വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

external-link copy
58 : 7

وَالْبَلَدُ الطَّیِّبُ یَخْرُجُ نَبَاتُهٗ بِاِذْنِ رَبِّهٖ ۚ— وَالَّذِیْ خَبُثَ لَا یَخْرُجُ اِلَّا نَكِدًا ؕ— كَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّشْكُرُوْنَ ۟۠

మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంటనిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) నుండి నాసిరకం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపేవారికి మా సూచనలను వివరిస్తాము.[1] info

[1] దైవప్రవక్త ('స.అస) ప్రవచనం: "అల్లాహ్ (సు.తా.) నాకు ఇచ్చి పంపిన జ్ఞానం మరియు మార్గదర్శకత్వపు ఉదాహరణ, ధారాళంగా కురిసే వర్షం లాంటిది. దానిని కొన్ని ప్రాంతాలలోని నేల పీల్చుకొని మంచి పంటలు, ఫలాలు పుష్కలంగా ఇస్తుంది. మరికొన్ని గట్టి ప్రాంతాలు నీటిని నిలబెట్టి తరవాత పండే పంటలకు, నీరు పారటానికి ఉపయోగబడతాయి. కాని ఏ రాళ్ళ నేల అయితే నీటిని పీల్చుకోలేదో, లేక దానిని ఆపలేదో, అది దానిని ఏ విధంగాను ఉపయోగించుకోలేదు. ఈ ఉదాహరణలు ఆ మానవుని వంటివి ఎవడైతే అల్లాహ్ ధర్మాన్ని అర్థం చేసుకుంటాడో మరియు అల్లాహుతా'ఆలా నాకు ఇచ్చి పంపిన దానితో మంచి ఫలితం పొందుతాడో! అతడు తాను కూడా జ్ఞానం పొందుతాడు మరియు ఇతరులకు కూడా బోధిస్తాడు. మరొక వ్యక్తి ఉదాహరణ కూడా ఇలా ఉంది: ఎవడైతే స్వయంగా కూడా జ్ఞానం మరియు హితబోధ పొందడు, దేనితోనైతే నేను పంపబడ్డానో. ('స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్-'ఇల్మ్, బాబ్ ఫ'ద్ల్ మినల్ 'ఇల్మ్).

التفاسير: