വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

external-link copy
31 : 4

اِنْ تَجْتَنِبُوْا كَبَآىِٕرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَنُدْخِلْكُمْ مُّدْخَلًا كَرِیْمًا ۟

ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము[1]. info

[1] అబూ హరైరా (ర'ది.'అ.) కథనం, దైవప్రవక్త ('స'అస) అన్నారు : "ఏడు మహా పాపాల నుండి దూరంగా ఉండండి. అవి : 1) ఆరాధనలో అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించటం, 2) మంత్రజాలం పాటించటం, 3) ఎవరినైనా హత్య చేయటం (న్యాయానికి తప్ప), 4) వడ్డీ తినటం 5) అనాథుల ఆస్తిని కబళించటం, 6) యుద్ధరంగం నుండి వెన్ను చూపి పారిపోవటం మరియు 7) పతివ్రత స్త్రీలపై అపనింద మోపటం." ('స.బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 840).

التفاسير: