വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

പേജ് നമ്പർ:close

external-link copy
131 : 7

فَاِذَا جَآءَتْهُمُ الْحَسَنَةُ قَالُوْا لَنَا هٰذِهٖ ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّطَّیَّرُوْا بِمُوْسٰی وَمَنْ مَّعَهٗ ؕ— اَلَاۤ اِنَّمَا طٰٓىِٕرُهُمْ عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు.[1] వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు. info

[1] 'తాఇ'రున్: ఎగురుట. 'తాఇ'రుహుమ్: అపశకునం. ప్రాచీన కాలంలో శుభ - అశుభ శకునాలను పక్షులను ఎగుర వేసి అంచనా వేసేవారు. శకునాలు చూడటం ఇస్లాంలో 'హరాం. శకునాలను గురించి ఇంకా చూడండి, 3:49, 5:110, 17:13, 27:47 మరియు 36:18-19.

التفاسير:

external-link copy
132 : 7

وَقَالُوْا مَهْمَا تَاْتِنَا بِهٖ مِنْ اٰیَةٍ لِّتَسْحَرَنَا بِهَا ۙ— فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِیْنَ ۟

మరియు వారు (మూసాతో) అన్నారు: "నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము!" info
التفاسير:

external-link copy
133 : 7

فَاَرْسَلْنَا عَلَیْهِمُ الطُّوْفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ اٰیٰتٍ مُّفَصَّلٰتٍ ۫— فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِیْنَ ۟

కావున మేము వారిపై జలప్రళయం (తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము.[1] అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి. info

[1] ఈ తొమ్మిది అద్భుత సూచనలు: 1) కర్ర, 2) చేయి తెల్లగా మారుట, 3) కరువు (ఫల, పంటల నష్టం, 4) జల ప్రళయం (తుఫాను), 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం, 9) సముద్రంలో త్రోవ.

التفاسير:

external-link copy
134 : 7

وَلَمَّا وَقَعَ عَلَیْهِمُ الرِّجْزُ قَالُوْا یٰمُوْسَی ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ— لَىِٕنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ۚ

మరియు వారిపైకి ఆపద వచ్చినపుడు వారనేవారు: "ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాయీల్ సంతతి వారిని తప్పక నీ వెంట పంపుతాము." info
التفاسير:

external-link copy
135 : 7

فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ اِلٰۤی اَجَلٍ هُمْ بٰلِغُوْهُ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟

కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే - ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి - వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు! info
التفاسير:

external-link copy
136 : 7

فَانْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ فِی الْیَمِّ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِیْنَ ۟

కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచి వేశాము; ఎందుకంటే! వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్టకుండా ఉన్నారు. info
التفاسير:

external-link copy
137 : 7

وَاَوْرَثْنَا الْقَوْمَ الَّذِیْنَ كَانُوْا یُسْتَضْعَفُوْنَ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِیْ بٰرَكْنَا فِیْهَا ؕ— وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنٰی عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ۬— بِمَا صَبَرُوْا ؕ— وَدَمَّرْنَا مَا كَانَ یَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهٗ وَمَا كَانُوْا یَعْرِشُوْنَ ۟

మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడేవారిని మేము శుభాలతో నింపిన, ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము.[1] ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయీల్ సంతతి వారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం, వారు ఓర్పు వహించి నందుకు పూర్తయింది.[2] మరియు ఫిర్ఔన్ మరియు అతని జాతి వారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనం చేశాము.[3] info

[1] చూడండి, 3:26. [2] ఈ వాగ్దానం కొరకు చూడండి, 7:128-129 మరియు 28:5-6. [3] ఇస్రాయీ'ల్ సంతతివారు, బహుశా సూయుజ్ అగాధం (Gulf of Suez) దాటి సినాయి వైపుకు వెళ్ళారు. మరియు ఫిర్'ఔను మరియు అతని సైన్యం అందులో మునిగి పోయారు.

التفاسير: