ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

ߞߐߜߍ ߝߙߍߕߍ:close

external-link copy
127 : 37

فَكَذَّبُوْهُ فَاِنَّهُمْ لَمُحْضَرُوْنَ ۟ۙ

అయితే అతని జాతివారి నుండి అతన్ని తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగలేదు. వారి తిరస్కారము వలన వారు శిక్షలో హాజరుచేయబడుతారు. info
التفاسير:

external-link copy
128 : 37

اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِیْنَ ۟

కాని అతని జాతి వారిలో నుంచి విశ్వాసపరుడై అల్లాహ్ కొరకు ఆయన ఆరాధన విషయంలో చిత్తశుద్ధి కలవాడై ఉండేవాడు నిశ్ఛయంగా అతడు శిక్ష వైపునకు హాజరు చేయటం నుండి ముక్తి పొందుతాడు. info
التفاسير:

external-link copy
129 : 37

وَتَرَكْنَا عَلَیْهِ فِی الْاٰخِرِیْنَ ۟ۙ

మరియు మేము వచ్చే తరాలలో అతనికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తావనను మిగిలి ఉండేలా చేశాము. info
التفاسير:

external-link copy
130 : 37

سَلٰمٌ عَلٰۤی اِلْ یَاسِیْنَ ۟

అల్లాహ్ వద్ద నుండి ఇల్,యాస్ పై అభినందనలు మరియు కీర్తి కలుగుగాక. info
التفاسير:

external-link copy
131 : 37

اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟

నిశ్ఛయంగా మేము ఇల్,యాస్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే విశ్వాసపరులైన మా దాసుల్లోంచి మంచి చేసే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము. info
التفاسير:

external-link copy
132 : 37

اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِیْنَ ۟

నిశ్ఛయంగా ఇల్,యాస్ వాస్తవంగా విశ్వాసపరులైన,తమ ప్రభువు పై తమ విశ్వాసములో సత్యవంతులైన మా దాసులలోని వాడు info
التفاسير:

external-link copy
133 : 37

وَاِنَّ لُوْطًا لَّمِنَ الْمُرْسَلِیْنَ ۟ؕ

మరియు నిశ్చయంగా లూత్ అల్లాహ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు. info
التفاسير:

external-link copy
134 : 37

اِذْ نَجَّیْنٰهُ وَاَهْلَهٗۤ اَجْمَعِیْنَ ۟ۙ

అయితే అతని జాతి వారిపై పంపించబడ్డ శిక్ష నుండి మేము అతన్ని,అతని జాతి వారిని రక్షించినప్పటి వైనమును నీవు గుర్తుచేసుకో. info
التفاسير:

external-link copy
135 : 37

اِلَّا عَجُوْزًا فِی الْغٰبِرِیْنَ ۟

అతని భార్య తప్ప. ఆమెకూడా వారిలాగా అవిశ్వాసపరురాలు కావటం వలన ఆమె జాతి వారి యొక్క శిక్ష ఆమెకూ వర్తించే స్త్రీ అయిపోయినది. info
التفاسير:

external-link copy
136 : 37

ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِیْنَ ۟

ఆ తరువాత అతన్ని తిరస్కరించి,అతను తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించని వారిలో నుంచి అయిన అతని జాతి వారిలో నుండి మిగిలిన వారినీ కూడా మేము తుదిముట్టించాము. info
التفاسير:

external-link copy
137 : 37

وَاِنَّكُمْ لَتَمُرُّوْنَ عَلَیْهِمْ مُّصْبِحِیْنَ ۟ۙ

మరియు నిశ్ఛయంగా ఓ మక్కా వాసులారా మీరు షామ్ (శిరియా) వైపు మీ ప్రయాణములలో వారి నివాసములపై నుండి ఉదయం వేళ ప్రయాణిస్తూ ఉంటారు. info
التفاسير:

external-link copy
138 : 37

وَبِالَّیْلِ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟۠

మరియు అలాగే మీరు వాటిపై నుండి రాత్రి వేళలో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఏమీ వారి యొక్క తిరస్కరించటం,వారి యొక్క అవిశ్వాసము కనబరచటం,ముందెన్నడూ వారితో జరగని అశ్లీల కార్యమును వారి యొక్క పాల్పడటం తరువాత వారికి ఏమి జరిగినదో దాని ద్వారా మీరు అర్ధం చేసుకోరా,హితబోధన గ్రహించరా ?. info
التفاسير:

external-link copy
139 : 37

وَاِنَّ یُوْنُسَ لَمِنَ الْمُرْسَلِیْنَ ۟ؕ

మరియు నిశ్ఛయంగా మా దాసుడగు యూనుస్ అల్లాహ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు. info
التفاسير:

external-link copy
140 : 37

اِذْ اَبَقَ اِلَی الْفُلْكِ الْمَشْحُوْنِ ۟ۙ

తన ప్రభువు అనుమతి లేకుండా తన జాతి వారి నుండి పారిపోయి ప్రయాణికులతో,సామానుతో నిండిన ఒక పడవ పై సవారీ అయినప్పుడు. info
التفاسير:

external-link copy
141 : 37

فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِیْنَ ۟ۚ

పడవ అది నిండిపోవటం వలన మునగటానికి దగ్గరలో ఉన్నది. అప్పుడు ప్రయాణికులు ఎక్కువవటం వలన పడవ మునిగి పోతుందేమోనని భయముతో తమలోని కొందరిని తీసి పడవేయటానికి ప్రయాణికులు చీటీ వేశారు. ఆ ఓడిపోయిన వారిలో నుండి యూనుస్ అయ్యాడు. అప్పుడు వారు అతన్ని సముద్రంలో పడవేశారు. info
التفاسير:

external-link copy
142 : 37

فَالْتَقَمَهُ الْحُوْتُ وَهُوَ مُلِیْمٌ ۟

ఎప్పుడైతే వారు అతన్ని సముద్రంలో పడవేశారో పెద్ద చేప అతన్ని పట్టుకుని మ్రింగివేసింది. మరియు అతడు తన ప్రభువు అనుమతి లేకుండా సముద్రం వద్దకు వెళ్ళటం వలన అతడు నిందించబడే కార్యము చేశాడు. info
التفاسير:

external-link copy
143 : 37

فَلَوْلَاۤ اَنَّهٗ كَانَ مِنَ الْمُسَبِّحِیْنَ ۟ۙ

యూనుస్ తనకు సంభవించిన దాని కన్న మునుపు ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారిలో నుంచి కాకపోయి ఉంటే మరియు చేప కడుపులో ఆయన పరిశుద్ధత కొనియాడటం లేకపోయి ఉంటే. info
التفاسير:

external-link copy
144 : 37

لَلَبِثَ فِیْ بَطْنِهٖۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟ۚ

ఆయన చేప కడుపులోనే అది అతనికి సమాదిగా అయిపోయి ప్రళయదినం వరకు ఉండిపోయేవాడు. info
التفاسير:

external-link copy
145 : 37

فَنَبَذْنٰهُ بِالْعَرَآءِ وَهُوَ سَقِیْمٌ ۟ۚ

అప్పుడు మేము అతడిని చేప కడుపు నుండి తీసి చెట్లు,కట్టడాలు లేని ఖాళీ ప్రదేశంలో పడవేశాము. అతడు చేప కడుపులో కొంత కాలం ఉండటం వలన బలహీన శరీరము కలవాడి స్థితిలో ఉన్నాడు. info
التفاسير:

external-link copy
146 : 37

وَاَنْۢبَتْنَا عَلَیْهِ شَجَرَةً مِّنْ یَّقْطِیْنٍ ۟ۚ

మరియు మేము ఆ ఖాళీ ప్రదేశంలో ఆనపకాయ చెట్టును అతనిపై దాని ద్వారా అతను నీడను పొందటానికి,దాని నుండి తినటానికి మొలిపించాము. info
التفاسير:

external-link copy
147 : 37

وَاَرْسَلْنٰهُ اِلٰی مِائَةِ اَلْفٍ اَوْ یَزِیْدُوْنَ ۟ۚ

మరియు మేము అతడిని అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము. మరియు వారి సంఖ్య లక్ష మంది ఉంటుంది అంతకంటే ఎక్కువే ఉంటుంది. info
التفاسير:

external-link copy
148 : 37

فَاٰمَنُوْا فَمَتَّعْنٰهُمْ اِلٰی حِیْنٍ ۟ؕ

అప్పుడు వారు విశ్వసించారు మరియు ఆయన తీసుకుని వచ్చిన దాన్ని నిజమని నమ్మారు. అప్పుడు అల్లాహ్ వారి ఇహలోక జీవితంలో వారి నిర్ణీత ఆయుషు ముగిసేవరకు వారికి ప్రయోజనం చేకూర్చాడు. info
التفاسير:

external-link copy
149 : 37

فَاسْتَفْتِهِمْ اَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُوْنَ ۟ۙ

అయితే ఓ ముహమ్మద్ మీరు ముష్రికులతో నిరాకరించే విధంగా అడగండి : ఏమీ మీరు మీకు ఇష్టంలేనివైన కుమార్తెలను అల్లాహ్ కొరకు చేసి మీరు ఇష్టపడే కుమారులను మీ కొరకు చేసుకుంటున్నారా ?. ఇదేమి పంపకము ?! info
التفاسير:

external-link copy
150 : 37

اَمْ خَلَقْنَا الْمَلٰٓىِٕكَةَ اِنَاثًا وَّهُمْ شٰهِدُوْنَ ۟

దైవదూతలను వారు ఎలా స్త్రీలు అనుకున్నారు. వాస్తవానికి వారి పుట్టించే సమయంలో వారు హాజరై లేరు. మరియు వారు దాన్ని చూడనూ లేదు ?!. info
التفاسير:

external-link copy
151 : 37

اَلَاۤ اِنَّهُمْ مِّنْ اِفْكِهِمْ لَیَقُوْلُوْنَ ۟ۙ

జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు. info
التفاسير:

external-link copy
152 : 37

وَلَدَ اللّٰهُ ۙ— وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు. info
التفاسير:

external-link copy
153 : 37

اَصْطَفَی الْبَنَاتِ عَلَی الْبَنِیْنَ ۟ؕ

ఏమీ అల్లాహ్ తన స్వయం కొరకు మీరు ఇష్టపడే మగ సంతానమునకు బదులుగా మీరు ద్వేషించే ఆడ సంతానమును ఎన్నుకున్నాడా ?!. ఖచ్చితంగా కాదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• سُنَّة الله التي لا تتبدل ولا تتغير: إنجاء المؤمنين وإهلاك الكافرين.
విశ్వాసపరులని ముక్తి కలిగించటం,అవిశ్వాసపరులని తుదిముట్టించటం అల్లాహ్ సంప్రదాయము అది మార్చబడదు మరియు మారదు. info

• ضرورة العظة والاعتبار بمصير الذين كذبوا الرسل حتى لا يحل بهم ما حل بغيرهم.
ప్రవక్తలను తిరస్కరించిన వారి పరిణామం ఏమయిందో దాని ద్వారా హితబోధన గ్రహించటం,గుణపాఠం నేర్చుకోవటం అవసరం. ఎందుకంటే ఇతరులపై వాటిల్లినది తమ పై వాటిల్లకుండా ఉండటానికి. info

• جواز القُرْعة شرعًا لقوله تعالى: ﴿ فَسَاهَمَ فَكَانَ مِنَ اْلْمُدْحَضِينَ ﴾.
మహోన్నతుడైన ఆయన ఈ వాక్యంలో : {فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلۡمُدۡحَضِينَ} "అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు" చీటీ వేయటం ధర్మసమ్మతం అవుతుంది. info