ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

ߞߐߜߍ ߝߙߍߕߍ:close

external-link copy
20 : 31

اَلَمْ تَرَوْا اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَاَسْبَغَ عَلَیْكُمْ نِعَمَهٗ ظَاهِرَةً وَّبَاطِنَةً ؕ— وَمِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّلَا هُدًی وَّلَا كِتٰبٍ مُّنِیْرٍ ۟

ఓ ప్రజలారా మీరు చూడలేదా,గమనించలేదా అల్లాహ్ ఆకాశములలో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రాలను ప్రయోజనం పొందటమునకు మీ కొరకు అందుబాటులో ఉంచాడు. మరియు భూమిపై ఉన్న జంతువులను,వృక్షాలను,మొక్కలను కూడా మీకు అందుబాటులో ఉంచాడు. మరియు ఆయన ప్రత్యక్షంగా కనబడే రూప అందము, మంచి శరీరాకృతి లాంటి మరియు లోపల దాగి ఉన్న బుద్ధి,జ్ఞానము లాంటి తన అనుగ్రహాలను మీపై పరిపూర్ణం చేశాడు. ఈ అనుగ్రహాలు ఉండి కూడా ప్రజల్లోంచి కొంతమంది అల్లాహ్ వద్ద నుండి దివ్య జ్ఞానముతో ఎటువంటి పత్రిక జ్ఞానం లేకుండా లేదా కాంతివంతమైన బుద్ధి, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఎటువంటి స్పష్టమైన గ్రంధం లేకుండా అల్లాహ్ ఏకత్వము విషయంలో వాదులాడుతున్నారు. info
التفاسير:

external-link copy
21 : 31

وَاِذَا قِیْلَ لَهُمُ اتَّبِعُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَیْهِ اٰبَآءَنَا ؕ— اَوَلَوْ كَانَ الشَّیْطٰنُ یَدْعُوْهُمْ اِلٰی عَذَابِ السَّعِیْرِ ۟

మరియు అల్లాహ్ తౌహీద్ విషయంలో వాదులాడే వీరందరితో "మీరు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన దైవ వాణిని అనుసరించండి" అని పలికినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చేవారు : మేము దాన్ని అనుసరించము కాని మేము మా పూర్వికులను మా ఆరాధ్య దైవాల ఆరాధనల్లోంచి దేనిపై మేము పొందామో దాన్ని అనుసరిస్తాము. ఏమీ ఒక వేళ షైతాను వారి పూర్వికులను వారిని అపమార్గమునకు లోను చేసే విగ్రహారాాధన ద్వారా ప్రళయదినమున అగ్ని శిక్ష వైపునకు పిలిచినా వారు వారిని అనుసరిస్తారా ?!. info
التفاسير:

external-link copy
22 : 31

وَمَنْ یُّسْلِمْ وَجْهَهٗۤ اِلَی اللّٰهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰی ؕ— وَاِلَی اللّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ ۟

మరియు ఎవరైతే అల్లాహ్ వైపునకు తన ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ,తన ఆచరణను మంచిగా చేస్తూ ముందుకు పోతాడో అతడు ముక్తిని ఆశించే వాడు, సంబంధంపెట్టుకునే దృఢమైన దాన్ని పట్టుకున్నాడు ఏ విధంగానంటే తాను పట్టుకున్నది తెగిపోతుందన్నభయం అతనికి ఉండదు. మరియు అల్లాహ్ ఒక్కడి వైపే వ్యవహారలన్నింటి పరిణామము,వాటి మరలటం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కడికి దేనికి అతడు హక్కు దారుడో దాన్ని ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
23 : 31

وَمَنْ كَفَرَ فَلَا یَحْزُنْكَ كُفْرُهٗ ؕ— اِلَیْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟

మరియు ఎవరైతే అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరుస్తాడో ఓ ప్రవక్తా అతని అవిశ్వాసం మిమ్మల్ని దుఃఖానికి గురి చేయకూడదు. మా ఒక్కరి వైపే ప్రళయదినాన వారి మరలటం జరుగును. అప్పుడు మేము వారు ఇహలోకంలో చేసిన దుష్కర్మల గురించి వారికి తెలియపరుస్తాము. మరియు వాటి పరంగా వారికి మేము ప్రతిఫలమును ప్రసాదిస్తాము. నిశ్ఛయంగా అల్లాహ్ హృదయములలో ఉన్న వాటిని బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నవి ఏవీ ఆయనపై గోప్యంగా ఉండవు. info
التفاسير:

external-link copy
24 : 31

نُمَتِّعُهُمْ قَلِیْلًا ثُمَّ نَضْطَرُّهُمْ اِلٰی عَذَابٍ غَلِیْظٍ ۟

మరియు మేము ఇహలోకంలో వారికి ప్రసాదించిన సుఖాలను కొంత కాలం వరకు వారిని అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని ప్రళయదినమున తీవ్ర శిక్ష వైపునకు మళ్ళిస్తాము. అది నరక శిక్ష. info
التفاسير:

external-link copy
25 : 31

وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَیَقُوْلُنَّ اللّٰهُ ؕ— قُلِ الْحَمْدُ لِلّٰهِ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟

ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను సృష్టించినదెవరు,భూమిని సృష్టించినదెవరు ? అని అడిగితే వారు తప్పకుండ వాటిని సృష్టించినది అల్లాహ్ అని సమాధానమిస్తారు. మీరు వారితో ఇలా అనండి : స్థుతులన్ని మీపై వాదనను బహిర్గతం చేసిన అల్లాహ్ కే చెందుతాయి. అంతే కాదు వారిలో చాలా మంది తమ అజ్ఞానం వలన స్థుతులకు హక్కుదారుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. info
التفاسير:

external-link copy
26 : 31

لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اِنَّ اللّٰهَ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟

ఆకాశముల్లో ఉన్నవన్నీ,భూమిపై ఉన్నవన్నీ సృష్టి పరంగా,అధికారము పరంగా,కార్యనిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టితాలన్నింటి నుండి అక్కర లేని వాడు. ఇహపర లోకాల్లో స్థుతింపబడేవాడు. info
التفاسير:

external-link copy
27 : 31

وَلَوْ اَنَّمَا فِی الْاَرْضِ مِنْ شَجَرَةٍ اَقْلَامٌ وَّالْبَحْرُ یَمُدُّهٗ مِنْ بَعْدِهٖ سَبْعَةُ اَبْحُرٍ مَّا نَفِدَتْ كَلِمٰتُ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟

మరియు ఒక వేళ భూమిలో ఉన్న వృక్షములన్నింటిని నరికివేసి కలములుగా తయారు చేసి మరియు సముద్రమును వాటిని సిరాగా చేసి,ఒక వేళ దాన్ని ఏడు సముద్రములుగా విస్తరింపజేసిన అల్లాహ్ మాటలు వాటి ముగింపు లేకపోవటం వలన అంతం కావు. నిశ్చయంగా అల్లాహ్ అతన్ని ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు. అతడు తన సృష్టించటంలో,తన వ్యవహారములను నడిపించటంలో వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
28 : 31

مَا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ اِلَّا كَنَفْسٍ وَّاحِدَةٍ ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟

ఓ ప్రజలారా ప్రళయదినాన లెక్క తీసుకోవటం కొరకు, ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మిమ్మల్ని సృష్టించటం,మిమ్మల్ని మరల లేపటం ఒక ప్రాణమును సృష్టించటం మాదిరి మాత్రమే. మరియు దాన్ని మరల లేపటం సులభము. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు ఒక శబ్ధమును వినటం ఇంకో శబ్ధమును వినటం నుండి ఆయనకు పరధ్యానంలో ఉంచదు. ఆయన సర్వం చూసే వాడు ఒక వస్తువును చూడటం ఇంకో వస్తువుని చూడటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు. మరియు ఇదేవిధంగా ఒక ప్రాణమును సృష్టించటం లేదా దాన్ని మరల లేపటం ఇంకొక ప్రాణమును సృష్టించటం,దాన్ని మరల లేపటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• نعم الله وسيلة لشكره والإيمان به، لا وسيلة للكفر به.
అల్లాహ అనుగ్రహాలు ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటానికి,ఆయనపై విశ్వాసమును కనబరచటానికి ఒక కారకము అంతే గాని ఆయనను తిరస్కరించటానికి కారకం కాదు. info

• خطر التقليد الأعمى، وخاصة في أمور الاعتقاد.
గుడ్డిగా అనుకరించటం యొక్క ప్రమాదము ప్రత్యేకించి విశ్వాస విషయాల్లో. info

• أهمية الاستسلام لله والانقياد له وإحسان العمل من أجل مرضاته.
అల్లాహ్ కి లొంగిపోవటం,ఆయనకి విధేయత చూపటం మరియు ఆయన ఇచ్ఛల వలన ఆచరణను మంచిగా చేయటం. info

• عدم تناهي كلمات الله.
అల్లాహ్ మాటలకు అంతం లేదు. info