ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

ߞߐߜߍ ߝߙߍߕߍ:close

external-link copy
12 : 19

یٰیَحْیٰی خُذِ الْكِتٰبَ بِقُوَّةٍ ؕ— وَاٰتَیْنٰهُ الْحُكْمَ صَبِیًّا ۟ۙ

అయితే ఆయనకు యహ్యా జన్మించారు. ఆయన సంబోధించే వయస్సుకు చేరుకున్నప్పుడు మేము ఆయనతో ఇలా పలికాము : ఓ యహ్యా మీరు తౌరాతును గంభీరతతో,కృషితో పట్టుకోండి. మరియు మేము ఆయనకు అవగాహనను,జ్ఞానమును,గంభీరతను,దృఢ సంకల్పమును ఆయన బాల్య వయస్సులోనే ప్రసాధించాము. info
التفاسير:

external-link copy
13 : 19

وَّحَنَانًا مِّنْ لَّدُنَّا وَزَكٰوةً ؕ— وَكَانَ تَقِیًّا ۟ۙ

మరియు మేము మా వద్ద నుండి అతనిపై కారుణ్యాన్ని ప్రసాధించి అతన్ని పాపములనుండి పరిశుద్ధపరచాము. మరియు అతడు అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి దైవభీతి గలవాడయ్యాడు. info
التفاسير:

external-link copy
14 : 19

وَّبَرًّا بِوَالِدَیْهِ وَلَمْ یَكُنْ جَبَّارًا عَصِیًّا ۟

మరియు అతడు తన తల్లిదండ్రుల పట్ల కర్తవ్యపాలకుడిగా,వారిద్దరిపై దయ కలవాడిగా,వారి పట్ల మంచిగా మెలిగేవాడిగా అయ్యాడు. అతడు తన ప్రభువుపై విధేయత చూపటం నుండి,వారిద్దరిపై విధేయత చూపటం నుండి అహంకారమును చూపలేదు,తన ప్రభువు పట్ల లేదా తన తల్లిదండ్రులపట్ల అవిధేయుడు కాలేదు. info
التفاسير:

external-link copy
15 : 19

وَسَلٰمٌ عَلَیْهِ یَوْمَ وُلِدَ وَیَوْمَ یَمُوْتُ وَیَوْمَ یُبْعَثُ حَیًّا ۟۠

మరియు అతనిపై అతను జన్మించిన రోజు,అతను మరణించి ఈ జీవితము నుండి వైదొలిగే రోజు,ప్రళయ దినాన జీవింపజేయబడి మరల లేపబడే రోజు అల్లాహ్ తరపు నుండి శాంతి,ఆయన వద్ద నుండి భద్రత కలుగుగాక. ఈ మూడు ప్రదేశాలు మానవునిపై గడిచే అత్యంత భయంకరమైనవి. అతడు వాటిలో భద్రంగా ఉన్నప్పుడు వేరే వాటిలో అతనిపై భయం లేదు. info
التفاسير:

external-link copy
16 : 19

وَاذْكُرْ فِی الْكِتٰبِ مَرْیَمَ ۘ— اِذِ انْتَبَذَتْ مِنْ اَهْلِهَا مَكَانًا شَرْقِیًّا ۟ۙ

ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో మర్యమ్ అలైహస్సలాం తన ఇంటివారి నుండి వేరై వారికి తూర్పు దిశలో ఒక ప్రదేశంలో ఏకాంతంలో వెళ్ళిపోయినప్పటి వార్తను గుర్తు చేసుకోండి. info
التفاسير:

external-link copy
17 : 19

فَاتَّخَذَتْ مِنْ دُوْنِهِمْ حِجَابًا ۫— فَاَرْسَلْنَاۤ اِلَیْهَا رُوْحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِیًّا ۟

అప్పుడు ఆమె తన ప్రభువు కొరకు చేసుకునే తన ఆరాధనను తన జాతి వారు చూడకుండా ఉండటానికి ఒక అడ్డు తెరను తన స్వయం కొరకు ఏర్పాటు చేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు జిబ్రయీల్ అలైహిస్సలాంను పంపించాము. అప్పుడు ఆయన పుట్టుకలో సంపూర్ణ మానవుని రూపములో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె ఆయన ఆమె పట్ల దురుద్దేశమును కలిగి ఉన్నాడేమోనని భయపడింది. info
التفاسير:

external-link copy
18 : 19

قَالَتْ اِنِّیْۤ اَعُوْذُ بِالرَّحْمٰنِ مِنْكَ اِنْ كُنْتَ تَقِیًّا ۟

ఎప్పుడైతే ఆమె అతనిని సంపూర్ణ మానవుని రూపములో తనవైపునకు రావటమును చూసినదో ఇలా పలికింది : నిశ్చయంగా నేను నీ నుండి చెడు పొందటం నుండి అనంత కరుణామయుడి శరణును కోరుకుంటున్నాను. ఓహ్ ఇది ఒక వేళ నీవు దైవభీతి కలవాడివయితే అల్లాహ్ తో భయపడు. info
التفاسير:

external-link copy
19 : 19

قَالَ اِنَّمَاۤ اَنَا رَسُوْلُ رَبِّكِ ۖۗ— لِاَهَبَ لَكِ غُلٰمًا زَكِیًّا ۟

జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నేను మనిషిని కాను.నేను మాత్రం నీ ప్రభువు తరపు నుండి పంపించబడ్డ దూతను,ఆయన నేను నీకు పరిశుద్ధుడైన,సుశీలుడైన ఒక కుమారునిని ప్రసాధించటానికి నన్ను నీ వద్దకు పంపించాడు. info
التفاسير:

external-link copy
20 : 19

قَالَتْ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّلَمْ یَمْسَسْنِیْ بَشَرٌ وَّلَمْ اَكُ بَغِیًّا ۟

మర్యమ్ అలైహస్సలాం ఆశ్చర్యపోయి ఇలా అడిగారు : నాకు ఎలా కుమారుడు కలుగుతాడు. వాస్తవానికి నా వద్దకు ఏ భర్త గానీ వేరే వారు గానీ రాలేదు. అలాగే నాకు కుమారుడు కలగటానికి నేను వ్యభిచారిణిని కాను ?!. info
التفاسير:

external-link copy
21 : 19

قَالَ كَذٰلِكِ ۚ— قَالَ رَبُّكِ هُوَ عَلَیَّ هَیِّنٌ ۚ— وَلِنَجْعَلَهٗۤ اٰیَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ— وَكَانَ اَمْرًا مَّقْضِیًّا ۟

జిబ్రయీలు ఆమెతో ఇలా పలికారు : నిన్ను ఏ భర్తా గాని వేరెవరూ గాని తాకలేదని,నీవు వ్యభిచారిణీ కాదని విషయము నీవు ప్రస్తావించినట్లే. కానీ పరిశుద్ధుడైన నీ ప్రభువు ఇలా పలికాడు : ఏ తండ్రి లేకుండా పిల్లవాడిని సృష్టించటం నాకు సులభము. మరియు నీకు ప్రసాధించబడిన పిల్లవాడు అల్లాహ్ సామర్ధ్యము పై ప్రజల కొరకు ఒక సూచన మరియు నీ కొరకు ఆయన పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మా వద్ద నుండి ఒక కారుణ్యం కావటానికి. మరియు ఈ నీ కుమారుని పుట్టుక అల్లాహ్ వద్ద నుండి తీర్పు నిర్ణయించబడి ఉంది,లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉంది. info
التفاسير:

external-link copy
22 : 19

فَحَمَلَتْهُ فَانْتَبَذَتْ بِهٖ مَكَانًا قَصِیًّا ۟

అప్పుడు దూత ఊదిన తరువాత ఆమె అతనిని (బాలుడి) గర్భంలో భరించింది. ఆ తరువాత అతనితో (గర్భంతో) ప్రజల నుండి దూర ప్రాంతమునకు వేరై వెళ్ళిపోయింది. info
التفاسير:

external-link copy
23 : 19

فَاَجَآءَهَا الْمَخَاضُ اِلٰی جِذْعِ النَّخْلَةِ ۚ— قَالَتْ یٰلَیْتَنِیْ مِتُّ قَبْلَ هٰذَا وَكُنْتُ نَسْیًا مَّنْسِیًّا ۟

అయితే ఆమెకు పురిటినొప్పులు కలిగాయి. అవి ఆమెను ఒక ఖర్జూరపు చెట్టు మొదలు వద్దకు చేర్చాయి. మర్యమ్ అలైహస్సలాం ఇలా పలికారు : అయ్యో నేను ఈ రోజు కన్న ముందే చనిపోతే బాగుండేది. మరియు నా గురించి చెడుగా భావించకుండా ఉండటానికి నేను చర్చించదగని వస్తువైపోవల్సింది. info
التفاسير:

external-link copy
24 : 19

فَنَادٰىهَا مِنْ تَحْتِهَاۤ اَلَّا تَحْزَنِیْ قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِیًّا ۟

అప్పుడు ఆమె పాదముల క్రింది నుండి ఈసా ఆమెను పిలిచి ఇలా పలికారు : మీరు దుఃఖించకండి. నిశ్చయంగా మీ ప్రభువు మీ క్రింద ఒక సెలయేరును తయారు చేశాడు. మీరు దాని నుండి త్రాగుతారు. info
التفاسير:

external-link copy
25 : 19

وَهُزِّیْۤ اِلَیْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسٰقِطْ عَلَیْكِ رُطَبًا جَنِیًّا ۟ؗ

మరియు నీవు ఖర్జూరపు చెట్టు మొదలు పట్టుకుని దాన్ని ఊపు నీపై ఆ ఘడియలోనే కోయబడిన తాజా పండిన ఖర్జూరములు రాలుతాయి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الصبر على القيام بالتكاليف الشرعية مطلوب.
ధర్మబధ్ధమైన బాధ్యతలను నెరవేర్చటంపై సహనం అవసరం. info

• علو منزلة بر الوالدين ومكانتها عند الله، فالله قرنه بشكره.
తల్లిదండ్రులపట్ల మంచిగా మెలగటము యొక్క ఉన్నత స్థితి,దాని స్థానము అల్లాహ్ వద్ద ఉన్నది. అప్పుడే ఆయన దాన్ని తనకు కృతజ్ఞత తెలుపుకోవటంతో జత చేశాడు. info

• مع كمال قدرة الله في آياته الباهرة التي أظهرها لمريم، إلا أنه جعلها تعمل بالأسباب ليصلها ثمرة النخلة.
మర్యమ్ కొరకు ఆయన బహిరంగపరచిన తన అద్భుత సూచనల్లో అల్లాహ్ యొక్క సామర్ధ్యం పరిపూర్ణమవటంతోపాటు ఆయన ఆమెకు ఖర్జూరపు పండ్లు చేరటం కొరకు ఆమెను కారకాలను ఏర్పాటు చేసుకునే విధంగా చేశాడు. info