[1] ఎవరైతే విశ్వసించరో వారు ఒక ప్రవక్త ('అ.స.) యొక్క తండ్రి గానీ, కుమారుడు గానీ, లేక భార్య గానీ, అతని కుటుంబానికి చెందిన వారు కాజాలరు. [2] ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేయరో వారిని అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి, దైవప్రవక్త ('అ.స.) కూడా రక్షించలేరు. అలాంటప్పుడు ఈ కాలంలో కొందరు ఏ విధంగానైతే అపోహలలో పడి ఉన్నారో వారిని, వారి పీర్లు, సజ్జాదాలు, వలీలు రక్షిస్తారని అనేది ఎలా సంభవం కాగలదు? [3] దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అగోచర జ్ఞానం కేవలం అల్లాహుతా'ఆలా కు మాత్రమే ఉంది. ప్రవక్తలకు కేవలం అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా తెలిపిన జ్ఞానం మాత్రమే ఉంటుంది.