വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

പേജ് നമ്പർ:close

external-link copy
17 : 59

فَكَانَ عَاقِبَتَهُمَاۤ اَنَّهُمَا فِی النَّارِ خَالِدَیْنِ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۟۠

షైతాన్ వ్యవహారము పర్యవసానము మరియు అతనిని అనుసరించిన వాడి పర్యవసానము వారిద్దరు (అంటే అనుసరించబడిన షైతాను మరియు అనుసరించిన మనిషి) ప్రళయదినమున నరకాగ్నిలో ఉంటారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఈ ప్రతిఫలము ఏదైతే వారి కొరకు నిరీక్షిస్తున్నదో అది అల్లాహ్ హద్దులను అతిక్రమించి తమ స్వయం పై దుర్మార్గమునకు పాల్పడిన వారి ప్రతిఫలము. info
التفاسير:

external-link copy
18 : 59

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۚ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మరియు ప్రతి మనిషి ప్రళయదినం కొరకు ముందు చేసుకున్న సత్కర్మను గురించి యోచన చేయాలి. మరియు మీరు అల్లాహ్ కు భయపడండి. నిశ్ఛయంగా అల్లాహ్ మీరు చేసుకున్న కర్మల గురించి తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
19 : 59

وَلَا تَكُوْنُوْا كَالَّذِیْنَ نَسُوا اللّٰهَ فَاَنْسٰىهُمْ اَنْفُسَهُمْ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟

మరియు మీరు అల్లాహ్ ను ఆయన ఆదేశములను పాటించటమును వదిలి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండకుండా మరచిపోయిన వారిలా అవ్వకండి. అల్లాహ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు. అప్పుడు వారు అల్లాహ్ క్రోదము నుండి,ఆయన శిక్ష నుండి తమను రక్షించే కార్యాలు చేయలేదు. వారందరు అల్లాహ్ ను మరచిపోయారు - వారు ఆయన ఆదేశములను పాటించలేదు మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగ లేదు - వారే అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన వారు. info
التفاسير:

external-link copy
20 : 59

لَا یَسْتَوِیْۤ اَصْحٰبُ النَّارِ وَاَصْحٰبُ الْجَنَّةِ ؕ— اَصْحٰبُ الْجَنَّةِ هُمُ الْفَآىِٕزُوْنَ ۟

నరక వాసులు మరియు స్వర్గ వాసులు సరిసమానులు కారు. అంతే కాదు వారు ఇహలోకములో తమ కర్మలు వేరైనట్లుగానే తమ ప్రతిఫలము విషయములో వేరుగా ఉంటారు. స్వర్గ వాసులు వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి ముక్తి పొంది సాఫల్యం చెందుతారు. info
التفاسير:

external-link copy
21 : 59

لَوْ اَنْزَلْنَا هٰذَا الْقُرْاٰنَ عَلٰی جَبَلٍ لَّرَاَیْتَهٗ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْیَةِ اللّٰهِ ؕ— وَتِلْكَ الْاَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ ۟

ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏదైన పర్వతంపైనైనా అవతరింపజేస్తే ఓ ప్రవక్తా మీరు ఆ పర్వతమును అది దృఢముగా ఉండి కూడా అల్లాహ్ యొక్క తీవ్ర భయం వలన అణిగిపోయి బ్రద్దలైపోవటమును చూస్తారు. ఖుర్ఆన్ లో కల హితోపదేశముల హెచ్చరికలు మరియు తీవ్ర బెదిరింపుల వలన. మరియు మేము ఈ ఉపమానములను ప్రజలకు విశదపరుస్తున్నాము బహుశా వారు తమ బుద్దులను ఆచరణలో పెట్టి దాని ఆయతులలో పొందుపరచబడిన హితోపదేశములతో,గుణపాఠములతో హితోపదేశం గ్రహిస్తారని. info
التفاسير:

external-link copy
22 : 59

هُوَ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ ۚ— هُوَ الرَّحْمٰنُ الرَّحِیْمُ ۟

ఆయనే అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. గోప్యంగా ఉన్న వాటిని మరియు బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఇహపరాల కరుణామయుడు మరియు వాటిలో కృపాశీలుడు. ఆయన కారుణ్యము సర్వలోకాలను విస్తరించి ఉన్నది. రాజాధిరాజు,ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ప్రతీ లోపము నుండి భద్రమైన వాడు. అద్భుత ఆయతులతో తన ప్రవక్తలను దృవీకరించేవాడు. తన దాసుల కర్మలపై పరిరక్షకుడు.ఎవరు ఓడించని సర్వశక్తిమంతుడు. తన పరాక్రమతో ప్రతీ వస్తువుపై ఆధిక్యతను చూపే పరాక్రమవంతుడు. పెద్దరికం గలవాడు.అల్లాహ్ ముష్రికులు ఆయనతో పాటు సాటి కల్పించే విగ్రహాలు ఇతరవాటి నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. info
التفاسير:

external-link copy
23 : 59

هُوَ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— اَلْمَلِكُ الْقُدُّوْسُ السَّلٰمُ الْمُؤْمِنُ الْمُهَیْمِنُ الْعَزِیْزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یُشْرِكُوْنَ ۟

ఆయనే అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. గోప్యంగా ఉన్న వాటిని మరియు బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఇహపరాల కరుణామయుడు మరియు వాటిలో కృపాశీలుడు. ఆయన కారుణ్యము సర్వలోకాలను విస్తరించి ఉన్నది. రాజాధిరాజు,ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ప్రతీ లోపము నుండి భద్రమైన వాడు. అద్భుత ఆయతులతో తన ప్రవక్తలను దృవీకరించేవాడు. తన దాసుల కర్మలపై పరిరక్షకుడు.ఎవరు ఓడించని సర్వశక్తిమంతుడు. తన పరాక్రమతో ప్రతీ వస్తువుపై ఆధిక్యతను చూపే పరాక్రమవంతుడు. పెద్దరికం గలవాడు.అల్లాహ్ ముష్రికులు ఆయనతో పాటు సాటి కల్పించే విగ్రహాలు ఇతరవాటి నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. info
التفاسير:

external-link copy
24 : 59

هُوَ اللّٰهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰی ؕ— یُسَبِّحُ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠

ఆయనే అల్లాహ్ ప్రతీ వస్తువును సృష్టించిన సృష్టికర్త, వస్తువులకు ఉనికిని ప్రసాదించేవాడు ,తాను తలచిన విధంగా తన సృష్టిరాసులకు రూపకల్పన చేసేవాడు, ఉన్నత గుణాలను కల మంచి నామములు పరిశుద్ధుడైన ఆయన కొరకే కలవు. ఆకాశములలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ ప్రతీ లోపము నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మశాసనములలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• من علامات توفيق الله للمؤمن أنه يحاسب نفسه في الدنيا قبل حسابها يوم القيامة.
విశ్వాసపరునికి అల్లాహ్ అనుగ్రహ సూచనలలోంచి ఆయన స్వయంగా ఇహలోకములో ప్రళయదినము లెక్క తీసుకోవటం కన్న ముందు లెక్క తీసుకోవటం. info

• في تذكير العباد بشدة أثر القرآن على الجبل العظيم؛ تنبيه على أنهم أحق بهذا التأثر لما فيهم من الضعف.
మహా పర్వతంపై ఖుర్ఆన్ యొక్క బలమైన ప్రభావాన్ని దాసులకు గుర్తు చేయటంలో వారిలో ఉన్న బలహీనత వలన ఈ ప్రభావమునకు వారు ఎక్కువ హక్కు దారులని ఒక హెచ్చరిక. info

• أشارت الأسماء (الخالق، البارئ، المصور) إلى مراحل تكوين المخلوق من التقدير له، ثم إيجاده، ثم جعل له صورة خاصة به، وبذكر أحدها مفردًا فإنه يدل على البقية.
(అల్ ఖాలిక్,అల్ బారి,అల్ ముసవ్విర్) ఈ పేర్లు సృష్టి రాసులు సృష్టి దశలైన వాటి అంచనా వేయటం,ఆ తరువాత వాటిని ఉనికిలోకి తీసుకుని రావటం ఆ తరువాత వాటికి ఒక ప్రత్యేక రూపమును చేయటం వైపునకు సూచిస్తున్నవి. మరియు వాటిలో నుండి ఒక దానిని ప్రస్తావిస్తే అది మిగితా వాటిని సూచిస్తుంది. info