पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन्हम् ।

external-link copy
111 : 16

یَوْمَ تَاْتِیْ كُلُّ نَفْسٍ تُجَادِلُ عَنْ نَّفْسِهَا وَتُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟

ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో![1] ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.[2] info

[1] పునరుత్థాన దినమున, ఒకరు మరొకరిని గురించి పట్టించుకోరు. తల్లిదండ్రులు తమ సంతానాన్ని లెక్క చేయరు. మరియు సంతానం తమ తోబుట్టిన వారిని గానీ, తల్లిదండ్రులను గానీ పట్టించుకోరు. ఇంకా చూడండి, 80:37. [2] పుణ్యం చేసిన వారికి, అల్లాహ్ (సు.తా.) కరుణిస్తే ఎన్నో రెట్లు అధికంగా పుణ్యఫలితం ప్రసాదిస్తాడు. కాని పాపం చేసిన వారికి దానంతట శిక్ష మాత్రమే విధిస్తాడు. శిక్షించుటలో ఎలాంటి అన్యాయం జరుగదు.

التفاسير: