पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन्हम् ।

external-link copy
69 : 17

اَمْ اَمِنْتُمْ اَنْ یُّعِیْدَكُمْ فِیْهِ تَارَةً اُخْرٰی فَیُرْسِلَ عَلَیْكُمْ قَاصِفًا مِّنَ الرِّیْحِ فَیُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ ۙ— ثُمَّ لَا تَجِدُوْا لَكُمْ عَلَیْنَا بِهٖ تَبِیْعًا ۟

లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా[1] సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు. info

[1] తబీ'ఉన్: పగతీర్చుకునేవాడు, కక్ష తీర్చుకునేవాడు. అంటే ఒకసారి మిమ్మల్ని సముద్రంలో తుఫాన్ నుండి క్షేమంగా బయట పెట్టిన తర్వాత ఆయన (అల్లాహుతా'ఆలాయే) మీ అవిధేయతకు కారణంగా మీరు మరల సముద్రంలోకి పోయినపుడు మిమ్మల్ని ముంచి వేయ వచ్చని మీరు భయపడరా? అప్పుడు ఆయన (సు.తా.)కు విరుద్ధంగా మీకు, మీ కల్పిత దైవాలు ఎవ్వరూ సహాయపడలేరు.

التفاسير: