വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ്

പേജ് നമ്പർ:close

external-link copy
7 : 10

اِنَّ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا وَرَضُوْا بِالْحَیٰوةِ الدُّنْیَا وَاطْمَاَنُّوْا بِهَا وَالَّذِیْنَ هُمْ عَنْ اٰیٰتِنَا غٰفِلُوْنَ ۟ۙ

నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచన (ఆయాత్) లను గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో! info
التفاسير:

external-link copy
8 : 10

اُولٰٓىِٕكَ مَاْوٰىهُمُ النَّارُ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟

అలాంటి వారి ఆశ్రయం - తమ కర్మలకు ఫలితంగా - నరకాగ్నియే! info
التفاسير:

external-link copy
9 : 10

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ یَهْدِیْهِمْ رَبُّهُمْ بِاِیْمَانِهِمْ ۚ— تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని వారి విశ్వాసఫలితంగా వారి ప్రభువు వారిని సన్మార్గం మీద నడిపిస్తాడు. వారి క్రింద పరమ సుఖాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో, సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. info
التفاسير:

external-link copy
10 : 10

دَعْوٰىهُمْ فِیْهَا سُبْحٰنَكَ اللّٰهُمَّ وَتَحِیَّتُهُمْ فِیْهَا سَلٰمٌ ۚ— وَاٰخِرُ دَعْوٰىهُمْ اَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟۠

అందులో వారి ప్రార్థన: "ఓ అల్లాహ్! నీవు సర్వలోపాలకు అతీతుడవు." అని మరియు వారి అభివందనం: "అస్సలాము అలైకుం (మీకు శాంతి కలుగు గాక)!" అని, మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను: "సర్వస్తోత్రాలకు అర్హుడు సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే!" అని ముగించుకుంటారు. info
التفاسير:

external-link copy
11 : 10

وَلَوْ یُعَجِّلُ اللّٰهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُمْ بِالْخَیْرِ لَقُضِیَ اِلَیْهِمْ اَجَلُهُمْ ؕ— فَنَذَرُ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟

మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందర పడినట్లు అల్లాహ్ వారిపై (వారి చేష్టలకు) కీడును పంపటంలో తొందర పడి ఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది. అందువలన మేము, మమ్మల్ని కలుసుకునే నమ్మకంలేని వారిని, తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగటానికి వదలిపెడుతున్నాము.[1] info

[1] చూడండి, 6:12.

التفاسير:

external-link copy
12 : 10

وَاِذَا مَسَّ الْاِنْسَانَ الضُّرُّ دَعَانَا لِجَنْۢبِهٖۤ اَوْ قَاعِدًا اَوْ قَآىِٕمًا ۚ— فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهٗ مَرَّ كَاَنْ لَّمْ یَدْعُنَاۤ اِلٰی ضُرٍّ مَّسَّهٗ ؕ— كَذٰلِكَ زُیِّنَ لِلْمُسْرِفِیْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు, అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి, వారి చేష్టలు ఆకర్షణీయమైనవిగా చూపబడతాయి. info
التفاسير:

external-link copy
13 : 10

وَلَقَدْ اَهْلَكْنَا الْقُرُوْنَ مِنْ قَبْلِكُمْ لَمَّا ظَلَمُوْا ۙ— وَجَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ وَمَا كَانُوْا لِیُؤْمِنُوْا ؕ— كَذٰلِكَ نَجْزِی الْقَوْمَ الْمُجْرِمِیْنَ ۟

మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము,[1] ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు; మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా, వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము. info

[1] చూడండి, 6:131-132. ఖర్ నున్: అంటే, ఒకే కాలానికి, లేక తరానికి చెందిన ప్రజలు.

التفاسير:

external-link copy
14 : 10

ثُمَّ جَعَلْنٰكُمْ خَلٰٓىِٕفَ فِی الْاَرْضِ مِنْ بَعْدِهِمْ لِنَنْظُرَ كَیْفَ تَعْمَلُوْنَ ۟

వారి తరువాత - మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడటానికి - మేము మిమ్మల్ని భూమికి వారసులుగా చేశాము. info
التفاسير: