
التفاسير:

external-link copy
4 : 53

اِنْ هُوَ اِلَّا وَحْیٌ یُّوْحٰی ۟ۙ

ఈ ఖుర్ఆన్ అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాం మార్గము నుండి ఆయన వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన ఒక దైవవాణి మాత్రమే. info
التفاسير:

external-link copy
5 : 53

عَلَّمَهٗ شَدِیْدُ الْقُوٰی ۟ۙ

మహా బలవంతుడు ఒక దూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం దాన్ని ఆయనకు నేర్పించాడు. info
التفاسير:

external-link copy
6 : 53

ذُوْ مِرَّةٍ ؕ— فَاسْتَوٰی ۟ۙ

మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం మంచి రూపము కలవారు. మరియు ఆయన అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు అల్లాహ్ ఆయనను సృష్టించిన రూపములో (నిజ రూపములో) ప్రత్యక్షమై నిలబడ్డారు. info
التفاسير:

external-link copy
7 : 53

وَهُوَ بِالْاُفُقِ الْاَعْلٰی ۟ؕ

మరియు జిబ్రయీల్ ఆకాశపు ఎత్తైన అంచులపై ఉన్నారు. info
التفاسير:

external-link copy
8 : 53

ثُمَّ دَنَا فَتَدَلّٰی ۟ۙ

ఆ తరువాత జిబ్రయీల్ అలైహిస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమునకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యారు. info
التفاسير:

external-link copy
9 : 53

فَكَانَ قَابَ قَوْسَیْنِ اَوْ اَدْنٰی ۟ۚ

ఆయనకు ఆయన దగ్గరవ్వటం రెండు విల్లులంత లేదా దానికి ఇంచుమించుగా ఉన్నది. info
التفاسير:

external-link copy
10 : 53

فَاَوْحٰۤی اِلٰی عَبْدِهٖ مَاۤ اَوْحٰی ۟ؕ

అప్పుడు జిబ్రయీల్ అల్లాహ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు దైవవాణి చేర్చవలసినది చేర్చారు. info
التفاسير:

external-link copy
11 : 53

مَا كَذَبَ الْفُؤَادُ مَا رَاٰی ۟

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయం ఆయన చూపులు చూసిన దాన్ని అబద్దమనలేదు. info
التفاسير:

external-link copy
12 : 53

اَفَتُمٰرُوْنَهٗ عَلٰی مَا یَرٰی ۟

ఓ ముష్రికులారా అల్లాహ్ ఆయనను రాత్రివేళ తీసుకుని వెళ్ళి ఆయనకు చూపిన దాని విషయంలో మీరు ఆయనతో వాదులాడుతున్నారా ?! info
التفاسير:

external-link copy
13 : 53

وَلَقَدْ رَاٰهُ نَزْلَةً اُخْرٰی ۟ۙ

మరియు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను రెండవ సారి ఆయన నిజరూపములో ఆయనకు రాత్రి వేళ తీసుకుని వెళ్ళినప్పుడు చూశారు. info
التفاسير:

external-link copy
14 : 53

عِنْدَ سِدْرَةِ الْمُنْتَهٰی ۟

సిద్రతుల్ ముంతహా (చివరి హద్దుల్లో ఉన్న రేగు చెట్టు) వద్ద. ఏడవ ఆకాశములో ఉన్న చాలా గొప్ప వృక్షము అది. info
التفاسير:

external-link copy
15 : 53

عِنْدَهَا جَنَّةُ الْمَاْوٰی ۟ؕ

ఆ వృక్షము వద్దనే జన్నతుల్ మావా (స్వర్గ ధామం) కలదు. info
التفاسير:

external-link copy
16 : 53

اِذْ یَغْشَی السِّدْرَةَ مَا یَغْشٰی ۟ۙ

అప్పుడు సిద్రహ్ ను అల్లాహ్ ఆదేశముతో ఒక గొప్ప వస్తువు కప్పివేస్తుంది. దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు. info
التفاسير:

external-link copy
17 : 53

مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغٰی ۟

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపులు కుడి యడమలకు వాలనూ లేదు మరియు ఆయనకి నిర్ణయించిన హద్దులను అతిక్రమించలేదు. info
التفاسير:

external-link copy
18 : 53

لَقَدْ رَاٰی مِنْ اٰیٰتِ رَبِّهِ الْكُبْرٰی ۟

వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను గగన యాత్ర చేయించబడిన రాత్రి తన ప్రభువు సామర్ధ్యమును సూచించే గొప్ప సూచనలను చూశారు. అప్పుడు ఆయన స్వర్గమును చూశారు మరియు నరకమును ఇతరవాటిని చూశారు. info
التفاسير:

external-link copy
19 : 53

اَفَرَءَیْتُمُ اللّٰتَ وَالْعُزّٰی ۟ۙ

ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు లాత్ మరియు ఉజ్జాలను గురించి ఆలోచించారా. info
التفاسير:

external-link copy
20 : 53

وَمَنٰوةَ الثَّالِثَةَ الْاُخْرٰی ۟

మరియు మీ విగ్రహాల్లోంచి మూడవదైన ఇంకొకటి మనాత్ ను గరించి. నాకు చెప్పండి మీరు అవి మీకు ఏదైన ప్రయోజనం గాని నష్టం గాని కలిగించే అధికారం కలవా ?! info
التفاسير:

external-link copy
21 : 53

اَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْاُ ۟

ఓ ముష్రికులారా మీకు మీరు ఇష్డపడే మగ సంతానమా మరియు పరిశుద్ధుడైన ఆయనకు మీరు ఇష్టపడని ఆడ సంతానమా ?!. info
التفاسير:

external-link copy
22 : 53

تِلْكَ اِذًا قِسْمَةٌ ضِیْزٰی ۟

మీ ఇచ్ఛానుసారం మీరు పంచిన ఈ పంపకము ఒక అన్యాయమైన పంపకం. info
التفاسير:

external-link copy
23 : 53

اِنْ هِیَ اِلَّاۤ اَسْمَآءٌ سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَمَا تَهْوَی الْاَنْفُسُ ۚ— وَلَقَدْ جَآءَهُمْ مِّنْ رَّبِّهِمُ الْهُدٰی ۟ؕ

ఈ విగ్రహాలు కొన్ని అర్దరహిత పేర్లు మాత్రమే. దైవత్వ గుణముల్లో వాటికి ఎటువంటి భాగము లేదు. వాటిని మీరు మీ తాత ముత్తాతలు మీ స్వయంతరపు నుండి పేర్లు పెట్టుకున్నారు. వాటి గురించి అల్లాహ్ ఎటువంటి ఆధారము అవతరింపజేయలేదు. ముష్రికులు తమ మనసులు కోరిన తమ హృదయములలో షైతాను అలంకరించిన విశాసములను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు వద్ద నుండి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైైహి వసల్లం నాలుక ద్వారా వారి వద్దకు సన్మార్గము వచ్చినది. కాని వారు ఆయన ద్వారా మార్గము పొందలేదు. info
التفاسير:

external-link copy
24 : 53

اَمْ لِلْاِنْسَانِ مَا تَمَنّٰی ۟ؗۖ

లేదా మానవునికి తాను ఆశించిన విగ్రహాల సిఫారసు అల్లాహ్ యందు కలదా ?! info
التفاسير:

external-link copy
25 : 53

فَلِلّٰهِ الْاٰخِرَةُ وَالْاُوْلٰی ۟۠

లేదు అతను ఆశించినది అతనికి లభించదు. పరలోకము మరియు ఇహలోకము అల్లాహ్ దే. వాటిలో నుండి ఆయన తాను కోరిన దాన్ని ఇస్తాడు మరియు తాను కోరిన దాన్ని ఆపుతాడు. info
التفاسير:

external-link copy
26 : 53

وَكَمْ مِّنْ مَّلَكٍ فِی السَّمٰوٰتِ لَا تُغْنِیْ شَفَاعَتُهُمْ شَیْـًٔا اِلَّا مِنْ بَعْدِ اَنْ یَّاْذَنَ اللّٰهُ لِمَنْ یَّشَآءُ وَیَرْضٰی ۟

మరియు ఆకాశముల్లో ఎందరో దూతలున్నారు ఒక వేళ వారు ఎవరికోసమైన సిఫారసు చేయదలచితే వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు కాని అల్లాహ్ వారిలో నుంచి ఎవరికి తలచుకుని సిఫారసు చేసే అనుమతించిన తరువాత మరియు దానికి సిఫారసు చేయబడే వాడి నుండి ప్రసన్నుడు అయితే తప్ప. అల్లాహ్ సాటి కల్పించే వారి కొరకు సిఫారసు చేసే అనుమతివ్వడు మరియు అల్లాహ్ ను వదిలి అతను ఆరాధించే ఆతని సిఫరసు చేయబడే వాడి నుండి ఆయన ప్రసన్నుడవడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• كمال أدب النبي صلى الله عليه وسلم حيث لم يَزغْ بصره وهو في السماء السابعة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం గారి గుణము యొక్క పరిపూర్ణత ఎప్పుడైతే ఆయన ఏడవ ఆకాశంలో ఉన్నా ఆయన దృష్టి తప్పిపోలేదు. info

• سفاهة عقل المشركين حيث عبدوا شيئًا لا يضر ولا ينفع، ونسبوا لله ما يكرهون واصطفوا لهم ما يحبون.
ముష్రికుల బుద్ధిలేమి తనం ఎప్పుడైతే వారు నష్టం కలిగించని,లాభం కలిగించని వాటిని ఆరాధించారో మరియు అల్లాహ్ కు తాము ఇష్టపడని వాటిని అంటగట్టారో,తాము ఇష్టపడే వాటిని తమ కొరకు ప్రత్యేకించుకున్నారో. info

• الشفاعة لا تقع إلا بشرطين: الإذن للشافع، والرضا عن المشفوع له.
సిఫారసు చేయటం రెండు షరతులతో ఏర్పడుతుంది : 1) సిఫారసు చేసే వాడికి అనుమతి ఉండాలి. 2) సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ప్రసన్నత. info