[1] దైవప్రవక్త ('స'అస) ప్రస్థానం చేసి మక్కా నుండి మదీనాకు వలస వచ్చినప్పుడు మదీనా చుట్టుప్రాంతాలలో మూడు యూద తెగలవారు ఉండేవారు. 1) బనూ-ఖైనుఖా'అ, 2) బనూ-న'దీర్ మరియు 3) బనూ-ఖురై"జహ్. దైవప్రవక్త ('స'అస) వారందరితో సంధి చేసుకుంటారు. బనూ-ఖైనుఖా'అ తెగవారు తమ దౌర్జన్యాల వల్ల వెడలగొట్టబడతారు. దానికి చూడండి, 59:15 వ్యాఖ్యానం. 2. బనూ-నదీర్' తెగవారు 3వ హిజ్రీలో, ముస్లింలకు ఉ'హుద్ యుద్ధరంగంలో కొంత నష్టం కలిగినందుకు, దైవప్రవక్త ('స'అస) తో తమ సంధిని తెంపుకుంటారు. అతనిని చంపటానికి ప్రయత్నిస్తారు. ముష్రిక్ ఖురైషులతో కలిసి ముస్లింలను పూర్తిగా నిర్మూలించాలని పన్నాగాలు పన్నుతారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస) వారితో: 'మాతో యుద్ధం చేయటానికి సిద్ధపడండి లేక మదీనా విడిచి వెళ్ళిపోండి!' అనే రెండు దారులు చూపుతారు. వారు వెళ్ళి పోవటానికి ఒప్పుకొని, పది రోజుల గడువు కోరుతారు. ఈ మధ్య వారు కపటవిశ్వాసుల నాయకుడైన 'అబ్దుల్లా బిన్ ఉబైతో రహస్యసమాలోచనలు చేస్తారు. అతడు వారితో: 'మీరు యుద్ధం చేస్తే మీకు మేము రెండు వేల యుద్ధవీరులతో సహాయం చేస్తాము. కావున మీ కోటలను వదలి వెళ్ళకండి! ఒకవేళ ముస్లింలు మిమ్మల్ని వెడలగొడితే మేము కూడా మీ వెంట వస్తాము!' అని అంటాడు. అప్పుడు ముస్లింలు వారి కోటలను 21 రోజులు చుట్టుముట్టి ఉంచుతారు. 'అబ్దుల్లా ఇబ్నె ఉబై వారికి సహాయపడనందుకు, ముస్లింల అనుమతితో తాము తీసుకోగల సామాగ్రి తీసుకొని వెళ్ళిపోతారు.
[1] లీనతున్: ఒక రకపు ఖర్జూరపు చెట్టు. ఏ విధంగానైతే అజ్వా, బర్నీ ఉన్నాయో.
[1] శత్రువు యుద్ధానికి ముందే పారిపోయి వదిలే సామగ్రిని ఫయ్'ఉన్ అంటారు. యుద్ధంలో విజయం పొందిన తరువాత దొరికే సామగ్రిని 'గనీమత్ అంటారు. చూడండి, 8:41.
[1] యుద్ధబూటీ / విజయధనం (మాలె 'గనీమత్) నుండి, 1/5వ వంతులో మాత్రమే ఇలాంటి వారికి హక్కు ఉంది. కాని ఫయ్అ' లో పూర్తి ఆదాయాన్ని ఇలాంటి వారిలోనే పంచాలి. ఎందుకంటే ఇక్కడ యుద్ధం చేసి గెలిచిన వారంటూ ఎవరూ లేరు.
[1] ఇందులో, ఫయ్అ' యొక్క ఒక భాగాన్ని వలస వచ్చిన వారికి ఇవ్వాలని పేర్కొనబడింది. దానితో పాటు వలస వచ్చిన వారి (ముహాజిర్ ల) గొప్పతనం కూడా వివరించబడింది. వారిని గురించి అల్లాహ్ (సు.తా.) ఇలాంట ఆయత్ అవతరింపజేసిన తరువాత కూడా వారి విశ్వాసాన్ని అనుమానించటం, ఖుర్ఆన్ ను తిరస్కరించటమే!
[1] వీరు - ముహాజిర్ లు మదీనాకు రాకముందే - విశ్వసించిన మదీనా వాసులైన అన్సారులు. ఫయ్అ' ధనం మొదట ముహాజిర్ లకు పంచి పెట్టబడినా, వీరు అసూయపడలేదు.
[2] 'మిమ్మల్ని మీరు లోభం నుండి రక్షించుకోండి. ఈ లోభమే పూర్వకాలపు వారిని నాశనం చేసింది. అదే వారిని రక్తపాతానికి గురిచేసింది. మరియు వారు నిషిద్ధ ('హరామ్) వస్తువులను ధర్మసమ్మతం ('హలాల్) చేసుకున్నారు.' ('స'హీ'హ్ ముస్లిం).
[1] వీరు ఫయ్అ'కు హక్కుదారులైన మరొకరకం వారు. వీరు సహాబీల తరువాత తరం వారు మరియు వారి అడుగుజాడలలో నడిచేవారు. వీరిలో తాబ'యీన్ మరియు వారిని అనుసరించిన వారూ మరియు పునరుత్థాన దినం వరకు ఈమాన్ లో ప్రవేశించే వారందరూ ఉన్నారు! ఇమామ్ మాలికి (ర'హ్మ) ఈ ఆయత్ వ్యాఖ్యానంలో అన్నారు: 'రాఫజీ, ఎవరైతే 'స'హాబా (ర'.ది.'అన్హుమ్) లను దూషిస్తారో, వారికి ఫయ్అ' ధనంలో భాగం లేదు. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) 'స'హాబా (ర'.ది.'అన్హుమ్)లను పొగుడుతున్నాడు. మరియు వారేమో స'హాబా (ర.'ది.'అన్హుమ్)లను దూషఇస్తున్నారు.' (ఇబ్నె-కసీ'ర్). 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం: మీరు స'హాబా (ర'.ది'అన్హుమ్) ల కొరకు ఇస్తి'గ్ ఫార్ చేయండని, దైవప్రవక్త ('స'అస) ఆజ్ఞాపించబడ్డారు. కాని మీరు వారిని దూషిస్తున్నారు. నేను మీ ప్రవక్త ('స'అస) ను ఇలా అంటూ ఉండగా విన్నాను: 'ఈ జాతిలోని చివరివారు తమ మొదటి వారిని శపించనంత వరకూ ఈ జాతి నశించదు!' (బ'గవీ ఈ 'హదీస్' ను ఉల్లేఖించారు.
[1] చూఈ ఆయత్ లు (11-14లు) ముస్లింలు, బనూ-న'దీర్ వారిపైకి దాడి చేయటానికి వెళ్ళకముందు అవతరింపజేయబడ్డాయి.
[1] ఈ ఆయత్ మునాఫిఖుల బూటక వాగ్దానాలను వివరిస్తోంది. అలాగే జరిగింది. బనూ-న'దీర్ తెగవారిని వారి ఇండ్ల నుండి వెడలగొట్టినప్పుడూ మరియు బనూ-ఖురై"జహ్ తెగవారిని బంధించి నప్పుడూ, ఈ కపట విశ్వాసులు వారికి ఎలాంటి సహాయం చేయలేదు.
[1] ఈ ఆయత్ 2వ హిజ్రీలో, బద్ర్ యుద్ధం తరువాత మదీనానుండి వెడలగొట్టబడిన బనూ-ఖైనుఖా'అ తెగవారిని ఉద్దేశించిందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇది 2వ హిజ్రీలో మక్కా ముష్రికులతో జరిగిన బద్ర్ యుద్ధానికి సంబంధించినదని, (ఇభ్నె-కసీ'ర్).
[1] చూడండి, 8:48 మరియు 14:22.
[1] అల్-మలికు: Sovereign, విశ్వసార్వభౌముడు, చక్రవర్తి, విశ్వాధిపతి, సర్వాధికారి, చూడండి, 20:114 వ్యాఖ్యానం 3.
అల్-ఖుద్దూసు: All Holy, All Pure, పరమపవిత్రుడు, పరిశుద్ధుడు, పావనుడు, చూ. 62:1.
అస్-సలాము: Author of Safety and Security, Free from all defects, imperfections, blemish or vices, శాంతికి మూలాధారి, సురక్షితుడు, సర్వదౌర్బల్యాలకు, బలహీనతలకు అతీతుడు.
అల్-మూ'మిను: He who Maketh mankind Secure from His punishment. శాంతి ప్రదాత, శాంతిమయుడు, సకల ఆపదలు యాతనల నుండి కాపాడి ప్రశాంతిని ప్రసాదించేవాడు. భద్రత నిచ్చేవాడు.
అల్-ముహైమిను: Preserver of Safety, One who determines what is true and false, and He who will faithfully perform to His servants what He has promised them. శరణమిచ్చేవాడు, సంరక్షకుడు, సత్యాసత్యాలను పరిష్కరించే, నిర్ణయించే వాడు, తన సృష్టిని కనిపెట్టుకొని ఉండేవాడు, జాగరూకుడు.
[1] అల్-'ఖాలిఖు: The Creator of all things. సృష్టికర్త. చూడండి, 6:103.
అల్-బారిఉ':The Maker, ప్రతిదాని నిర్మాత, ఎట్టి పోలిక, సామ్యం లేకుండా ప్రతి దానిని సృజించేవాడు. లేమి నుండి ఉనికి లోకి తెచ్చేవాడు. చూడండి: 2:54
అల్-ము'సవ్విరు: The Fashioner, of all existing things, రూపమిచ్చేవాడు, తాను కోరిన విధంగా తన సృష్టి రూపాన్ని తీర్చిదిద్దేవాడు. 3:6.
అల్-'హకీము: All-Wise, Possessing knowledge or Science, Omniscient, మహో వివేకవంతుడు, వివేచనాపరుడు. చూడండి, 2:32. ఇంకా చూడండి, 7:180. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.