[1] నా దాసుడు నా సాన్నిహిత్యాన్ని పొందటానికి నేను అతనికి విధి ఫ'ర్దగా చేసిన వాటిపై అమలు చేస్తాడు. ఆ తరువాత నవాఫిల్ ద్వారా కూడా మరింత నా సాన్నిహిత్యాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. మరియు నేను అతనిని ప్రేమిస్తాను. నేను అతనిని ప్రేమించినపుడు నేను అతని చెవి అవుతాను దానితో అతడు వింటాడు. అతని కన్ను అవుతాను దానితో అతడు చూస్తాడు, అతని చేయి అవుతాను దానితో అతడు పట్టుకుంటాడు, కాలు అవుతాను దానితో అతడు నడుస్తాడు మరియు అతడు నన్ను అడిగిన దానిని నేను అతనికి ఇస్తాను. నన్ను శరణు వేడుకుంటే, నేను శరణు ఇస్తాను. ('స.బు'ఖారీ, కితాబ్ అర్రిఖాఖ్). దీనిని తప్పుగా అర్థం చేసుకోరాదు. ఏ మానవుడైతే తన ఆరాధన మరియు విధేయతలో కేవలం అల్లాహ్ (సు.తా.) నే ప్రత్యేకించుకుంటాడో అతడు అల్లాహ్ (సు.తా.)కు ఇష్టం లేనటువంటిది ఏదీ వినడు, చూడడు, చేయడు మరియు పలకడు. అతడు చేసే ప్రతికార్యం కేవలం అల్లాహ్ (సు.తా.) సంతుష్టి పొందడానికే ఉంటుంది.