വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

external-link copy
187 : 2

اُحِلَّ لَكُمْ لَیْلَةَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآىِٕكُمْ ؕ— هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّ ؕ— عَلِمَ اللّٰهُ اَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَكُمْ فَتَابَ عَلَیْكُمْ وَعَفَا عَنْكُمْ ۚ— فَالْـٰٔنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا كَتَبَ اللّٰهُ لَكُمْ ۪— وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰی یَتَبَیَّنَ لَكُمُ الْخَیْطُ الْاَبْیَضُ مِنَ الْخَیْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِ ۪— ثُمَّ اَتِمُّوا الصِّیَامَ اِلَی الَّیْلِ ۚ— وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِی الْمَسٰجِدِ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَا ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟

ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతెకాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి[1]. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని! info

[1] చూడండి, 7:189. ఏ'తెకాఫ్: అంటే మస్జిద్ లో అల్లాహ్ (సు.తా.) ను ధ్యానిస్తూ ఏకాంతంగా గడపటం. ఏ'తెకాఫ్ పాటించేవారు స్త్రీలతో సంభోగించరాదు. కాలకృత్యాలకు తప్ప, మస్జిద్ విడిచి బయటికి పోరాదు. తోటివారితో అనవరమైన మాట్లలో పడరాదు.

التفاسير: